పాప్-అప్ కెమెరాతో హానర్ 55-inch 4K టీవీ:ధర&స్పెసిఫికేషన్స్

|

ప్రముఖ చైనా సంస్థలు మొబైల్ రంగంతో పాటు టీవీ రంగాలను కూడా శాసిస్తున్నాయి. అందులో MI మరియు హువాయిమొదటి స్థానంలో ఉన్నాయి. ఇండియాలో మొబైల్ విషయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హానర్ కూడా ఇప్పుడు టీవీ రంగంలోకి ప్రవేశిస్తున్నది. హువాయి యొక్క సబ్ బ్రాండ్ హానర్ కొత్తగా ప్రకటించిన హార్మొనీOS చేత నడిచే మొదటి ఉత్పత్తులను ఆవిష్కరించింది.

 
honor vision honor vision pro smart tvs launched features indian price

హానర్ విజన్ మరియు హానర్ విజన్ ప్రోగా పిలువబడే ఈ కొత్త ఉత్పత్తులను సంస్థ స్మార్ట్ స్క్రీన్ పరికరాలు 55-అంగుళాల 4K UHD స్క్రీన్‌తో వస్తాయి. అంతేకాకుండా ఇవి క్వాడ్-కోర్ హోంగూ 818 చిప్‌తో పనిచేస్తాయి. ఈ రెండు మోడళ్లు వచ్చే వారం చైనాలో అమ్మకాలు జరపనున్నాయి. హానర్ సంస్థ వీటిని అంతర్జాతీయంగా విడుదల చేయాలని యోచిస్తున్నది.

ధర :

ధర :

హానర్ విజన్ ధర సుమారు 38,200 రూపాయలు. రెండవది పాప్-అప్ కెమెరాతో ఉన్న హానర్ విజన్ ప్రో ధర సుమారు రూ. 48,200. ఇది ఇప్పటికే Vmall ద్వారా ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. మరియు ఆగస్టు 15 నుండి చైనాలో అమ్మకం జరుగుతుంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

హానర్ విజన్ మరియు హానర్ విజన్ ప్రో రెండు 55 అంగుళాల 4K (3840 × 2160 పిక్సెల్స్) డిస్ప్లేతో NTSC 87 శాతం వైడ్ కలర్ ప్యానల్, 16: 9 కారక నిష్పత్తితో కలర్ డిస్ప్లే, 60HZ రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్ నెస్ మరియు చూడడానికి వీలుగా 178 డిగ్రీల కోణాలతో వస్తుంది. డిస్ప్లే లో జర్మన్ TUV రైన్‌ల్యాండ్ కు చెందిన కంటికి రక్షణ కలిగించే బ్లూ-ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది. స్మార్ట్ టీవీలు మూడు-వైపుల పూర్తి-వీక్షణ కోసం మంచి బెజెల్ రూపకల్పనను కలిగి ఉంటాయి. ఇవి సన్నని నిర్మాణంతో కేవలం 6.9mm మందంతో మరియు వెనుక భాగంలో డైమండ్-నమూనాను కలిగి ఉంటాయి.

ఫీచర్స్:
 

ఫీచర్స్:

రెండు హానర్ విజన్ మోడల్స్ Mali-G51 GPU మరియు 2 జిబి ర్యామ్‌తో జత చేసిన హోంగూ 818 క్వాడ్-కోర్ SoC చేత శక్తిని కలిగి ఉన్నాయి. ప్రాసెసర్‌లో మోషన్ ఎస్టిమేట్ అండ్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC), హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్ (HDR), సూపర్-రిజల్యూషన్ (SR), నాయిస్ రెడ్యూషన్ (NR), డైనమిక్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్‌మెంట్ (DCI), ఆటో కలర్ మేనేజ్‌మెంట్ (ACM) మరియు లోకల్ డిమ్మింగ్ (LD) వంటి ఫీచర్స్ ఉన్నాయి.

స్టోరేజీ:

స్టోరేజీ:

హానర్ విజన్ టీవీ 16 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుండగా హానర్ విజన్ ప్రో టీవీ 32 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇవి రెండు హార్మొనీOS 1.0 తో రన్ అవుతాయి.వీటి యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11 a/b/g/n/ac, మూడు HDMI పోర్ట్‌లు, ఒక USB 3.0 పోర్ట్ మరియు ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి.

పాపప్ కెమెరా:

పాపప్ కెమెరా:

హానర్ విజన్ ప్రో టీవీ పాపప్ కెమెరా సహాయంతో 1080p @ 30fps వద్ద వీడియో కాలింగ్‌ను అందిస్తుంది. మరియు వీడియో కాలింగ్ అనుభవం కోసం ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఆరు ఫీల్డ్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది. పాపప్ కెమెరాను 10 డిగ్రీల క్రిందికి కూడా సర్దుబాటు చేయవచ్చు. ప్రో వేరియంట్లో ఆరు 10W స్పీకర్లు ఉండగా, హానర్ విజన్ నాలుగు 10W స్పీకర్లను మాత్రమే కలిగి ఉంది.

రిమోట్:

రిమోట్:

హానర్ విజన్ మరియు హానర్ విజన్ ప్రో స్మార్ట్ హోమ్ హబ్‌గా పనిచేస్తాయి. AI సామర్థ్యాలకు మ్యాజిక్ UI 3.0 మరియు EMUI 10 యొక్క అంశాలను ఉపయోగించవచ్చు. ఈ రెండు స్మార్ట్ స్క్రీన్ పరికరాలు వాతావరణ సమాచారం, ట్రాక్ ప్యాకేజీలు మరియు మరెన్నో చూపించగలవు. అదనంగా హానర్ మ్యాజిక్ లింక్ మద్దతుతో కూడా వస్తాయి. ఇది వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా వారి హానర్ విజన్ను రిమోట్గా నియంత్రించడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
honor vision honor vision pro smart tvs launched features indian price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X