రూ.1 లక్ష ఖరీదైన iPhone 13 Pro కు కాపీ ! ఈ ఫోన్ ధర రూ.7000 మాత్రమే. వివరాలు చూడండి.

By Maheswara
|

కొన్ని నెలల క్రితం, చైనీస్ బ్రాండ్ అయిన LeTV దేశంలోని LeTV Y1 ప్రో అనే ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే ఉన్న స్మార్ట్ ఫోన్ మోడల్‌కు కొనసాగింపుగా వస్తుంది. కంపెనీ నుండి వచ్చిన ఈ తాజా ఫోన్ LeTV Y2 Pro, ఇది కంపెనీ హోమ్ మార్కెట్‌ చైనా లో ప్రస్తుతం లాంచ్ చేయబడింది.

 

 iPhone 13 Pro కు కాపీ గా LeTV Y2 Pro

iPhone 13 Pro కు కాపీ గా LeTV Y2 Pro

LeTV Y2 ప్రో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు స్ప్లిట్-స్క్రీన్  ఫీచర్ కు మద్దతుతో వస్తుంది. ఇక హార్డ్‌వేర్ విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ ప్రాసెసర్‌తో పాటు 6GB వరకు RAM మరియు 256GB వరకు స్టోరేజీ కలిగి ఉంది. LeTV నుండి వచ్చిన స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 13MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

LeTV Y2 Pro

LeTV Y2 Pro

LeTV Y2 Pro Google GMS కంటే Huawei HMS సేవతో ఆండ్రాయిడ్ 11 ప్రధాన OS గా నడుస్తుంది. ఇందులో 4000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ కు శక్తినిస్తుంది మరియు ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అలాగే, స్మార్ట్‌ఫోన్ ఫేస్ అన్‌లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి బయోమెట్రిక్ ఫీచర్‌లతో వస్తుంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ,  మ్యాజిక్ నైట్ బ్లాక్ మరియు సమ్మర్ ఆరెంజ్‌తో సహా మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.మార్కెట్‌లోని ఇతర బ్రాండ్‌ల నుండి ఏదైనా ఇతర ఎంట్రీ-లెవల్ ఆఫర్‌లో మనం చూడగలిగే వాటితో సమానంగా స్పెసిఫికేషన్ ఉన్నప్పటికీ డిజైన్ పరంగా ఇది ఖచ్చితంగా iPhone 13 ప్రోని పోలి ఉంటుంది.

LeTV Y2 ప్రో ధర
 

LeTV Y2 ప్రో ధర

మీరు iPhone 13 Proని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నట్లయితే, మీరు రూ. 1,00,000. వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే, LeTV ఆఫర్ ధర చాలా తక్కువ, LeTV Y2 ప్రో ధర రూ. 7,000 మాత్రమే. LeTV పునరాగమనం కోసం చూస్తున్నప్పటికీ, దాని లభ్యత పరిమితంగా ఉంది మరియు ఇది ఖచ్చితంగా iPhone లలో అందించే ఫీచర్లు మరియు వినియోగదారు అనుభవంతో సమానంగా ఉండదు.

మూడు స్టోరేజ్ వేరియంట్లలో

మూడు స్టోరేజ్ వేరియంట్లలో

ప్రస్తుతం LeTV Y2 ప్రో మూడు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేయబడింది. వీటిలో, 4GB RAM మరియు 32GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర 599 యువాన్లు (సుమారు రూ. 7,000). మిడ్-రేంజ్ వేరియంట్ ఫీచర్లు 4GB RAM మరియు 128GB స్టోరేజ్ ధర 799 యువాన్లు (సుమారు రూ. 9,500) మరియు 6GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర 999 యువాన్లు (సుమారు రూ. 11,800) ) ధర గా లాంచ్ చేసారు.

అసలైన iPhone 13 pro

అసలైన iPhone 13 pro

ఇక Apple యొక్క అసలైన iPhone 13 pro యొక్క వివరాలు గమనిస్తే, గత సంవత్సరం ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 ప్రో సిరీస్‌ ఫోన్‌లను 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ లాంచ్ ఈవెంట్‌ ద్వారా లాంచ్ చేసింది.ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి నాలుగు కొత్త ఐఫోన్ 13 మోడళ్లు ఒకే స్క్రీన్ పరిమాణం మరియు వాటి ముందుతరం ఫోన్‌లకు సమానమైన డిజైన్ ను కలిగి ఉన్నాయి. అయితే వీటిలో మెరుగైన బ్యాటరీ లైఫ్, ఓవర్‌హాల్డ్ కెమెరా, సినిమాటిక్ వీడియో రికార్డింగ్ మోడ్ మరియు సరికొత్త A15 బయోనిక్ SoC వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 13- సిరీస్ ధరల వివరాలు

ఐఫోన్ 13- సిరీస్ ధరల వివరాలు

లాంచ్ అయినప్పుడు ఈ అసలైన ఆపిల్ ఫోన్ల యొక్క ధరలను ఒకసారి పరిశీలిస్తే ఈ నకిలీ ఫోన్ ఎంత తక్కువ ధరకు వస్తుందో మీకు అర్థం అవుతుంది.

 ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 మినీ ఒక్కొక్కటి మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఐఫోన్ 13 మినీ యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.69,900 కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 చివరిగా 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,900. అలాగే ఐఫోన్ 13 యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900 మరియు 12GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,900. ఐఫోన్13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ రెండూ 1TB వరకు స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 13 ప్రో యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.1,19,900, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,29,900, 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,900 మరియు చివరిగా 1TB మోడల్ ధర రూ.1,69,900. టాప్-ఆఫ్-లైన్ ఐఫోన్ 13 ప్రో మాక్స్ యొక్క స్టోరేజ్ వేరియంట్ ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,39,900. రూ.1,59,900 మరియు రూ.1,79,900. ఇది ఆపిల్ సంస్థ యొక్క అత్యంత ఖరీదైన ఐఫోన్ కావడం విశేషం.  

Best Mobiles in India

Read more about:
English summary
LeTV Launched An iPhone 13 Pro Clone LeTV Y2 Pro Which Costs Just Rs.7000. Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X