ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో డ్యూయెల్ వాట్సప్ అకౌంట్లను వాడటం ఎలా ?

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ లేరు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నాక... అందులో వాట్సప్ ఉండకుండా ఉంటుంది. వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ లవ్‌డ్ మెసేజింగ్ యాప్ ఇది.ఛాట్ లవింగ్ యాప్ అయిన వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.

 
ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో డ్యూయెల్ వాట్సప్ అకౌంట్లను వాడటం ఎలా ?

కంపెనీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. కొత్త కొత్త అప్ డేట్లను అందిస్తూ అందరికీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో రెండు వాట్సప్ లను ఒకేసారి వాడటం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం.

 

ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లను,
ఇప్పటివరకు మనకు ఫోన్లో రెండు సిమ్స్ ఉన్నా వాట్సప్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఒక సిమ్‌ నెంబర్‌తోనే మనం వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేస్తుంటాం. రెండు నెంబర్లున్నా రెండు వాట్సప్ అకౌంట్లను మాత్రం ఒకేసారి వాడలేం. అయితే ఇక నుంచి ఆ బాధ లేకుండా మనం ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లను ఉపయోగించొచ్చు.పర్సనల్‌గా ఒక అకౌంట్, ఆఫీస్‌కు సంబంధించి మరొక వాట్సప్‌ను వాడొచ్చు.

ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో డ్యూయెల్ వాట్సప్ అకౌంట్లను వాడటం ఎలా ?

స్టెప్ 1
ముందుగా వాట్సప్ యాప్‌రు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్‌తో వాట్సప్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2
ఒకవేళ మీ ఫోన్‌లో వాట్సప్ ఆల్ రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంటే మాత్రం అవసరం లేదు. వాట్సప్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

స్టెప్ 3
ఆ తర్వాత ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోని యాప్స్‌‌లోకి వెళ్లాలి. అక్కడ డ్యూయెల్ యాప్/క్లోన్ యాప్/యాప్ ట్విన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో వాట్సప్ ఎంచుకోండి.

స్టెప్ 4
ఫోన్ యాప్స్‌లో రెండు వాట్సప్‌లు కనిపిస్తాయి. ఇంకొక నెంబర్‌పై రెండో అకౌంట్‌ కూడా క్రియేట్ చేసుకోండి. అయితే ఒకవేళ మీ ఫోన్‌లో డ్యూయెల్ ఉంటే ఓకే లేకపోతే మాత్రం పారలెల్ స్పేస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో డ్యూయెల్ వాట్సప్ అకౌంట్లను వాడటం ఎలా ?

క్లోన్ ఆప్షన్,
వాట్సప్ ఒక్కటే కాకుండా ఫేస్‌బుక్, మెసేంజర్ వంటి యాప్స్‌ కూడా క్లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఒకే ఫోన్‌లో రెండు అకౌంట్లు ఈజీగా వినియోగించుకోవచ్చు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనం చాలా సులభంగా మన అకౌంట్లను ఈజీగా వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
2 WhatsApp accounts in one phone: How to use dual WhatsApp on the same Android smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X