మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు Jio Prime గడువు..?

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రిలయన్స్ జియో, మార్చి 31తో ముగియాల్సి ఉన్న Jio Prime సబ్‌స్ర్కిప్షన్ తేదీని మరో నెల పాటు పొడిగించనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అంటే, ఏప్రిల్ 30 వరకు జియో ప్రైమ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉండొచ్చు. జియో యూజర్లు ఈలోపు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకునే వీలుంటుంది.

Read More : నోకియా ఫోన్స్ గురించి లేటెస్ట్ అప్‌డేట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాస్తవానికి, మార్చి 31, 2017తో

వాస్తవానికి, మార్చి 1,2017న ప్రారంభమైన జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ మార్చి 31, 2017తో ముగియాల్సి ఉంది. ఈ గడువులోపు ప్రస్తుత జియో కస్టమర్లు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్ షిప్‌ను తీసుకున్నట్లయితే, వారికి మార్చి 31, 2018 వరకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ 12 నెలల సబ్‌స్ర్కిప్షన్ పిరియడ్‌లో నెలకు రూ.303 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌

జియో ప్రైమ్ యూజర్లు ఏప్రిల్ 1, 2017 నుంచి నెలనెలా రూ.303 చెల్లించటం ద్వారా రోజుకు 1జీబి 4జీ ఎల్టీఈ డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మెసేజెస్ కూడా పంపుకోవచ్చు. జియో ఆఫర్ చేస్తున్న అన్ని మీడియా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

సింపుల్ ట్రిక్‌తో జియో ప్రైమ్ ఉచితం..

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు సరికొత్త ట్రిక్‌ జియో మనీ లెట్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంది.  

ప్రతి రీఛార్జ్ పై రూ.50 క్యాష్‌బ్యాక్‌

జియో మనీ వాలెట్ యాప్ ద్వారా చేసే ప్రతి రీఛార్జ్ పై రూ.50 క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలో మీరు ముందుగా జియో మనీ యాప్‌ను గూగుల్ ప్లో స్టోర్ ద్వారా మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌ను లాంచ్ చేసి రూ.99 ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోండి. ఇప్పుడు మీకు రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

అదనంగా మరో రూ.50 క్యాష్‌బ్యాక్

ప్రైమ్ మెంబర్‌షిప్‌ తీసుకున్న తరువాత నెలవారీ చందా క్రింద రూ.303 తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. కాబట్లి, రూ.303 రీచార్జ్‌ను కూడా జియో మనీ వాలెట్ యాప్ ద్వారానే కొనుగోలు చేసినట్లయితే మరో రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ అనేది మీకు సంబంధించి జియో మనీ వాలెట్‌లో వోచర్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఇతర షాపింగ్‌కు వాడుకోవచ్చు.

4G VoLTE వల్ల లాభాలు, నష్టాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime membership deadline to be extended:Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot