WhatsApp New Scam: 3 నెలల ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్,Vi!! వాట్సాప్‌లో నకిలీ మెసేజ్

|

సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ ప్రపంచం మొత్తం మీద బాగా పాపులర్ అవ్వడమే కాకుండా నకిలీ మెసేజ్ లను అందరికి త్వరగా పంపడానికి మార్గంగా కూడా ఉంది. ఈ రోజుల్లో వాట్సాప్ ప్లాట్‌ఫాంలో నకిలీ మెసేజ్ లు ప్రసారం అవ్వడం సర్వసాధారణం అయింది. ఇప్పుడు కొత్తగా మరొక నకిలీ మెసేజ్ హల్ చల్ అవుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు Vi(వోడాఫోన్-ఐడియా) మూడు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు మూడు నెలల పాటు ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నారనే కొత్త నకిలీ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్‌

భారత ప్రభుత్వం చొరవతో పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం మూడు నెలల ఉచిత ఇంటర్నెట్‌ను అందించాలనే ఆలోచనతో అందిస్తున్నట్లు పేర్కొంటూ మెసేజ్ సారాంశం ఉంటుంది. ఈ వాట్సాప్ మెసేజ్ పూర్తిగా నకిలీది కావున మీరు దీన్ని నమ్మకపోవడమే ఎంతో మంచిది. దీని గురించి మరిన్ని వివరాలను తెల్సుకుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌లో ఫార్వర్డ్ నకిలీ మెసేజ్

వాట్సాప్‌లో ఫార్వర్డ్ నకిలీ మెసేజ్

వాట్సాప్‌లో ఇప్పుడు ఎక్కువ ఫార్వర్డ్ అవుతున్న నకిలీ వాట్సాప్ మెసేజ్ లో ఒక లింక్ కూడా ఉంది. ఇటువంటి మెసేజ్ మీకు కూడా వచ్చి ఉంటే కనుక ఆ లింక్ మీద క్లిక్ చేయకుండా ఉండండి. ఇది ప్రాథమికంగా మీ వ్యక్తిగత వివరాలను దొంగలించడంతో పాటుగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బును దొంగిలించడానికి ఒక మార్గంగా కూడా ఉంటుంది. వాస్తవానికి అనుమానాస్పద / అనధికారిక లింక్‌తో వచ్చే ఏదైనా ధృవీకరించని వాట్సాప్ మెసేజ్ నకిలీది అని తెలుసుకోవచ్చు. మీరు వెంటనే అలాంటి మెసేజ్ లను తొలగించాలి. వినియోగదారులను మోసగించడానికి మరియు వారి పరికరాలను ప్రభావితం చేయడానికి మరియు వారి వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి హ్యాకర్లు ఉపయోగించే సులభమైన మార్గాలలో ఇది ఒకటి.

వాట్సాప్‌లోని ప్రస్తుత నకిలీ మెసేజ్ లోని సారాంశం ప్రకారం ఈ ఆఫర్ జూన్ 29 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది అని తెలుపుతూ వినియోగదారులను త్వరగా ఎంచుకునేలా ప్రలోభపెడుతూ ఉంటుంది. ఇలాంటి మోసాలకు పాల్పడటానికి వినియోగదారులను ప్రలోభపెట్టడానికి హ్యాకర్లు ఉపయోగించే మార్గాలు ఇవి అని చాలా సర్వేలు ఇప్పటికే అనేక సందర్భాలలో తెలిపాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఇటువంటి నకిలీ వాట్సాప్ సందేశాలు లేదా మోసాలకు పాల్పడవద్దని వినియోగదారులను హెచ్చరిస్తోంది.

వాట్సాప్‌లో ఆన్‌లైన్ మోసాలు

గత కొన్ని నెలలుగా వాట్సాప్‌లో ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండటానికి మరియు ఈ నకిలీ వాట్సాప్ మెసేజ్ లను గుర్తించడంలో తెలివిగా ఉండటం చాలా కీలకం అని చెబుతున్నది. చాలా సందర్భాలలో నకిలీ మెసేజ్ లు / మోసాలు ఉచిత సమర్పణలతో వినియోగదారులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ సందర్భంలో హ్యాకర్లు దేశంలోని అతిపెద్ద టెల్కోస్ నుండి ఉచిత ఇంటర్నెట్‌తో వినియోగదారులను ఆకర్షించారు.

నకిలీ వాట్సాప్ సందేశాన్ని గుర్తించడానికి చిట్కాలు

నకిలీ వాట్సాప్ సందేశాన్ని గుర్తించడానికి చిట్కాలు

- ఉచిత సర్వీసులను అందిస్తున్నట్లు పేర్కొంటూ ఫార్వార్డ్ చేసిన వాట్సాప్ మెసేజ్ నకిలీదని మొదటగా గుర్తించాలి.

-అనుమానాస్పద వెబ్‌సైట్‌కు ధృవీకరించని లింక్‌తో లభించే వాట్సాప్ మెసేజ్ ను పట్టించుకోవడం మానుకోవాలి. అనధికారిక లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.

-వ్యాకరణ లోపాల కోసం కూడా తనిఖీ చేయండి. అధికారిక మెసేజ్ లేదా ప్రకటనలో వ్యాకరణం / స్పెల్లింగ్ సమస్యలు ఉండవు.

ఫార్వార్డ్ చేసిన వాట్సాప్ సందేశాలను ఎప్పుడూ నమ్మకండి. చాలా సందర్భాలలో అవి నకిలీవిగా మారతాయి. మీరు అలాంటి సందేశాలను ఇతరులకు ఎప్పుడూ ఫార్వార్డ్ చేయకూడదు. ఎందుకంటే ఈ మెసేజ్ల కారణంగా మీ స్నేహితులకు ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు తెలియదు కదా.

 Also Read: WFH కోసం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకుంటున్నారా!! వీటిని దృష్టిలో ఉంచుకోండి Also Read: WFH కోసం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకుంటున్నారా!! వీటిని దృష్టిలో ఉంచుకోండి

Best Mobiles in India

English summary
Jio, Airtel, Vi Offers Free Internet For 3 Months !! Fake Message Viral on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X