Infinix Note 12 Pro ఫోన్ 108-MP, మీడియాటెక్ హీలియో ఫీచర్లతో లాంచ్ అయింది!!

|

చైనా యొక్క ట్రాన్స్‌షన్ గ్రూప్ యాజమాన్యంలోని ఇన్ఫినిక్స్ బ్రాండ్ నేడు సరికొత్తగా ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ డిస్‌ప్లే, 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు మీడియాటెక్ హీలియో G99 SoC వంటి అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో పాటుగా DTS సరౌండ్ సౌండ్‌ స్పీకర్‌లు మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ యొక్క ధర రూ.16,999. ఈ ఫోన్ ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ మరియు వోల్కానిక్ గ్రే వంటి మూడు కలర్ ఎంపికలలో సెప్టెంబర్ 1 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మొదటి కొనుగోలులోని ఆఫర్ల విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా రూ. 1099 ధర గల Snokor XE 18 ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్‌లను కేవలం రూ.1 కే కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత XOS 10.6పై రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను 1,080 x 2,400 పిక్సెల్‌లు, 180Hz టచ్ శాంప్లింగ్ రేటు మరియు 20:9 స్పెక్ట్‌లతో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ G99 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB LPDDR4X RAMతో జతచేయబడి ఉంటుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108-మెగాపిక్సెల్ శామ్సంగ్ ISOCELL సెన్సార్‌తో మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, AI లెన్స్ కెమెరాలను క్వాడ్-LED ఫ్లాష్‌తో పాటు ప్యాక్ చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 256GB UFS 2.2 అంతర్నిర్మిత స్టోరేజ్ ను కలిగి ఉండడమే కాకుండా ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 2TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది.

కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఫోన్లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G LTE, Wi-Fi 802.11 a/b/g/n/ac లతో పాటుగా బ్లూటూత్ v5, NFC, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ లను కలిగి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, g-సెన్సార్, గైరోస్కోప్, ఇ-కంపాస్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇంకా ఇది DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరిగా ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Note 12 Pro Smartphone Launched in India With MediaTek Dimensity G99 SoC: Price, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X