JioFiber కొత్త ప్లాన్‌లు: Rs.399 నుండే ప్రారంభం!!!30-రోజుల ఫ్రీ-ట్రయిల్ కూడా!!!

|

ప్రముఖ టెలికామ్ సంస్థ ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి జియోఫైబర్ పేరుతో అడుగుపెట్టిన తరువాత వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చాలానే చేసింది. రిలయన్స్ జియో రాడార్ కింద జియోఫైబర్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు సంస్థ కేవలం రూ.399 ధర వద్దనే అపరిమితమైన జియోఫైబర్ ప్లాన్‌లను వినియోగదారులకు అందించనున్నది.

జియోఫైబర్‌ vs ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జియోఫైబర్‌ vs ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారతి ఎయిర్‌టెల్ మరియు ACT ఫైబర్‌నెట్‌ వంటి వాటితో పోటీ పడడానికి రిలయన్స్ జియో ఈ రోజు కొత్తగా తన ‘జియోఫైబర్' బ్రాండ్ కింద 300Mbps వేగంతో అందించే నాలుగు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన జియోఫైబర్ ప్లాన్‌లు ఎయిర్‌టెల్ యొక్క ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు గట్టి పోటీగా రానున్నాయి. జియోఫైబర్ కొత్త ప్లాన్‌లు 11 OTT యాప్ లకు ఉచితంగా యాక్సిస్ ను అందిస్తున్నాయి. జియో ఫైబర్ ISP ఒక కొత్త పథకాన్ని కూడా ప్రకటించింది. ఇక్కడ వినియోగదారులు ఎటువంటి నిబంధనలు మరియు షరతులు లేకుండా 30 రోజులు JioFiber యొక్క ఉచిత ట్రయల్‌ని ఆస్వాదించవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Also Read:Sun Direct యూజర్లకు శుభవార్త!! కొత్తగా 6 ఛానెల్‌లకు ఉచిత యాక్సిస్Also Read:Sun Direct యూజర్లకు శుభవార్త!! కొత్తగా 6 ఛానెల్‌లకు ఉచిత యాక్సిస్

జియోఫైబర్‌ 30 Mbps - 100 Mbps స్పీడ్ కొత్త ప్లాన్‌లు

జియోఫైబర్‌ 30 Mbps - 100 Mbps స్పీడ్ కొత్త ప్లాన్‌లు

జియోఫైబర్‌ వినియోగదారుల కోసం ప్రస్తుతం సంస్థ నాలుగు కొత్త ప్లాన్‌లను తక్కువ ధరలోనే విడుదల చేసింది. దీని యొక్క ధరలు వరుసగా రూ.399, రూ.699, రూ.999, రూ.1,499. ఈ నాలుగు కొత్త ప్లాన్‌లలో రూ.399 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్ 30 Mbps వేగంతో అపరిమిత డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే రూ.699 ప్యాక్ వినియోగదారుకు 100 Mbps అప్‌లోడ్ & డౌన్‌లోడ్ వేగంతో అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు అపరిమిత డేటా ప్రయోజనంను అందిస్తుంది.

 

Also Read: BSNL Rs.1,499 లాంగ్-వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్: వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రహ్మాండంAlso Read: BSNL Rs.1,499 లాంగ్-వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్: వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రహ్మాండం

జియోఫైబర్‌ 150 Mbps - 300 Mbps స్పీడ్ కొత్త ప్లాన్‌లు

జియోఫైబర్‌ 150 Mbps - 300 Mbps స్పీడ్ కొత్త ప్లాన్‌లు

జియోఫైబర్‌ కొత్తగా అందిస్తున్న రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ 150 Mbps వేగంతో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు అపరిమిత డేటాతో పాటుగా 11 OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. చివరగా రూ.1,499 జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 300 Mbps వేగంతో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు అపరిమిత డేటా బెనిఫిట్ లతో పాటుగా 12 OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లపై అదనంగా 18% GST వర్తిస్తుందని గమనించండి. రిలయన్స్ జియో దీర్ఘకాలిక ప్లాన్ ఆఫర్లను ఇంకా వెల్లడించలేదు.

జియోఫైబర్ 30-రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్

జియోఫైబర్ 30-రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్

జియోఫైబర్ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి వాటి యొక్క అన్ని సేవలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 30 రోజుల పాటు ఉచితంగా యాక్సిస్ చేయడానికి 30-రోజుల ఉచిత ట్రయల్‌ని రిలయన్స్ జియో ప్రకటించింది. ట్రయల్ వ్యవధిలో భాగంగా JioFiber కొత్త కస్టమర్లు 150 Mbps ఇంటర్నెట్ వేగంతో డేటాను అందిస్తుంది. అలాగే 4K సెట్-టాప్ బాక్స్, టాప్ 10 పెయిడ్ OTT యాప్ లకు మరియు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తాయి. ఫ్రీ ట్రయిల్ ముగిసిన తరువాత కస్టమర్ వీటి యొక్క సేవలను ఇష్టపడకపోతే కనుక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అన్ని డివైస్ లను తిరిగి తీసుకుంటామని కంపెనీ తెలిపింది.

JioFiber వినియోగదారులు గమనించవలసిన ముఖ్యమైన గమనికలు

JioFiber వినియోగదారులు గమనించవలసిన ముఖ్యమైన గమనికలు

రిలయన్స్ జియో నేడు తన ప్రస్తుత జియోఫైబర్ ప్లాన్‌లను నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీని కొత్త ప్లాన్‌లు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 1 న లేదా దాని తరువాత వీటి యొక్క సేవలను యాక్టివేట్ చేసుకుంటున్న జియోఫైబర్ కొత్త కస్టమర్లు అందరికి 30 రోజులపాటు ఉచిత ట్రయల్ ప్రయోజనం లభిస్తుంది. అలాగే ఆగస్టు 15 మరియు ఆగస్టు 31 మధ్య ఆన్‌బోర్డ్‌లో ఉన్న జియోఫైబర్ కస్టమర్లకు మైజియో అప్లికేషన్‌లో వోచర్‌గా 30 రోజుల ఉచిత ట్రయల్ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న అన్ని జియోఫైబర్ కస్టమర్ల ప్లాన్‌లు కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రయోజనాలకు సరిపోయే విధంగా అప్‌గ్రేడ్ చేయబడతాయి.

Best Mobiles in India

English summary
Jio Fiber Announced New Plans Start with at Rs 399 and 30 Days Free Trail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X