యువతకు ప్రెండ్లీగా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో డిఫాల్ట్‌గా కీలక మార్పులు...

|

మెటా యాజమాన్యంలోని ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌ను యువతకు ఫ్రెండ్లీగా ఉండడం కోసం కొన్ని కీలక మార్పులను తీసుకొనివచ్చింది. యుక్తవయస్సు ఉన్న వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను డిఫాల్ట్‌గా పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్‌లో యుక్తవయస్కుల కోసం "స్టాండర్డ్" మరియు "లెస్" వంటి రెండు ఎంపికలను కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో

"ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా అకౌంట్ చేసుకునే వారు ముఖ్యంగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు 'లెస్' అనే స్టేటస్ కి డిఫాల్ట్ చేయబడతారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటును కలిగి ఉన్న టీనేజ్‌ల కోసం కూడా 'లెస్' అనుభవాన్ని ఎంచుకోవడాన్ని ప్రోత్సహిస్తూ మేము వారికి ప్రాంప్ట్ పంపుతాము"అని ఇన్‌స్టాగ్రామ్‌ యొక్క ప్లాట్‌ఫారమ్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. "సెర్చ్, ఎక్స్‌ప్లోర్, హ్యాష్‌ట్యాగ్ పేజీలు, రీల్స్, ఫీడ్ సిఫార్సులు మరియు సూచించిన అకౌంటులలో సంభావ్య సున్నితమైన కంటెంట్ లేదా అకౌంటులను చూడటం యువకులకు ఇది మరింత కష్టతరం చేస్తుంది" అని అది జోడించింది.

టీనేజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ సెట్టింగ్‌లు

టీనేజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ సెట్టింగ్‌లు

ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల కోసం వారి భద్రత మరియు గోప్యతా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించడానికి కొత్త మార్గాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపింది. ఇది వారి కంటెంట్‌ను ఎవరు కూడా తిరిగి షేర్ చేయగలరు, ఎవరికి మెసేజ్ పంపగలరు మరియు ఎవరిని సంప్రదించగలరు మరియు ఏ కంటెంట్‌ను చూడగలరు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపిన సమయాన్ని వారు ఎలా నిర్వహించగలరు వంటి వాటితో వారి సెట్టింగ్‌లను సమీక్షించమని టీనేజ్‌లను అడుగుతున్న ప్రాంప్ట్‌లను చూపుతుంది.

సెన్సిటివ్ కంటెంట్
 

"ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తులు వారి అనుభవాన్ని వ్యక్తిగతీకరించడంలో సహాయపడటానికి మేము నిరంతరం నియంత్రణలను అభివృద్ధి చేస్తున్నాము" అలాగే "గత వేసవిలో మేము సెన్సిటివ్ కంటెంట్ ని కంట్రోల్‌ చేయడం ప్రారంభించాము. తద్వారా వ్యక్తులు వారు అనుసరించని అకౌంటుల నుండి సెర్చ్ లో ఎంత తక్కువ సెన్సిటివ్ కంటెంట్ చూడాలో ఎంచుకోవచ్చు. ఈ నియంత్రణకు సంబంధించిన కొత్త అప్ డేట్లను మేము ప్రకటిస్తున్నాము "అని కంపెనీ తెలిపింది. ఎక్సప్లోర్ తో పాటు వినియోగదారులు ఇప్పుడు సెర్చ్, రీల్స్, మీరు అనుసరించే అకౌంటులు, హ్యాష్‌ట్యాగ్ పేజీలు మరియు ఇన్-ఫీడ్ సిఫార్సులలో చూసే సున్నితమైన కంటెంట్ మరియు అకౌంటుల మొత్తాన్ని నియంత్రించగలరు. ఈ అప్‌డేట్ రాబోయే వారాల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది.

వీడియో పోస్ట్‌లు రీల్స్‌గా

మెటా కంపెనీ యొక్క ప్రతినిధి మాట్ నవర్రా ట్విట్టర్ ద్వారా ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. దీని ప్రకారం పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వారి యొక్క వీడియో పోస్ట్‌లు రీల్స్‌గా షేర్ చేయబడుతున్నాయి అని మెసెజ్ చూపబడుతోంది. మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉంటే కనుక ఎవరైనా మీ వీడియోను కనుగొనవచ్చు మరియు రీల్‌ను రూపొందించడానికి మీ ఒరిజినల్ ఆడియోను ఉపయోగించవచ్చు అని కూడా ఈ మెసేజ్ చూపుతోంది. ఇది కాకుండా మీరు ఒకసారి రీల్‌ను షేర్ చేస్తే కనుక ఎవరైనా మీ రీల్‌తో రీమిక్స్‌ని సృష్టించవచ్చు మరియు వారి రీమిక్స్‌లో భాగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని కూడా చూపుతున్నది. అయితే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్‌ల నుండి లేదా ప్రతి రీల్‌లో ఆఫ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్రైవేట్ అకౌంట్ల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ తమ యొక్క అనుచరులతో మాత్రమే భాగస్వామ్యం చేయబడుతుంది. ఈ కొత్త మార్పు దాని ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం అనుభవాన్ని సరళీకృతం చేయడం మరియు దాని కోసం పని చేసే కార్యాచరణపై దృష్టిని తిరిగి తీసుకురావడం వంటి ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్లాన్లలో భాగంగా ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారులు గడిపే సమయంలో అధిక శాతం రీల్స్ ని చూడడానికి ఇష్టపడే వారు ఉన్నారు. రీల్స్ చూసే వారు 20 శాతానికి పైగా ఉన్నారని ఈ సంవత్సరం ప్రారంభంలో మెటా తెలిపింది. ఈ చర్యతో ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ టిక్‌టాక్‌తో మెరుగైన పోటీని అందించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Instagram to Restrict Sensitive Content For New Teen Users By Default

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X