Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!

By Maheswara
|

Infinix ఇటీవలే తమ పాకెట్-ఫ్రెండ్లీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల క్యాటగిరీ లోకి మరొక కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది Note 12i అనే పేరుతో లాంచ్ అయింది.ఇది 4G ఫోన్ మరియు ఇది AMOLED స్క్రీన్‌తో, రూ. 10,000 లోపు లాంచ్ అయిన ఫోన్‌లలో ఒకటి. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

 

Infinix Note 12i: క్యాష్‌బ్యాక్ ఆఫర్ ధర వివరాలు

Infinix Note 12i: క్యాష్‌బ్యాక్ ఆఫర్ ధర వివరాలు

ఈ ఫోన్ మూడు రంగులలో లభిస్తుంది - నలుపు, నీలం మరియు తెలుపు, Infinix Note 12i స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో రూ. 9,999 కి సేల్ చేయబడుతోంది. ఇంకా జియో సిమ్ పై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ కొనుగోలు చేసిన 30 రోజులలోపు మీరు ఈ పొందవచ్చు. మీరు ఫోన్‌లో జియో సిమ్‌ను ఉంచినట్లయితే మీకు ఈ రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, ఒకసారి క్యాష్‌బ్యాక్ అందుకున్నట్లయితే, ఈ ఫోన్ 30 నెలల పాటు Jio నెట్‌వర్క్‌కు లాక్ చేయబడుతుంది. కాబట్టి మీరు వేరే నెట్‌వర్క్‌కు మారలేరు.

బడ్జెట్ ధర ఫోన్‌లతో పోటీ

బడ్జెట్ ధర ఫోన్‌లతో పోటీ

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ Poco M4 Pro, Motorola G42 మరియు Redmi Note 1oS వంటి బడ్జెట్ ధర ఫోన్‌లతో పోటీపడుతుంది, ఇవన్నీ AMOLED స్క్రీన్‌లతో వస్తాయి మరియు ఒకేవిధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి కానీ కొంచెం ఎక్కువ ధర తో వస్తాయి.

Infinix Note 12i ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్‌ల వివరాలు
 

Infinix Note 12i ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్‌ల వివరాలు

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల అమోలెడ్ FullHD+ డిస్‌ప్లేతో వస్తుంది, దీని గరిష్ట ప్రకాశం 1000 నిట్ లుగా ఉంది, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ఇది రక్షించబడింది. ఇంకా ఈ ఫోన్ MediaTek Helio G85 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. ఈ ఫోన్ బాక్స్ తో పాటే, Android 12 ఆధారంగా పనిచేసే XOS 12 పై పనిచేస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలను గమనిస్తే. ఈ ఫోన్ 4GB వరకు LPDDR4X RAMని అందిస్తుంది, మరియు సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి 7GB వరకు RAM పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు

అలాగే స్టోరేజ్ విషయంలో 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక కెమెరా విషయాలు గమనిస్తే, వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ మరియు QVGA కెమెరా ఉన్నాయి, అయితే ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 8MP సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. దీని వలన తక్కువ వెలుతురులో కూడా  సెల్ఫీలు తీసుకోవడం సులభం అవుతుంది. ఇంకా చీకట్లో మరియు రాత్రి సమయాల్లో కూడా సెల్ఫీ ఫ్లాష్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది DTS సరౌండ్ సౌండ్‌ని సపోర్ట్ చేసే రెండు స్పీకర్‌లతో కూడా వస్తుంది.

బ్యాటరీ మరియు ఛార్జింగ్ వివరాలు

బ్యాటరీ మరియు ఛార్జింగ్ వివరాలు

ఈ ఫోన్  డ్యూయల్-టోన్ మ్యాట్ మరియు గ్లాస్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. మరియు పవర్ బటన్‌తో అనుసంధానించబడిన ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఫీచర్ తో వస్తుంది. ఇక చివరగా బ్యాటరీ మరియు ఛార్జింగ్ ఫీచర్ ల గురించి తెలుసుకుంటే,188 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

మరిన్ని గాడ్జెట్ ల  వివరాల కోసం గిజబోట్ తెలుగు ను చదువుతూ ఉండండి.

Best Mobiles in India

Read more about:
English summary
Infinix Note 12i Launched In India With Helio G85 Processor, 50MP Camera,33W Fast Charging. More Specifications Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X