సీన్ రివర్స్ అయింది ! చైనాలో సేల్ అయ్యే iPhone లు ఇప్పుడు ఇండియాలో తయారవుతున్నాయి

By Maheswara
|

సాధారణంగా చైనా లో తయారయ్యే ఫోన్లు ప్రపపంచవ్యాప్తంగా సేల్ అవుతుంటాయి. కానీ, దీనికి భిన్నంగా, Apple దిగుమతి చేసుకున్న iPhone 14 Pro Max పరికరాలను చైనాలో విక్రయిస్తోంది. అంతే కాక ఈ ఐఫోన్ భారతదేశంలో అసెంబుల్ చేయబడటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇండియా యో అసెంబుల్ చేయబడిన ఆపిల్ iPhone 14 Pro Max స్మార్ట్ ఫోన్లను ఆపిల్ చైనా లో విక్రయిస్తోంది. అని,కనీసం అది Weibo పోస్ట్‌ ద్వారా తెలుస్తోంది. యాపిల్ కొంతకాలంగా భారతదేశంలో వివిధ ఐఫోన్ మోడల్‌లను తయారు చేస్తుండగా, కంపెనీ ఈ ఐఫోన్‌లను చైనా వంటి దేశాలకు దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇది ఆపిల్ తన ఉత్పత్తుల అసెంబ్లీకి చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహం ఫలితంగా ఉందని చెప్పవచ్చు.

 

Apple iPhone లు

Apple iPhone లు, Macs మరియు iPadల అసెంబ్లింగ్ కోసం పూర్తిగా చైనాపై ఆధారపడి ఉండేది. అయితే ప్రస్తుతం యుఎస్ మరియు చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక యుఎస్ బ్రాండ్‌లు ఇప్పుడు తమ తయారీ విభాగాలను భారతదేశం మరియు వియత్నాం వంటి దేశాలకు మారుస్తున్నాయి.

భారతీయ వినియోగదారులకు ఈ ఫోన్ చౌకగా ఉంటుందా?

అయితే, ఇండియాలో నే తయారవుతున్న కారణంగా భారతీయ వినియోగదారులకు ఈ ఫోన్ తక్కువ ధరకు లభిస్తుందా? అని మీకు అనుమానం రావొచ్చు.కానీ, ఆపిల్ భారతదేశంలో తన తాజా ఐఫోన్ మోడల్‌లను తయారు చేస్తున్నప్పటికీ, భారతదేశంలో ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ధరలో పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. దేశంలోని ఇంతకుముందు ఉన్న ధరలతో పోల్చినప్పుడు కంపెనీ ఐఫోన్ 14 ప్రో మోడళ్ల ధరలను కూడా పెంచింది.

ఐఫోన్ మోడల్‌లకు సబ్సిడీ
 

ఐఫోన్ మోడల్‌లకు సబ్సిడీ

అయితే, యాపిల్ భారతదేశంలోని పాత ఐఫోన్ మోడల్‌లకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్ 13 వంటి పరికరాలను రూ. 50,000, లాంచ్ ధరపై 30 శాతం కంటే ఎక్కువ తగ్గింపు ఆఫర్లతో ఇప్పటికే అమ్మకానికి ఉంచాయి.స్థానికంగా తయారీ కారణంగా, కంపెనీ ఈ ఐఫోన్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గించనుంది. అందువల్ల, ఈ ఐఫోన్‌లను చౌక ధరకు అందిస్తున్నప్పటికీ, కంపెనీ ఇప్పటికీ లాభాన్ని పొందుతుంది.వినియోగదారులకు ఎప్పుడు ఈ లాభాన్ని అందిస్తాయో చూడాలి.

iPhone 14 Pro Max వివరాలు

iPhone 14 Pro Max వివరాలు

Apple iPhone 14 Pro Max ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ గా ఉంది, ఈ ఫోన్ డైనమిక్ ఐలాండ్‌తో కూడిన 6.7-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. iPhone 14 Pro Max A16 బయోనిక్ ప్రాసెసర్‌తో 6GB RAM మరియు 128GB, 256GB, 512GB మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లతో పనిచేస్తుంది.

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు

ఇక కెమెరా వివరాలు చూస్తే 2MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 12MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 48MP ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉన్న మొదటి ఐఫోన్‌లలో iPhone 14 Pro Max కూడా ఒకటి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.

ధర

ధర

భారతదేశంలో, బేస్‌లైన్ iPhone 14 Pro Max ధర 128GB వేరియంట్ కోసం రూ.1,39,900 గా ఉంది. ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లాక్ మరియు డీప్ పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంది. మరియు ఇది రాబోయే నాలుగు సంవత్సరాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల అందిస్తున్నట్లు ప్రకటించారు.అలాగే ఇదే ప్రస్తుతం ఈ ఫోన్ iOS 16తో మార్కెట్లో లభిస్తుందని గమనించగలరు.

Best Mobiles in India

Read more about:
English summary
Made In India iPhone 14 Pro Max Selling In Chinese Market. Full Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X