జియో లోగో వెనుక దాగిన రహస్యం అదే..!

జియో అనే పేరు ఎలా వచ్చిందనడానికి రిలయన్స్ సంస్థ ఏ వివరణ ఇవ్వకపోయినా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి.

By Hazarath
|

కొద్ది రోజుల క్రితం దేశమంతా జియో ఫీవర్ లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా జియో ఫోన్ కోసం జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఫోన్ కళ్లు చెదిరిపోయే ఫీచర్లతో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఇంతటి హైప్ క్రియేట్ చేసిన ఈ జియో అనే పేరు ఎలా వచ్చిందనడానికి రిలయన్స్ సంస్థ ఏ వివరణ ఇవ్వకపోయినా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియోఅనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

అద్దంలో జియో ప్రతిబింబం చూస్తే

అద్దంలో జియో ప్రతిబింబం చూస్తే

అద్దంలో జియో ప్రతిబింబం చూస్తే ఆయిల్ లాగా కనిపిస్తుంది. రిలయన్స్‌కు ఆయిల్ సంస్థలు కూడా ఉన్నాయి, కనుక ఈ అర్థం వచ్చేలా జియో అనే పెరు పెట్టారని కొందరి అభిప్రాయం.

హిందీలో జియో అనగా జీవించు అనే అర్థం

హిందీలో జియో అనగా జీవించు అనే అర్థం

రెండోది హిందీలో జియో అనగా జీవించు అనే అర్థం వస్తుంది. కనుక జియో డిజిటల్ లైఫ్ అనగా డిజిటల్ జీవితాన్ని జీవించండి అనే అర్థం వస్తుందని కొందరు జియో ప్రతినిధులు చెప్తున్నారు.

రిలయన్స్ డేటా అనేది న్యూ ఆయిల్

రిలయన్స్ డేటా అనేది న్యూ ఆయిల్

ఇదిలా ఉంటే అంబాని ఓ సందర్భంలో ఓ విషయం చమత్కరించారు. అదేంటంటే రిలయన్స్ డేటా అనేది న్యూ ఆయిల్ అని ఇంటిలిజెంట్ డేటా అనేది పెట్రోల్ అని చమత్కరించారు. అయితే ఈ విషయాన్ని జనాలు అంతగా పట్టించుకోవపోవడంతో అది కాస్తా తెర వెనక్కి వెళ్లిపోయింది.

జియో డేటా ఉచితంగా ఇవ్వడం వల్ల

జియో డేటా ఉచితంగా ఇవ్వడం వల్ల

ఇక జియో డేటా ఉచితంగా ఇవ్వడం వల్ల కంపెనీకి వచ్చిన నష్టం రూ. 10 వేల కోట్లు అనుకుంటే రిలయన్స్ నుంచి వస్తున్న పెట్రోల్ ధరల పెంపు వల్ల అదే కంపెనికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఓ అంచనా..

జియోపై రిలయన్స్ ఎంత ఖర్చు పెట్టినా

జియోపై రిలయన్స్ ఎంత ఖర్చు పెట్టినా

ఏదిఏమైనా మార్కెట్లోని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జియోపై రిలయన్స్ ఎంత ఖర్చు పెట్టినా దానికి డబుల్ వేరే మార్గాల ద్వారా రాబట్టుకునే అవకాశం రిలయన్స్ కు ఉందని చెబుతారు.

Best Mobiles in India

English summary
There’s A Hidden Message Behind Reliance’s JIO Logo And The Theory Is Quite Interesting Read more At Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X