Just In
- 11 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 16 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 18 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మార్చిలో జియో GigaFiber సేవలు, బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500?
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్రతిషాత్మకంగా అభివృద్ధి చేసిన గిగాఫైబర్ బాడ్‌బ్యాండ్ ఎఫ్‌టీటీహెచ్ సర్వీసులకు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం జియో తన గిగాఫైబర్-టు-ద-హోమ్-సర్వీసులను 2019 మొదటి క్వార్టర్‌లో అఫీషియల్‌గా అందుబాటులోకి తీసుకురాబోతోంది. మార్చిలో ఈ లాంచింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. దీని పై జియో అఫీషియల్‌గా స్పందించనప్పటికి అతిత్వరలోనే జియో గిగాఫైబర్ కనెక్షన్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుకు సంబంధించిన ప్లాన్స్
ఈ నేపధ్యంలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుకు సంబంధించిన ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయ్ అనే ఉత్కంఠ కూడా చాలామందిలో కనిపిస్తింది. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం జియో గిగాఫైబర్ బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 300జీబి డేటా 100ఎంబీపీఎస్ వేగంతో అందుబాటులో ఉంటుందట. జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు తొలత 1100 నగరాల్లో అందుబాటులో ఉంటాయట.

ప్రివ్యూ ఆఫర్
ప్రస్తుతం ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును తీసుకునే వారికి ప్రివ్యూ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ప్రివ్యూ ఆఫర్ క్రింద యూజర్లు 100 ఎంబీపీఎస్ వేగంతో అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను నెలకు 100జీబి కోటాతో 90 రోజుల పాటు ఉచితంగా ఆస్వాదించే వీలుంటుంది. 100జీబి డేటాను నెల రోజుల కంటే ముందే కన్స్యూమ్ చేసేసినట్లయితే కాంప్లిమెంటరి డేటా టాపప్ క్రింద అదనంగా 40జీబి డేటాను పొందే వీలుంటుంది. ఈ డేటాను మైజియో యాప్ లేదాజియో.కామ్ ద్వారా పొందవచ్చు.

ఇన్‌స్టాలేషన్ ఛార్జీ
ప్రస్తుతానికైతే, జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ పై ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను జియో విధించటం లేదు. అయితే కనెక్షన్ తీసుకునేమందు ONT డివైస్ నిమిత్తం రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా జియోమనీ ఇంకా పేటీఎమ్ యాప్ ద్వారా చెల్లించే వీలుంటుంది. డిపాజిట్ చేసిన మొత్తాన్నిసర్వీసెస్‌ను డిస్కంటిన్యూ చేసే సమయంలో తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాల్ చసిన డివైసెస్ అన్ని వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి.

ప్రీ-పెయిడ్ సర్వీసెస్
ప్రస్తుతానికైతే జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ప్రీ-పెయిడ్ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే పోస్ట్-పెయిడ్ సేవలను లాంచ్ చేసే అవకాశముంది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకోవాలనుకుంటోన్న యూజర్లు ముందుగా తమకు సమీపంలోని రిలయన్స్ జియో స్టోర్‌కు వెళ్లి ప్రివ్యూ ఆఫర్ తమ ఏరియాలో వర్తిస్తుందో లేదో

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం
జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా హై-స్పీడ్ వై-ఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగాటీవీ అలానే స్మార్ట్‌హోమ్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌ను మీ ఇంట్లో సెటప్ చేసే క్రమంలో కంపెనీ ప్రతినిధులు మీ హోమ్ లేదా ఆఫీసులో ప్రత్యేకమైన జియో గిగారౌటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 4కేక్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్‌లను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

పెద్ద స్ర్కీన్ టీవీలను ఉపయోగించుకునే వారు
పెద్ద స్ర్కీన్ టీవీలను ఉపయోగించుకునే వారు గిగాటీవీ సెట్-టాప్ బాక్సులను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వారికి వాయిస్ యాక్టివేటెడ్ రిమోల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీంతో వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఈ సెట్-టాప్ బాక్సు ద్వారా 600లకు పైగా టీవీ చానల్స్‌తో పాటు వేలాది సినిమాలు, లక్షలాది పాటలను యూజర్ ఆస్వాదించే వీలుంటుంది.

స్మార్ట్ హోమ్ సూట్
జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్ హోమ్ సూట్ గుండెకాయిలా నిలుస్తుంది. ఆడియో డాంగిల్, వీడియో డాంగిల్, స్మార్ట్ స్పీకర్, వై-ఫై ఎక్స్‌టెండర్, స్మార్ట్ ప్లగ్, అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా, టీవీ కెమెరా వంటి యాక్సెసరీస్ ఈ సూట్‌లో భాగంగా లభిస్తాయి. గిగాఫైబర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన ఇళ్లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఒక ఇంటిలో సెటప్ చేయటానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ చెబుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470