Just In
- 50 min ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 17 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 19 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 22 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసరంగా ల్యాండ్..
- Movies
Waltair Veerayya 3 Weeks Collections: వీరయ్య అరాచకం.. 3 వారాల్లో అన్ని కోట్లా.. చిరంజీవి పెను సంచలనం
- Sports
IND vs AUS: భారత స్పిన్‌ను చితక్కొట్టేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!
- Finance
తగ్గిన బంగారం ధరలు.. అయినా బంగారం ప్రియులలో టెన్షన్.. త్వరలో 60వేలకు పసిడి!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
iQOO 11 ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు & సేల్ వివరాలు!
iQOO కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQOO 11 ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ భారతదేశంలో ఈ ప్రాసెసర్ తో పనిచేసే మొదటి ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ లెజెండ్ ఎడిషన్ మరియు ఆల్ఫా ఎడిషన్ అనే రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. లెజెండ్ ఎడిషన్ BMW M మోటార్‌స్పోర్ట్ సిరీస్‌తో పాటు లెదర్ ఫినిష్ తో వస్తుంది.

అవును,iQOO 11 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ కారణంగా దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో 50MP సెన్సార్ ఉంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలకు సంబంధించిన ప్రత్యేకత ఏమిటో ఇక్కడ చూడండి.
iQOO 11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు
iQOO 11 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల పంచ్-హోల్ శాంసంగ్ E6 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3200 x 1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. డిస్ప్లే 517 PPI పిక్సెల్ సాంద్రతను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కూడా పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్ టచ్ OS 13లో రన్ అవుతుంది. ఈ ఫోన్ 8 RAM మరియు 256GB మరియు 16GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని పొందుతుంది. దీనికి మెమరీ కార్డ్ స్లాట్ లేదని ఐక్యూ కంపెనీ తెలిపింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా వివరాలు పరిశీలిస్తే,దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ Samsung GN5 సెన్సార్‌తో ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో రెండవ కెమెరా మరియు 13-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్‌తో మూడవ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ కెమెరాలన్నీ Vivo V2 ఇమేజింగ్ చిప్‌తో పనిచేస్తాయి. iQOO11 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని తీసుకువస్తుంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్, 5G, WiFi 6, బ్లూటూత్ 5.3, GNSS, NFC మరియు USB టైప్-సి ఉన్నాయి. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IR సెన్సార్ మరియు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది.

iQOO 11 ధర మరియు సేల్ వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 8GB + 256GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ. 59,999 ధర ఉంది. దీని 16GB + 256GB నిల్వ ఎంపిక ధర రూ. 64,999 గా నిర్ణయించబడింది. ఇది ఆల్ఫా (గ్లాస్ బ్యాక్) లేదా లెజెండ్ (సిలికాన్ లెదర్) కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియా మరియు iqoo.com ద్వారా జనవరి 13 న అమ్మకాలు జరపబడతాయి.
ఇంకా ఈ ఫోన్ పై HDFC మరియు ICICI బ్యాంక్ అందించే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.5,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. అదనంగా iQOO కంపెనీ రూ.4,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470