Infinix Hot 12 కొత్త ఫోన్ వచ్చే వారం లాంచ్ కానున్నది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి....

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఇటీవల భారతదేశంలో 90Hz డిస్ప్లే, 50MP కెమెరా వంటి మరిన్ని గొప్ప ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఇన్ఫినిక్స్ బ్రాండ్ దేశంలో హాట్ 12 సిరీస్ విభాగంలో కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఇన్ఫినిక్స్ హాట్ 12 పేరుతో రాబోతున్న కొత్త ఫోన్ ఈ నెలలోనే వచ్చే వారంలో లాంచ్ కానున్నట్లు నిర్ధారించబడింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు లీక్ అయాయి. వీటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Infinix Hot 12 ఇండియా లాంచ్ డేట్ & ధరల వివరాలు

Infinix Hot 12 ఇండియా లాంచ్ డేట్ & ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ సంస్థ తన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క విడుదల తేదీని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 17న భారతదేశంలో ప్రారంభం కానున్నది. ఈ లాంచ్ యొక్క లైవ్ Flipkartలో ప్రత్యేక్ష ప్రసారం కానున్నది. దురదృష్టవశాత్తూ ఈ యొక్క ధర వెల్లడి కాలేదు. అయితే ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అవుతుందని కొన్ని లీక్ లు తెలిపాయి. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో ఇండియాలో రూ.10,999 ధర వద్ద లాంచ్ అయింది. అంటే వెనిలా వేరియంట్ రూ.10,000 ధర బ్రాకెట్‌లోపు వస్తుందని ఆశించవచ్చు. ఇది టర్కోయిస్ సియాన్, పోలార్ బ్లాక్, ఎక్స్‌ప్లోరేటరీ బ్లూ మరియు 7డిగ్రీ పర్పుల్ వంటి బహుళ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది అని భావిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 12 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ బ్రాండ్ షేర్ చేసిన టీజర్ వీడియో ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్ వివరాలను చూపుతుంది. దీంతో పాటు ఫోన్‌లోని కొన్ని స్పెసిఫికేషన్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ లీక్ ప్రకారం ఇన్ఫినిక్స్ హాట్ 12 ఫోన్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది అధిక 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది మరియు స్క్రీన్ 480 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది.

సెల్ఫీ స్నాపర్‌
 

ఇన్ఫినిక్స్ హాట్ 12 యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే F/1.6 ఎపర్చర్‌తో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో వస్తుంది. అదనంగా మరోక రెండు సెన్సార్ల లెన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో ఒకే సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంటుంది. అయితే మెగాపిక్సెల్ కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు ఆగాలి. అలాగే ఈ ఫోన్‌లో ఉపయోగించబడిన చిప్‌సెట్ వివరాలు ప్రస్తుతానికి తెలియదు. భద్రత కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ మద్దతుతో 6,000mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు లీక్ లు సూచిస్తున్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ధరలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ధరలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో కేవలం ఒకే ఒక సింగిల్ వేరియంట్లో లాంచ్ అయింది. 8Gb ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్లో లభించే ఈ 5G ఫోన్ వినియోగదారులకు రూ.17,999 ధర వద్ద ఫోర్స్ బ్లాక్ మరియు ఫోర్స్ వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 700nits గరిష్ట ప్రకాశంతో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రూపొందించబడిన XOS 10.6తో స్మార్ట్‌ఫోన్ షిప్పింగ్ చేయబడి ఉండి ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పాటు మాలి G57 GPU తో రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది 8GB LPDDR4X RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Hot 12 Upcoming New Smartphone Launch Date Set on August 17 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X