'గూగుల్ టివి' త్వరలో అందరికి అందుబాటులోకి..

Posted By: Prashanth

'గూగుల్ టివి' త్వరలో అందరికి అందుబాటులోకి..

 

2012 కొత్త సంవత్సరంలోకి తన సత్తా చాటేందుకు గాను సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 'గూగుల్ టివి'ని ప్రవేశపెట్టనుంది. గూగుల్ టివి కోసం గాను గూగుల్ టివి అప్లికేషన్స్ సెట్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 'స్మార్ట్ టివి కాన్పెస్ట్' తో హాల్ చల్ చేస్తున్న శాంసంగ్, సోనీ టివీలకు గూగుల్ ఈ విధంగా గట్టి పోటీనిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

గూగుల్ కొత్తగా రూపొందించిన ఈ గూగుల్ టివి టెక్నాలజీ మార్కెట్లో తప్పకుండా పెద్ద సక్సెస్‌ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతక ముందు మార్కెట్లోకి విడుదల చేసిన టివీలకు గూగుల్ టివి గట్టి పోటీనిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో గూగుల్ టివిని ఎక్కువగా ఉపయోగించే దేశాలు లండన్, అమెరికాలు కాగా, దీనిని దృష్టిలో పెట్టుకోనీ గూగుల్ టివి టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు.

గూగుల్ టివి రాకతో స్మార్ట్ టివి రంగంలో నిర్ణయాత్మక మార్పలు చోటుకోనున్నాయని అన్నారు. ఈ సందర్బంలో గూగుల్ ఛైర్మన్ మాట్లాడుతూ సోనీ ఇప్పుటికే స్మార్ట్ టివి రంగంలో వెనుకబడడం వల్ల మేము ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశిస్తే ఎక్కువ సక్సెస్‌ని సాధించగలుగుతామని స్పష్టం చేశారు. గూగుల్ విడుదల చేయనున్న ఈ స్మార్ట్ టివిలను ఆఫీసులు, ఇంటర్నెట్ సెంటర్లు, ఇళ్లులో ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఆపిల్ కూడా 2012లో తాను రూపొందిస్తున్న స్మార్ట్ టివిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఐతే ఆపిల్ తన ఉత్పత్తిని విడుదల చేసినప్పటికీ, గూగుల్ షేర్స్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. దీనిని బట్టి త్వరలో గూగుల్ ఇంటర్నెట్‌తో పాటు స్మార్ట్ టివిని జీవితాంతం ఎంజాయ్ చేసేందుకు యూజర్స్‌ సిద్దంగా ఉండాలని కోరుకుంటున్నాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot