స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

Posted By:

ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన టెక్ దిగ్గజం దివంగత స్టీవ్ జాబ్స్‌ 60వ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా మంగళవారం (ఫిబ్రవరి 24న) ఘనంగా నిర్వహించారు. సాంకేతికతను మరింత సజీవం చేసిన స్టీవ్ జాబ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. స్టీవ్ జాబ్స్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రస్తుత యాపిల్ సీఈఓ టిమ్ కుక్, జాబ్స్ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా 2005లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 2005 ప్రారంభోత్సవ ప్రసంగంలో భాగంగా జాబ్స్ అన్న ‘‘ఓ గొప్ప పనిని విజయవంతం చేయాలంటే, ఆ పనిని ఎంతో ఇష్టపడి చేయటమక్కొటే మార్గం'' మాటలను కుక్ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్టీవ్ జాబ్స్ జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

1944 ఫిబ్రవరి 24న శాన్‌ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్, క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరారు. ఆయన లారెన్ పాల్‌ను 1991లో పెళ్లి చేసుకున్నారు.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్షర్ యానిమేషన్ స్టూడియోస్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్‌ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవి నుండి తొలగించారు.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు.. టిమ్ కుక్ స్పందన

తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు..ఆసక్తికర వాస్తవాలు

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్లీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు..ఆసక్తికర వాస్తవాలు

కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు..ఆసక్తికర వాస్తవాలు

ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది.

స్టీవ్ జాబ్స్ పుట్టినరోజు..ఆసక్తికర వాస్తవాలు

శ్వాసకోసకేన్సర్‌ వ్యాధితో స్టీవ్‌ జాబ్స్‌ అక్టోబర్ 2011లో మరణించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Apple’s Tim Cook Honored Steve Jobs’s Birthday. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot