మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

Written By:

అంగారక గ్రహ అన్వేషణకు అమెరికా ఇండియా జతకట్టనున్నాయా.. ఆ అపూరూపమైన ఘట్టానికి ఇండియాకు చెందిన వ్యోమగామి నేతృత్వం వహించనున్నాడా..అదే జరిగితే అంగారక గ్రమంపై భారత్ అమెరికా సంయుక్తంగా జెండాలు పాతే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ విషయాన్ని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ డెరైక్టర్ చార్లెస్ ఇలాచీ ఓ ఇంటర్యూలో తెలిపారు.

మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

మంగళయాన్ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో చేపట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకోవడం తెలిసిందే. ఇస్రో సామర్థ్యాన్ని తెలుసుకున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా .. అంగారక అన్వేషణకు ఇస్రోతో కలసి పనిచేయాలనుకుంటోంది. భారత్‌తో కలసి అంగారకున్ని అన్వేషించాలని అనుకుంటున్నామని, ఆ గ్రహంపైకి వ్యోమగాములను పంపాలని భారత్‌ను ఆహ్వనించామన్నారు.

మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

2020-30 కాలంలో మార్స్ మిషన్ చేపట్టాలని తలపోస్తున్నామన్నారు. మార్స్ పరిశోధన తోడ్పాటునకు సంబంధించి వాషింగ్టన్లో త్వరలో నిర్వహించే భేటీకి ఇస్రో అధికారులనూ ఆహ్వానించామన్నారు. అంగారకుడిపైకి పంపే మానవ సహిత అంతరిక్ష నౌకకు సంబంధించి ఇది సన్నద్ధత అని చెప్పారు. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న మంగళయాన్ గురించి మీకు తెలియని నిజాలు ఇవే.

Read more: ఇస్రోకి సలాం కొడుతున్న అగ్రదేశాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అరుణగ్రహంపై పరిశోధనల కోసం

అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్. 2013 నవంబర్ 5, మంగళవారం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు.

ఇది మూడు వందల రోజుల పాటు .. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా

మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో 'మంగళయాన్ ' మొదలైంది. 'మామ్' రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు .. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంది.

మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరుకున్న దేశం మనదే

ఇంతవరకు అనేక దేశాలు అంగారక గ్రహంపై ప్రవేశించడానికి ట్రై చేశాయి. కేవలం నాలుగు దేశాలు అక్కడి తమ జెండాను పాతగలిగాయి. అమెరికా, రష్యా, ఐరోపాలు కాగా నాలుగో దేశం భారత్. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ... మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరుకున్న దేశం మనదే.

మామ్ 'బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు

4.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ 25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ను మోసుకుంటూ ఆ రోజు మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్ళింది. మామ్ 'బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు

దీన్ని అక్టోబర్ 28 నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా

దీన్ని అక్టోబర్ 28 నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5 కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది.

రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం

దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్స్టోన్ (అమెరికా) ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్వర్క్లతో పాటు మరో నాలుగు నెట్వర్క్ల సాయం కూడా తీసుకున్నారు.

నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు

నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు.

నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను

నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబర్ 3 ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబర్ 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేశారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ని సంక్షిప్తంగా మామ్

మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ని సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు. మంగళయాన్ యాత్ర అత్యంత క్లిష్టమైన పని ... అది ఎక్కువ మంది అరిష్టంగా భావించే మంగళవారం రోజు మొదలై, అమావాస్య రోజు లక్ష్యం చేరుకుంది.

భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని

భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబర్ 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది.

మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు

అంగారకుడు ప్రస్తుతం 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున .. మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పడుతుంది.

హాలీవుడ్లో తీసిన గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో

హాలీవుడ్లో తీసిన గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషను విజయవంతం చేయడం భారత్ కే చెల్లింది. దీనికి అయిన ఖర్చు కేవలం 450 కోట్లు. నాసా ఖర్చు పెట్టేదానిలో దాదాపు 10వ వంతు ఉండొచ్చు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం వెనుక కొన్ని ప్రముఖ భారతీయ ప్రైవేటు కంపెనీల సహకారం ఉంది. అవి ఎల్ అండ్ టీ, గోద్రెజ్ అండ్ బైస్, వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్.

మంగళయాన్ చిన్న పేలోడ్ కావచ్చు

ఈ సక్సెస్ వల్ల భారత్ వద్ద ఎంత నాణ్యమైన మానవ వనరులు, సాంకేతిక వనరులు ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పాం. దీని వల్ల మరో ఐదు వేల కోట్ల స్పేస్ బిజినెస్ కు మార్గం సుగమం అయ్యింది. మంగళయాన్ చిన్న పేలోడ్ కావచ్చు, కానీ అది కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుందని బీబీసీ సైన్స్ ఎడిటర్ పొగిడారు. 

మామ్ అంగారకుడిపై మీథేన్ జాడను

మామ్ అంగారకుడిపై మీథేన్ జాడను మనకు తెలపనుంది. ఇది జీవ ఆవాసానికి అత్యంత అవసరమైన వాయువు. అరుణగ్రహంపై ఉన్న నీరు మాయం కావడానికి గల కారణాలు ఇది మనకు తెలిజెబుతుంది. గ్రహాంతర అంతరిక్ష ప్రయోగ శాలలకు ఇది బీజం వేసింది.

మంగళయాన్ సక్సెస్ ... భారత సామర్థ్యానికి ప్రతీక

మంగళయాన్ సక్సెస్ ... భారత సామర్థ్యానికి ప్రతీక. మామ్ విజయవంతం అయ్యాక మోడీ ఒకమాటన్నాడు. ఒక క్రికెట్ టోర్నీ గెలిస్తే బాణసంచా పేల్చి పండగ చేసుకుంటాం. ఇది వెయ్యి క్రికెట్ టోర్నీలతో సమానం ... ఇంటింటా పండగ జరుపుకోవాల్సిన సమయం .. అని అన్నారు.

నెల రోజులు పూర్తి అయిన నేపధ్యంలో

మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళయాన్' అంగారక గ్రహం పై కాలుమోపి నెల రోజులు పూర్తి అయిన నేపధ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ పేజీ పై ప్రత్యేకమైన డూడుల్ను పోస్ట్ చేసింది.

మంగళయాన్ మార్గమధ్యంలోనే తన పనిని

అంగారకుడిపైకి పంపించిన మంగళయాన్ మార్గమధ్యంలోనే తన పనిని ప్రారంభించింది. మరి కొద్ది గంటల్లో కోస్తా తీరాన్ని తాకనున్న హెలెన్ తుఫానును ఫొటో తీసి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్కు పంపించింది. ఇది మంగళయాన్ పంపిన మొట్టమొదటి చిత్రం.

ఈ ఏటి మొదటి పది అద్భుత ఆవిష్కరణల్లో ఒకటిగా

ఇస్రో మానస పుత్రిక మంగళయాన్ టైమ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ఈ ఏటి మొదటి పది అద్భుత ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచింది. రష్యా, అమెరికా, ఐరోపా దేశాలు చేయలేనిది భారత్ చేసి చూపిందని తన మ్యాగజైన్లో పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA invites India to jointly explore Mars
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot