Jio 5G Welcome Offer లాంచ్ అయింది ! ఫ్రీ 5G పొందాలంటే మీరు ఏమి చేయాలి ?

By Maheswara
|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో టెలికాం సంస్థ ఇప్పటికే కొన్ని నగరాల్లో 5G సేవలను లాంచ్ చేయడం ద్వారా వార్తలలో సందడి చేసింది. రాబోయే రోజుల్లో, ఇది ఇతర నగరాలకు కూడా తన 5G సేవలను అందించనుంది. ప్రస్తుతం ఢిల్లీ - NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, నాథద్వారా, బెంగళూరు మరియు హైదరాబాద్‌ నగరాలలో Jio నిజమైన 5G సేవలను అందిస్తోంది. అలాగే ఈ నగరాలలో 5G కోసం గొప్ప వెల్ కమ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

 Jio True 5G

అవును, జియో టెలికాం తన 5G నెట్‌వర్క్ యొక్క Jio True 5G ని ఉచితంగా కనెక్ట్ చేసి ఆనందించడానికి కస్టమర్‌లకు welcome ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన జియో కస్టమర్లకు ఈ జియో వెల్‌కమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌ని పొందడానికి అర్హతలు ఏమి ఉండాలో ఒకసారి గమనించండి.

ఈ ఆఫర్‌ని పొందడానికి అర్హతలు

ఈ ఆఫర్‌ని పొందడానికి అర్హతలు

* వినియోగదారులు తప్పనిసరిగా Jio 5G నెట్‌వర్క్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి.
* తప్పనిసరిగా Jio 5G నెట్‌వర్క్ కవరేజ్ అందుబాటులో ఉన్న నగరంలో ఉండాలి.
* ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తప్పనిసరిగా రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్లాన్‌లను రీచార్జి చేసి ఉండాలి.

Jio 5G వెల్‌కమ్ ఆఫర్ అంటే ఏమిటి?

Jio 5G వెల్‌కమ్ ఆఫర్ అంటే ఏమిటి?

Jio 5G వెల్‌కమ్ ఆఫర్ ప్రస్తుతం అర్హత ఉన్న ఢిల్లీ - NCR, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ మరియు 5 ఇతర నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఈ 5G ఆఫర్‌లో, Jio తన వినియోగదారులకు 1gbps వేగంతో అపరిమిత 5G డేటాను అందిస్తోంది.

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలి?

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలి?

Jio వెల్‌కమ్ ఆఫర్ ను మీ పొందాలంటే ఇది Jio ఆహ్వానం ఆధారంగా ఉంటుంది. కాబట్టి Jio 5G కనెక్టివిటీ ఉన్న నగరాల్లోని ప్రతి ఒక్కరూ ఈ ఆహ్వానాన్ని పొందలేరు. నివేదికల ప్రకారం ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్‌పై రూ. 239. Jio యాక్టివ్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఉచిత 5G సేవల కోసం ఆహ్వానాన్ని పంపుతుంది. మీరు ఈ ఆహ్వానాన్ని పొందినట్లైతే మీరు ఈ 5G సేవలను వినియోగించడానికి అవకాశం ఉంది.

5G సిమ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు

5G సిమ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు

జియో యొక్క 5G నెట్‌వర్క్‌కి మీరు కనెక్ట్ కావడానికి కొత్త 5G సిమ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని Jio ఇంతకుముందు తన వినియోగదారులకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం మీరు వాడుతున్న Jio 4G SIM ద్వారానే కొత్త 5G కనెక్టివిటీ ని వాడుకోవచ్చు. మీ ఫోన్ లోని My Jio యాప్‌లో వెల్‌కమ్ ఆఫర్‌కు సంబంధినచిన Jio ఆహ్వానాన్ని పంపుతుంది. ఈ విషయంలో, మీరు Jio 5G సపోర్ట్ ఉన్న నగరంలో ఉన్నట్లయితే, మీరు MyJio యాప్‌లో వెల్‌కమ్ ఆఫర్‌ కోసం చూడవచ్చు.

2023 నాటికి

2023 నాటికి

Jio 5G సేవలు 2023 నాటికి ఇండియాలో అన్ని పట్టణాలు, నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. Jio ఇంకా ఈ ట్రూ 5G సేవ కోసం నిర్దిష్ట ప్లాన్‌లను విడుదల చేయలేదు. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని నగరాలకు ఈ 5G సేవను విస్తరించిన తర్వాత Jio కొత్త 5G ప్లాన్‌లను ప్రారంభించనుంది. జియో ఈ సంవత్సరం చివరి నాటికి ప్రధాన నగరాలకు 5g సేవలను అందించాలని మరియు 2023 నాటికి దేశంలోని అన్ని పట్టణాలు,నగరాలకు పాన్ ఇండియా స్థాయిలో సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G News : Jio 5G Welcome Offer Launched, How To Get Free Jio 5G ? Here Are Full Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X