హువాయి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

చైనా కంపెనీ హువాయి స్మార్ట్ ఫోన్లతో పాటుగా ల్యాప్‌టాప్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నది. హువాయి సంస్థ నేడు నాలుగు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. Windows 11 ఫీచర్లతో హువాయి మేట్‌బుక్ 16s, మేట్‌బుక్ D16, మేట్‌బుక్ 14 2022 మరియు మేట్‌బుక్ D14 2022 పేరుతో హువాయి కంపెనీ కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ నాలుగు మోడల్‌లు 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. ఈ మేట్‌బుక్ మోడల్‌ల సిరీస్ లో మేట్‌బుక్ 16s ప్రీమియం మోడల్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో మరియు టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కొత్త ల్యాప్‌టాప్‌లతో పాటుగా హువాయి మేట్‌వ్యూ SE మానిటర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త ల్యాప్‌టాప్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

హువాయి కొత్త ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలు

హువాయి కొత్త ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలు

హువాయి కంపెనీ నేడు విడుదల చేసిన కొత్త ల్యాప్‌టాప్‌ల యొక్క ధరల విషయానికి వస్తే హువాయి మేట్‌బుక్ 16s కోర్ i5 వెర్షన్ యొక్క ధర CNY 6,999 (సుమారు రూ. 81,400) నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ కోర్ i7 మోడల్‌ CNY 7,999 (సుమారు రూ. 93,100) ధరను కలిగి ఉంది. అలాగే టాప్-ఎండ్ కోర్ i9 ఎంపిక CNY 9,999 (దాదాపు రూ. 1,16,400) ధరను కలిగి ఉంది. మరోవైపు హువాయి మేట్‌బుక్ D16 యొక్క కోర్ i5 వేరియంట్ CNY 5,699 (దాదాపు రూ. 66,300) ప్రారంభ ధరను కలిగి ఉంది. అలాగే కోర్ i7 మోడల్ CNY 6,699 (సుమారు రూ. 78,000) ధర వద్ద ఉంది. అయితే హువాయి మేట్‌బుక్ 14 2022 యొక్క కోర్ i5 వేరియంట్ CNY 6,099 (దాదాపు రూ. 71,000) ధర వద్ద ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లోని కోర్ i7 మోడల్ ధర CNY 6,999 (సుమారు రూ. 81,400). మరొకటి హువాయి మేట్‌బుక్ D14 2022 యొక్క కోర్ i5 మోడల్ ధర CNY 5,299 (దాదాపు రూ. 61,700) నుండి ప్రారంభమవుతుంది. అలాగే కోర్ i7 మోడల్ ధర CNY 5,999 (సుమారు రూ. 69,800) వరకు ఉంటుంది.

హువాయి మేట్‌బుక్ 16s స్పెసిఫికేషన్స్
 

హువాయి మేట్‌బుక్ 16s స్పెసిఫికేషన్స్

హువాయి మేట్‌బుక్ 16s ల్యాప్‌టాప్‌ విండోస్11తో రన్ అవుతుంది. ఇది 3:2 కారక నిష్పత్తితో 2,520x1,680 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 300 nits గరిష్ట ప్రకాశంతో 16-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే దీని యొక్క డిస్ప్లే టచ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది హుడ్ కింద 12వ తరం ఇంటెల్ కోర్ i9-12900H ప్రాసెసర్‌తో రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ మరియు 16GB LPDDR5 ర్యామ్‌ను కలిగి ఉంది. 1TB వరకు NVMe PCIe SSD నిల్వ కూడా ఉంది. ఇది ఫుల్-సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉండి టచ్‌ప్యాడ్‌తో జత చేయబడడమే కాకుండా ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పొందుపరచబడిన పవర్ బటన్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ

ల్యాప్‌టాప్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో HDMI ఛార్జింగ్, డేటా బదిలీ మరియు డిస్ప్లేపోర్ట్ మద్దతుతో USB టైప్-C; థండర్‌బోల్ట్ 4, USB-A 3.2 Gen 1, 3.5mm ఆడియో కాంబో జాక్, Wi-Fi 6 మరియు బ్లూటూత్ v5.2, డ్యూయల్ స్పీకర్లు మరియు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఇది 84Wh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 135W వరకు USB టైప్-C పవర్ అడాప్టర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

హువాయి మేట్‌బుక్ D16 స్పెసిఫికేషన్స్

హువాయి మేట్‌బుక్ D16 స్పెసిఫికేషన్స్

హువాయి మేట్‌బుక్ D16 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది విండోస్ 11తో రన్ అవుతూ MateBook 16sలోని 16-అంగుళాల IPS డిస్‌ప్లే అదే పరిమాణాన్ని కలిగి ఉంది. కానీ ఇది 1,920x1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 16:10 కారక నిష్పత్తిని అందిస్తుంది. ఇది ఇన్‌పుట్‌ల కోసం టచ్ సపోర్ట్‌ని కూడా కలిగి ఉండదు. MateBook D16 12వ తరం ఇంటెల్ కోర్ i7-12700H ప్రాసెసర్‌తో పాటు Intel Iris Xe గ్రాఫిక్స్ మరియు 16GB LPDDR4x RAMతో వస్తుంది. 512GB NVMe PCIe SSD కూడా ఉంది. అలాగే ఇది ఫింగర్‌ప్రింట్ సెన్సార్-ఎంబెడెడ్ పవర్ బటన్ మరియు టచ్‌ప్యాడ్‌తో ఫుల్-సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో రెండు USB టైప్-C పోర్ట్‌లు, USB 2.0, USB 3.2 Gen 1, HDMI మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఇది Wi-Fi 6 మరియు బ్లూటూత్ v5.2 మద్దతును కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Huawei Brand Launched MateBook 16s, MateBook D16, MateBook 14 2022, MateBook D14 2022 Four Laptops: Price, Specs, India Launch Date and More.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X