సెల్ఫీ ట్రైనింగ్ యూనివర్శిటీలు అదుర్స్

Written By:

కాదేది కవితకు అనర్హం..ఓ కవి అన్నట్లుగా చదువులో కూడా ఇప్పుడు ఏది అనర్హం కాదు..యూనివర్శిటీలు కొత్త కొత్త కోర్సులను విద్యార్ధులకు అందుబాటులోకి వస్తున్నాయి.మనకు చేతకాని వాటిని ఎలా అద్భుతంగా చేయాలో మనకు నేర్పే కాలేజీలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పడు వాటి వరుసలో సెల్పీ కూడా చేరింది. మీకు సెల్పీ తీయడం రాకుంటే ఈ కాలేజీలకు వెళితే వారు మీకు సెల్ఫీ ఎలా తీయాలో నేర్పుతారట..విచిత్రంగా ఉంది కదా..అయితే ఆ కాలేజీలు తే పాటు యూనివర్శిటీలు కూడా ఈ కోర్సును ఆపర్ చేస్తున్నాయి.మరి ఏయే యూనివర్శిటీలు సెల్ఫీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయో ఓ సారి చూద్దాం.

Read more :సెల్ఫీతో పండగ చేసుకుంటున్న పేలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియానా యూనివర్శిటీ

అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ఈ ఇండియానా యూనివర్శిటీ ఒకటి.. ఈ యూనివర్శిటీ ఇప్పుడు సెల్ఫీ కోర్సును అందిస్తోంది.

సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ

ఇది కూడా అమెరికాలో చాలా పేరుగాంచిన యూనివర్శిటీ..ఈ యూనివర్శిటీ సైతం సెల్ఫీ కోర్సును ఆపర్ చేస్తోంది.

సిటిలైట్ కాలేజీ ఇన్ లండన్

ఈ కాలేజి కూడా సెల్పీ మీద కోర్సులను ఆపర్ చేస్తోంది. ఫీజు దాదాపు 200 డాలర్ల వరకు ఉంటుంది.

నిరాశకు గురి కాకుండా ఈ కోర్సులు

ఇలా ఎందుకంటే ఇటీవల సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్ లు,కామెంట్లు వచ్చే విధానాన్ని చూసి చాలా మంది తమకు సెల్పీలు తీయడం రావట్లేదని నిరాశకు గురి అవుతున్నారట. అందుకని వారు నిరాశకు గురి కాకుండా ఈ కోర్సులు ప్రారంభించారట.

పొద్దున లేచింది మొదలు..నిద్రపోయేదాకా..

పొద్దున లేచింది మొదలు..నిద్రపోయేదాకా సమయం సందర్భంతో పని లేకుండా సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య ఇప్పుడు రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకనేమో ఈ యూనివర్శిటీలు ఏకంగా సెల్ఫీల కోసం ప్రత్యేక కోర్సులనే ప్రారంభించాయి.

మన దేశంలో..

అమెరికా తో పాటు మన దేశంలో కూడా ఇలా సెల్ఫీల కోసం కోర్సులను ప్రారంభిస్తే ఇంకా బావుంటుందేమో..అక్కడ యూనివర్శిటీల లాగా సెల్ఫీలు తీసుకోవడం ఎలాగో నేర్పిస్తామంటూ ప్రత్యేక కోర్సులు ఎప్పుడు ప్రారంబిస్తాయో చూడాలి.

సెల్ఫీల కోసం చిత్రంగా అప్పుడే క్లాసులు

అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఇండియానా యూనివర్శీటీ,అలాగే సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ వంటి కొన్ని యూనివర్శిటీలు ఇలా సెల్ఫీల కోసం చిత్రంగా అప్పుడే క్లాసులు కూడా ప్రారంభించాయి.

సెల్ఫీల్లో 400 క్లాసులు

ఇందులో సెల్ఫీలపై అవగాహన కల్పిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా ఫోటోలు తీసుకోవాలో నేర్పుతారు.ఇప్పటివరకు సెల్ఫీల్లో 400 క్లాసులు తీసుకున్నానని చెబుతున్నారు ఇండియానాకు యూనివర్శిటీ ఫ్రొపెసర్ ఈవ్ బొటాండో.

లండన్ కాలేజీలో కూడా సెల్పీ క్లాసులు

ఇక లండన్ కాలేజీలో కూడా సెల్పీ క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఫోటో ఎలా తీసుకోవాలి..అలాగే దానికి వైట్ బ్యాలెన్స్ ఏయే యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటే బావుంటుంది వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు. కోర్సు ఫీజు 200 డాలర్లు వరకు ఉంటుంది.

బెడ్ రూంలో మిర్రర్ సెల్ఫీ

బెడ్ రూంలో మిర్రర్ సెల్ఫీ ఎలా తీసుకోవాలో కూడా ఈ కాలేజీలో నేర్పుతారట. దీనికి సంబంధించి ప్రెజేంటేషన్స్,క్లాసులు.డిస్కషన్స్,సెమినార్ వంటివి ఆ కాలేజీలో ఉన్నాయని యాజమాన్యం చెబుతోంది.

మీరు అమెరికాకు చెక్కేయండి

మీరు కూడా మీకు నచ్చిన కాలేజీల్లో సెల్ఫీ కోర్సుల్లో చేరిపోయి చక్కని సెల్ఫీలు తీసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Students at a top California university can now take a course devoted to selfies.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot