హాంగ్ కాంగ్‌లో గూగుల్ డేటా సెంటర్‌..

Posted By: Prashanth

హాంగ్ కాంగ్‌లో గూగుల్ డేటా సెంటర్‌..

 

చైనా ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం. అలాంటి చైనాలో ఏదైనా టెక్నాలజీ సక్సెస్‌ని సాధించిందంటే చాలు ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న మారుమూల చిన్న చిన్న దేశాలకు వెళుతుంది. అందుకు కారణం టెక్నాలజీలో చైనా తమ ఉత్పత్తులు కానీ వాటికి విధించే ఆంక్షలు వర్ణాతీతం. ఇందుకు సాక్ష్యాలు గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ జీమెయిల్ లాంటి వాటిని గత కొన్నేళ్లుగా చైనా బాధిస్తున్న విషయం తెలిసిందే. ఐనా సరే టెక్నాలజీ కంపెనీలు చైనాని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఏదో ఒక రకంగా చైనాలో పాతుకుపోవాలని చూస్తున్నారు.

ఇదే కోవలోకి ఇప్పుడు కొత్తగా సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ చేరింది. చైనాలో ఉన్న హాంగ్ కాంగ్ పట్టణంలో సుమారు 300 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టి 2013వ సంవత్సరంలో కెల్లా కొత్త డేటా సెంటర్‌ని స్దాపించనున్నట్లు అధికారకంగా ధృవీకరించింది. ఇంత ఎక్కువ డబ్బుని గూగుల్ మొత్తం భూమి, బిల్డింగ్స్, ఆఫీసు వస్తువులకు ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ డేటా సెంటర్‌కు సంబంధించి 25 మంది ఉద్యోగులను నిమాయకం చేసుకొవడం జరిగిందని, 2013వ సంవత్సరం నుండి పూర్తి అందుబాటులోకి ఈ డేటా సెంటర్ వస్తుందని ఆసియా గూగుల్ హార్డ్ వేర్ ఆపరేషన్స్ హెడ్ సిమాన్ ఛాంగ్ తెలిపారు.

ఇది మాత్రమే కాకుండా రాబోయే రెండు సంవత్సరాలలో గూగుల్ తనయొక్క డేటా సెంటర్స్‌ని సింగపూర్, తైవాన్‌లో ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. హాంగ్ కాంగ్ సిటి గూగుల్ చైనీస్ సెర్చ్ ఇంజన్‌ ఇల్లు లాంటిది. చైనా ఫేమస్ సెర్చ్ ఇంజన్ బైదుకి గూగుల్ చైనాలో గట్టి పోటీనిస్తున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot