మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!

By Maheswara
|

భారత ప్రభుత్వంచే నియంత్రించ బడుతున్న, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) సంస్థ, వినియోగదారుల కంప్యూటర్లు ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని బగ్‌లు మరియు లోపాలను పర్యవేక్షించే మరియు హెచ్చరించే ప్రభుత్వ సంస్థ. ఇది ప్రస్తుతం, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్‌లో అనేక కొత్త లోపాలను కనుగొంది. వీటి కారణంగా మీ కంప్యూటర్లు సైబర్ దాడి కి గురయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నష్టం కూడా 'అధిక' తీవ్రత లో ఉంటుందని కూడా హెచ్చరించింది.

 
Indian Government Issued An Important Warning To Microsoft Users. Here Is How You Can Avoid It.

CERT-In వెబ్‌సైట్‌లో ప్రకించిన ఈ హెచ్చరిక యొక్క సలహా ప్రకారం "మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Chromium-ఆధారిత) బ్రౌజర్ లో అనేక లోపాలు కనుక్కోబడ్డాయి, వీటి ద్వారా సైబర్ దాడి చేసేవారు సులభంగా యాక్సిస్ ను పొందేందుకు మరియు మీ కంప్యూటర్ పై భద్రతను తగ్గించడానికి ఉపయోగిస్తారు".

 

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోని (Chromium-ఆధారిత) ఈ కొత్త లోపాలను ఉపయోగించుకొని రిమోట్ సైబర్ దాడి చేసేవారు, సున్నితమైన డేటాను దొంగిలించడానికి మరియు భద్రతా వలయాలను దాటి మీ కంప్యూటర్ లపై మరింత నియంత్రణను పొందేందుకు అనుమతించవచ్చని CERT-IN సంస్థ తమ ప్రకటనలో వెల్లడించారు. "ఈ లోపాలు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (క్రోమియం ఆధారితం)లో ఉన్నాయి. హ్యాకర్, వినియోగదారుని కంప్యూటర్లో ప్రత్యేకంగా రూపొందించిన రిక్వెస్ట్ పంపడం ద్వారా ఈ లోపాలను ఉపయోగించుకొని వారి కంప్యూటర్ ని హ్యాక్ చేయవచ్చు ," అని నోట్‌లో వివరించారు.

Indian Government Issued An Important Warning To Microsoft Users. Here Is How You Can Avoid It.

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోని ఈ లోపాల కారణంగా, ఏ యే అప్డేట్ లు ప్రభావితమవుతాయి?

విండోస్ ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ 109.0.1518.61 కి ముందున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్‌లు ఇటీవల గుర్తించిన ఈ లోపాల వల్ల ప్రభావితమవుతున్నాయని CERT-IN నివేదిక పేర్కొంది.

ఈ ప్రమాదం నుండి మీ కంప్యూటర్లను ఎలా రక్షించుకోవాలి?

విండోస్ ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ 109.0.1518.61కి ముందు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్‌లు ప్రభావితమైనట్లు ప్రభుత్వ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ లాపాల నుండి మీ కంప్యూటర్ల లను రక్షించడానికి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ యొక్క తాజా వెర్షన్‌కు మీరు మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయవలసి ఉంటుందని CERT-IN వినియోగదారులకు సలహా ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే ఈ కొత్త వెర్షన్ 109.0.1518.61ని విడుదల చేసింది, ఇది ఈ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు వినియోగదారులు తమ కంప్యూటర్లను రక్షించుకోవడానికి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

Indian Government Issued An Important Warning To Microsoft Users. Here Is How You Can Avoid It.

మీ కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి?

మీ కంప్యూటర్ లో ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటే, అప్‌డేట్ ప్రాంప్ట్ కోసం వెతకండి . మీ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయమని మీకు ఇప్పటికే నోటిఫికేషన్ రాకపోతే, మీరు కొత్త అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా కూడా వెతక వచ్చు. ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

* మీ బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
* సెట్టింగ్‌లను చూడండి.
* సెట్టింగ్‌ల క్రింద, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి క్లిక్ చేయండి.
* తాజా అప్‌డేట్‌ని వెతికి, ఇన్‌స్టాల్ చేయడానికి బ్రౌజర్ కోసం వేచి ఉండండి.
* కొత్త అప్డేట్ ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత వెబ్ బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి.

Indian Government Issued An Important Warning To Microsoft Users. Here Is How You Can Avoid It.

మీ కంప్యూటర్ లో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఎందుకు అప్డేట్ చేయాలి?

మీ కంప్యూటర్ లో బ్రౌజర్‌ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భద్రత కోసం : మీ బ్రౌజర్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వలన ఏదైనా భద్రతా లోపాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. తద్వారా మీ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

కంప్యూటర్ పనితీరు మెరుగవుతుంది: అప్డేట్ చేయబడిన బ్రౌజర్‌లు వేగంగా మరియు మరింత సమర్థవంతంగా పని చేయడానికి మార్చబడతాయి, దీని కారణంగా మెరుగైన బ్రౌజింగ్ అనుభవం లభిస్తుంది.

కొత్త ఫీచర్లు అప్డేట్ అవుతాయి: బ్రౌజర్ అప్‌డేట్‌లు తరచుగా కొత్త ఫీచర్లు తీసుకువస్తాయి, ఇవి బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా, మరింత సౌకర్యవంతంగా మరియు సమర్థవంతంగా చేస్తాయి.

వెబ్‌సైట్‌ల కు అనుకూలంగా ఉంటాయి: కొత్త వెబ్ టెక్నాలజీ మరియు ప్రమాణాలకు అనుకూలంగా ఉండే బ్రౌజర్‌ని కలిగి ఉండటం ముఖ్యం.

లోపాలు పరిష్కరించబడతాయి: మీ బ్రౌజింగ్ అనుభవంతో సమస్యలను కలిగించే ఏవైనా లోపాలు లేదా సమస్యలు కూడా ఈ అప్‌డేట్‌ల తో పరిష్కరించబడతాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Indian Government Issued An Important Warning To Microsoft Users. Here Is How You Can Avoid It.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X