Google Play Store నుండి 2000 పైగా యాప్‌లు తొలగింపు...

|

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లలో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. షాపింగ్ లేదా మరేదైనా ఇతర విషయాల కోసం ప్రతి ఒక్కరు కూడా యాప్‌ల మీదనే ఆధారపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొంత మంది స్కామర్లు వినియోగదారులను మోసగించే ఉద్దేశంతోనే రకరకాల యాప్‌లను విడుదల చేస్తున్నారు. జనవరి మరియు జూన్ మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన యొక్క ప్లే స్టోర్ నుండి 2000 కంటే ఎక్కువ లోన్ యాప్‌లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని హానికరమైన వ్యక్తిగత లోన్ యాప్‌లు భారతదేశంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులతో డబ్బును దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచించిన తర్వాత గూగుల్ సంస్థ ఈ ప్రకటనను విడుదల చేసింది. చట్టపరమైన విధంగా ఈ సంస్థలతో సంప్రదించిన తర్వాత వీటిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఒక నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వ్యక్తిగత లోన్

భారత ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా వ్యక్తిగత లోన్ లను అందించే మరొక 300 యాప్‌లను నిషేధించాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ హానికరమైన యాప్‌లు ఎక్కువగా చైనాకు కనెక్ట్ చేయబడి ఉండడం అనేది గమనార్హం. వీటిలో చాలా యాప్‌లు మనీలాండరింగ్‌కు కూడా లింక్ చేయబడి ఉన్నాయి. బ్లాక్ చేయబడిన యాప్‌లు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయని గూగుల్ సీనియర్ డైరెక్టర్ మరియు ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సైకత్ మిత్రా పేర్కొన్నారు. ఇలాంటి దోపిడీ యాప్‌ల నుండి వినియోగదారులను కాపాడుకోవడానికి టెక్ దిగ్గజం తన ప్లే స్టోర్ విధానంలో మరిన్ని మార్పులను తీసుకురానున్నట్లు తెలియజేశారు. కొత్త మార్పులలో భాగంగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్‌లు వాటి యొక్క అర్హతను రుజువు చేసుకోవడం కోసం అదనపు రుజువును భారత ప్రభుత్వానికి అందివ్వవలసి ఉంటుంది అని గూగుల్ తెలిపింది.

NBFCలు

వ్యక్తిగత రుణాలను అందించే యాప్‌లకు గల అర్హతలో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారి యొక్క లైసెన్స్ కాపీ మరియు వారు నేరుగా మనీ లెండింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై లేరని మరియు రిజిస్టర్డ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) ద్వారా మనీ లెండింగ్‌ను సులభతరం చేయడానికి మాత్రమే అందిస్తున్నారని డిక్లరేషన్‌ను కలిగి ఉండాలి.

RBI
 

"వ్యక్తిగత రుణాలను అందించడానికి మీరు RBI నుండి లైసెన్స్ పొందినట్లయితే, మా సమీక్ష కోసం మీరు తప్పనిసరిగా మీ లైసెన్స్ కాపీని సమర్పించాలి" మరియు "మీరు నేరుగా మనీ లెండింగ్ కార్యకలాపాలలో పాల్గొనకపోతే మరియు రిజిస్టర్డ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) లేదా బ్యాంకుల ద్వారా వినియోగదారులకు మనీ లెండింగ్‌ను సులభతరం చేసే ప్లాట్‌ఫారమ్‌ను మాత్రమే అందజేస్తుంటే కనుక మీరు దీన్ని డిక్లరేషన్‌లో ఖచ్చితంగా ప్రతిబింబించాలి" అని కంపెనీ ఇటీవలి బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.

లోన్ యాప్ స్కామ్ ఎలా జరుగుతుంది

లోన్ యాప్ స్కామ్ ఎలా జరుగుతుంది

ఎవరైనా వినియోగదారులకు డబ్బు అవసరం పడినప్పుడు పర్సనల్ లోన్ అప్లికేషన్‌లలో ఒకదానిని డౌన్‌లోడ్ చేసినప్పుడు వారు కనీస బ్యాక్‌గ్రౌండ్ చెక్‌తో డబ్బును తీసుకోవడానికి అనుమతించబడతారు. యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వినియోగదారుల యొక్క సంప్రదింపు వివరాలు మరియు గ్యాలరీకి యాక్సెస్‌ను పొందడం కోసం వివిధ రకాల అనుమతులను అడుగుతుంది.

కాంటాక్ట్ లిస్ట్

లోన్ యాప్ నుండి డబ్బు స్వీకరించిన తర్వాత తిరిగి చెల్లించాల్సిన గడువు తేదీ కంటే ముందే వినియోగదారులకు బెదిరింపుతో కూడిన మెసేజ్ లు రావడం ప్రారంభమవుతాయి. వినియోగదారులు వారి కాంటాక్ట్ లిస్ట్ మరియు ఇమేజ్ గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చినందున యాప్ యజమానులు అభ్యంతరకరమైన చిత్రాలను యూజర్ల యొక్క కాంటాక్ట్ లిస్ట్‌కు పంపుతున్నట్లు బెదిరించడం ప్రారంభిస్తారు. అలా జరగకుండా ఆపడానికి వారు అంగీకరించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బును డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు. వినియోగదారులు వారు తీసుకున్న లోన్ మొత్తంకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడంతో బెదిరింపులు ముగుస్తాయి.

Best Mobiles in India

English summary
Google Removes 2000 Fraud Personal Loan Apps From Play Store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X