Infinix బ్రాండ్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ రానున్నది!! ఫీచర్స్ వివరాలు ఇవిగో...

|

ఇండియాలో ఇన్ఫినిక్స్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు విజయవంతం అయ్యాక ఇప్పుడు ఈ సంస్థ ల్యాప్‌టాప్లను విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. ఇన్ఫినిక్స్ ఇన్ బాక్స్ X1 పేరుతో ల్యాప్‌టాప్ ను త్వరలో భారతదేశంలో ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది. కొన్ని నెలల క్రితం ప్రారంభించబడిన ఇన్‌బుక్ X1 ప్రో తర్వాత కంపెనీ ప్రారంభించిన రెండవ ల్యాప్‌టాప్ ఇది. ఈ ల్యాప్‌టాప్ తేలికపాటి డిజైన్, మెటల్ బాడీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది హుడ్ కింద ఇంటెల్ కోర్ i3, కోర్ i5 మరియు కోర్ i7 ప్రాసెసర్‌లను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించిన మైక్రోసైట్ ప్రకారం ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఇన్ఫినిక్స్

ఇన్ఫినిక్స్ కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం ఇన్‌బుక్ X1 ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.48kg కలిగి ఉండి 16.3mm పరిమాణం కొలతలతో వస్తుంది. మరియు రాబోయే ల్యాప్‌టాప్ కోసం కంపెనీ ఆల్-మెటల్ బాడీని ప్రచారం చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ప్రకారం ఇన్‌బుక్ X1 "ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్" అల్యూమినియం ముగింపును కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్ 55Whr బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది మరియు ల్యాప్‌టాప్ ఒక్క ఛార్జ్‌పై 13 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను నిర్వహించగలదని ఇన్ఫినిక్స్ కంపెనీ పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్ అరోరా గ్రీన్, నోబుల్ రెడ్ మరియు స్టార్‌ఫాల్ గ్రే అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Jio టెల్కోకు మరో ఎదురుదెబ్బ!! 11 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది...Jio టెల్కోకు మరో ఎదురుదెబ్బ!! 11 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది...

ఇన్‌బుక్ X1 ల్యాప్‌టాప్

ఇన్‌బుక్ X1 ల్యాప్‌టాప్ అనేది ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి రెండవ ల్యాప్‌టాప్ అవుతుంది. ఈ కంపెనీ ఇటీవలే దేశంలో ఇన్‌బుక్ X1 ప్రోని ప్రారంభించింది. ఇందులో 10వ తరం ఇంటెల్ ప్రాసెసర్‌లు మరియు Intel Iris Plus గ్రాఫిక్స్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ సమయంలో ఇన్ఫినిక్స్ రాబోయే ఇన్‌బుక్ X1ని 11వ తరం ఇంటెల్ టైగర్ లేక్ ప్రాసెసర్‌లతో లాంచ్ చేస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే ల్యాప్‌టాప్ Intel Core i7 ప్రాసెసర్‌లను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇన్‌బుక్ X1 ప్రో గరిష్టంగా 300 ప్రకాశం మరియు 178 డిగ్రీల వీక్షణ కోణంతో 14-అంగుళాల (1920x1080 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

WhatsApp కొత్త ఫీచర్ యూజర్ల ప్రైవసీ విదానాన్ని పూర్తిగా మారుస్తోంది...WhatsApp కొత్త ఫీచర్ యూజర్ల ప్రైవసీ విదానాన్ని పూర్తిగా మారుస్తోంది...

ఇన్‌బుక్  X1

ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి రాబోయే ఇన్‌బుక్ X1 కూడా ప్రో మోడల్ మాదిరిగానే 55Whr Li-Po బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇది USB టైప్-C కనెక్టర్ ద్వారా 65W వద్ద ఛార్జ్ అవుతుంది. ఇన్‌బుక్ X1లో కనెక్టివిటీ ఫీచర్ల అదనపు వివరాలు ఇంకా ప్రకటించబడనప్పటికీ ఇటీవల ప్రారంభించిన ఇన్‌బుక్ X1 ప్రోలో USB టైప్-C పోర్ట్, రెండు USB 3.0 పోర్ట్‌లు, USB 2.0 పోర్ట్, HDMI పోర్ట్, 3.5mm జాక్ మరియు ఒక SD ఉన్నాయి. కార్డ్ రీడర్ ఇన్‌బుక్ X1 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో "కమింగ్ సూన్"గా జాబితా చేయబడింది మరియు రాబోయే ల్యాప్‌టాప్ కోసం ఇన్ఫినిక్స్ అధికారిక ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు.

ఇన్‌ఫినిక్స్ హాట్ 11 సిరీస్

ఇన్‌ఫినిక్స్ బ్రాండ్ ఇటీవల కాలంలో హాట్ 11 సిరీస్ లైనప్‌ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా ఇన్ఫినిక్స్ హాట్ 11 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 11S భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ రెండు Infinix స్మార్ట్‌ఫోన్‌లు 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తాయి కానీ హుడ్ కింద వేర్వేరు ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. ఇన్‌ఫినిక్స్ హాట్ 11 నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుండగా, ఇన్ఫినిక్స్ హాట్ 11s మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 11. XOS 7.6 స్కిన్‌తో రన్ అవుతూ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Infinix Inbook X1 Laptop Set to Launch in India: Price, Specs, Features and Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X