హై-టెక్ డ్రోన్ నిఘాలో ఖైరతాబాద్ గణేష్

|

ఇండియాలో హిందు సాంప్రదాయ పండుగలలో వినాయక చవితి అనేది ముఖ్యమైన పండుగ. ఈ పండుగకు సంబంధించి విగ్రహాల విషయంలో హైదరాబాద్ కు ఒక ప్రత్యకత ఉంది. ముఖ్యముగా వినాయకుని విగ్రహ ఎత్తు విషయంలో. గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద ఏర్పాటు చేసిన ఎత్తైన గణేష్ విగ్రహంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఇండియాలోనే అతి పెద్దది. ఖైరతాబాద్ లో విగ్రహం మొదలు పెట్టి 65 సంవత్సరాలు అయింది.

 
Khairthabad Ganesh 2019 will be Under High-Tech Drone Surveillance

ఈ సారి వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ ద్వాదశ ఆదిత్య మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సారి భక్తుల రక్షణ దృష్ట్యా ఖైరతాబాద్ మొత్తం డ్రోన్ నిఘా ఉంచబోతున్నట్లు కమిటీ నిర్ణయించింది. ఈ సారి విగ్రహం యొక్క ప్రాముఖ్యతలు మరియు నిఘా యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద చదవండి.

వినాయకుని విగ్రహ విశేషాలు

వినాయకుని విగ్రహ విశేషాలు

ఖైరతాబాద్ లో విగ్రహం మొదలు పెట్టి 65 సంవత్సరాలు అయిన సందర్బంగా ఈ సారి వినాయకుడు 61 అడుగుల ఎత్తుతో 12తలలు, 24 చేతులతో మరియు 12 సర్పాలతో శ్రీ ద్వాదశ ఆదిత్య మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. విగ్రహ శిల్పి రాజేంద్రన్ మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ విగ్రహం యొక్క విశేషాలు తెలిపారు. 2019 ఖైర్‌తాబాద్ గణేశుడి అవతారం శ్రీ ద్వదాషాదిత్య మహా గణపతి విగ్రహం యొక్క ముఖం 12 తలతో, 24 చేతులతో, 12 సర్పాలతో అలంకరించబడి ఏడు గుర్రాలతో రథం నడుపుతూ సూర్యుడిలా కనిపిస్తుంది. కుడి వైపున శ్రీ మహా విష్ణువు, ఏకాదశ దేవి విగ్రహాలను ప్రత్యేక చిన్న మంటపంలో ఏర్పాటు చేశారు. అలాగే ఎడమ వైపున దుర్గాదేవి విగ్రహాలతో పాటు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.

విగ్రహ తయారికి పట్టిన సమయం
 

విగ్రహ తయారికి పట్టిన సమయం

విగ్రహ శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ విగ్రహ తయారి మూడు నెలల ముందు మొదలుపెట్టారు. సుమారు 250 మంది రాత్రి, పగలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసారు. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. భక్తుల దర్శనం కోసం వినాయక చవితికి నాలుగు రోజుల ముందు నుంచి అనుమతి ఉంటుంది. విగ్రహ శిల్పి రాజేంద్రన్ గత 25 సంవత్సరాలుగా విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. 2014 లో 60అడుగులతో తయారు చేసిన ఈ విగ్రహం తరువాత ప్రతి సంవత్సరం ఒకొక్క అడుగు తగ్గిస్తు వచ్చారు. గత సంవత్సరం 2018 లో శ్రీ సప్త ముక గణేష్ ఆకారంలో 55 అడుగులతో తయారుచేసారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 61 అడుగులకు ఒక్కసారిగా మళ్ళి విగ్రహ ఎత్తున పెంచారు. ఇప్పటి వరకు నిర్మించిన ఎతైన విగ్రహాలలో ఇదే అతి పెద్దది.

లడ్డు విషయాలు

లడ్డు విషయాలు

ఖైర్‌తాబాద్ వినాయకుని వద్ద ఉన్న మరొక విశేషం లడ్డు. ఇక్కడ ఉంచే లడ్డు కూడా భారీగా ఉంటుంది. ఎంత భారీ అంటే ఆ లడ్డు గురించి సంవత్సరం మొత్తం మాట్లాడుకొనే అంత భారీగా ఉంటుంది. దీనిని కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఉండే తపేశ్వరంకు చెందిన మిస్టర్ మల్లి బాబు అనే అతను తయారు చేసి ఇస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రాలో తయారుచేసి 420 కిలోమీటర్లు ప్రయాణించి వినాయకునికి అందిస్తారు. 2015 లో ఖైరతాబాద్ గణేష్ లడ్డూ బరువు 600 కిలోలు. గత సంవత్సరం కూడా సుమారు 4500 కిలోల బరువుతో లడ్డును తయారు చేసారు. ఈ సంవత్సరం కూడా దీని కన్న ఎక్కువ బరువు గల లడ్డును సుమారు 6000 కిలోల బరువుతో తయారు చేస్తున్నారు.

ఖైర్‌తాబాద్ నిఘా

ఖైర్‌తాబాద్ నిఘా

ఖైర్‌తాబాద్ లో 12రోజుల పాటు జరిగే వినాయక చవితి ఉత్సవాల బద్రతా విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధిక భద్రత బలగాలను మోహరించింది. ఇంటలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం ఉగ్రవాదుల నుంచి వినాయకుని నిమర్జనం రోజున ముప్పు ఉన్న కారణంగా భద్రత బలగాలతో పాటుగా టెక్నాలజీ పరంగా కూడా డ్రోన్ నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ మండపం చుట్టూ ప్రత్యేకమైన క్యూ లైన్ ద్వారా భక్తులను అనుమతిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ప్రాంతం సీసీ కెమెరాల ద్వారా నిర్మించారు. అదనంగా ఉత్సవ కమిటీ కూడా 150 మంది వాలంటీర్లను కూడా నియమించింది.

నిమర్జనం కోసం డ్రోన్స్ ఉపయోగం

నిమర్జనం కోసం డ్రోన్స్ ఉపయోగం

హైదరాబాద్ లోని ఖైర్‌తాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 61అడుగుల భారీ వినాయకున్ని నిర్మించారు. గత సంవత్సరం కూడా 55 అడుగుల విగ్రహాన్ని నిర్మించిన సంగతి అందరికి తెలిసినదే కాకపోతే ఈ విగ్రహం నిమర్జనం రోజున అందరు ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసు.ఆ విగ్రహం నిమర్జనం కావడానికి సుమారు మూడు రోజుల సమయం పట్టింది. ఈ సారి మాత్రం అలా కాకుండా ఉండడానికి ప్రతేకంగా మలేషియా నుంచి వచ్చిన ప్రత్యేక డ్రోన్ బృందం హుస్సేన్ సాగర్ లో 61 అడుగుల విగ్రహం ఎక్కడ నిమర్జనం చేయడానికి ఎక్కడ అయితే ఎక్కువ లోతు ఉంటుందో తెల్సుకోవచ్చు. ఇప్పటికే GHMS అధికారులు మరియు కమిటి అధికారులు కలిసి తమ పనిని ప్రారంభించారు. దురదృష్టం కొద్ది నిమర్జనానికి సరైన లోతు లేకపోవడంతో అధికారులు కొన్ని చోట్ల ఉన్న మట్టిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

నిమర్జన మార్గం

నిమర్జన మార్గం

ఖైర్‌తాబాద్ యొక్క 61అడుగుల భారీ వినాయకున్ని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండే కాకుండా చాలా ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తువుంటారు. 12 రోజుల పాటు భక్తుల చేత పూజలు అందుకొనే వినాయకుడు చివరి రోజున నిమర్జనం కోసం హుస్సేన్ సాగర్ కు తరలిపోతాడు. అనంత భక్త కోటి నడుమ జరిగే నిమర్జనం ఖైర్‌తాబాద్ నుండి మొదలై లకడికపూల్ మరియు ఐమాక్స్ మీదుగా హుస్సేన్ సాగర్ కు వెళతాడు. ఈ దారి పొడుగునా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు GHMC అదికారులు భారీగా బలగాలను మోహరించబోతున్నారు. అంతేకాకుండా ఇంతకమునుపు ఎప్పుడు లేని విధంగా అధికారులు భద్రత కోసం డేగ కన్ను వలె డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సుమారు 100 కు పైగా డ్రోన్ లను నిమర్జనం సమయంలో ఉపయోగిస్తున్నారు. నిమర్జనం రోజున హుస్సేన్ సాగర్ కు హైదరాబాద్ లో ఉంచిన వేలాది వినాయక విగ్రహాలు వస్తాయి. వీటి అన్నిటి భద్రత దృష్ట్యా డ్రోన్ లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

Best Mobiles in India

English summary
Khairthabad Ganesh 2019 will be Under High-Tech Drone Surveillance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X