యాప్స్ లేని లైఫ్ వేస్ట్

Written By:

స్మార్ట్‌ఫోన్లు విస్తరించిన తర్వాత మనిషి లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. ఆండ్రాయిడ్‌ ఆధారిత జీవన శైలికి అలవాటుపడ్డాడు మానవుడు. యాప్స్‌ లేనిదే లైఫే లేదన్నట్లు మారిపోయాడు. తనకు కావాల్సిన అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటి ద్వారా వ్యవహారాలు చక్కబెట్టుకోవడం నేర్చుకున్నాడు. మానవ జీవితానికి పనికొచ్చే కొన్ని యాప్స్‌ గురించి తెలుసుకుందాం...

Read more: గూగుల్ ఆన్ హబ్ చాలా ఫాస్ట్ గురూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మానవ వ్యవహారాలు చూసే యాప్‌

మన దినచర్యలకు తోడుగా నిలిచే యాప్‌ 'సన్‌రైజ్‌ క్యాలెండర్‌'. రోజులో ఏ సయమంలో ఏ పనిచేయాలనుకుంటున్నామో తెలియజేస్తుంది. ఈ యాప్‌ గూగుల్‌ క్యాలెండర్‌తోపాటు ఎవర్‌నోట్‌ వంటి అప్లికేషన్లతో సులువగా అనుసంధానమవుతుంది. పార్టీలు, ఇతర కార్యక్రమాలకు బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఉపయోగపడుతుంది. రోజువారీ వ్యవహారాలను చెక్కబెడుతుంది. ఫేస్‌బుక్‌ ఈవెంట్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌, లింక్డ్‌ఇన్‌ కాంటాక్ట్స్‌తోనూ ఇంటిగ్రేట్‌ అవుతుంది.

ఆపద్బంధు

ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు స్నేహితులు, బంధువులను రహస్యంగా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే 'సర్కిల్‌ ఆఫ్‌ 6' యాప్‌ తోడ్పడుతుంది. ముఖ్యంగా మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అప్లికేషన్‌పై రెండుసార్లు ట్యాప్‌ చేస్తే చాలు... ముందుగానే రాసిపెట్టుకున్న మూడు మెసేజ్‌ల్లో ఒకటి మీ కాంట్రాక్ట్స్‌లోని ఆరుగురికి చేరిపోతుంది. జీపీఎస్‌ ద్వారా మీరెక్కడున్నారో చెబుతుంది. మిమ్మల్ని పిక్‌ చేసుకోవాల్సిందిగా ఒక సందేశాన్ని పంపుతుంది. ఇంకో సందేశం ద్వారా వెంటనే కాల్‌ చేయాల్సిందిగా ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్‌ వెళ్తుంది. ఈ యాప ్‌ద్వారా మహిళా భద్రతాకు ఉద్దేశించిన హాట్‌లైన్‌తో నేరుగా సంప్రదింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది.

అనారోగ్య బారిన పడితే..

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్‌ను వెంటనే సంప్రదించడం కొన్ని సందర్భాల్లో కష్టం. అయితే... మనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటో పేర్కొంటే డాక్టర్‌ను ఎంత సమయంలో సంప్రదించొచ్చో చెప్పే అప్లికేషన్‌ 'వెబ్‌ఎండీ'. ఆండ్రాయిడ్‌లో ఇది అందుబాటులో ఉంది. అనారోగ్య లక్షణాలు పేర్కొంటే.. వచ్చిన వ్యాధి ఏమిటో చెప్పడంతోపాటు ఎలాంటి ప్రాథమిక చికిత్స తీసుకోవచ్చో సూచిస్తుంది. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో చెబుతుంది.

స్టూడెంట్స్‌ కోసం..

మానసిక స్థితి, అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌, ప్రవర్తన, భావోద్వేగాలను అంచనా వేసే యాప్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. 'స్టూడెంట్‌ లైఫ్‌' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్‌ యాప్‌ ఇది. సంతోషం, ఒత్తిడి, ఒంటరితనం ఎలాంటి భావోద్వేగాన్నయినా గుర్తిస్తుంది. విద్యార్థులే కాదు.. ఎవరైనా తమ మానసికస్థితిని దీని ద్వారా తెలుసుకోవచ్చు.

మన రైతుబజార్‌

రైతుబజార్‌లోని కూరగాయల ధరలు తెలుసుకోవడానికి యాప్‌ ఒకటి అందుబాటులో ఉంది. 'మన రైతుబజార్‌' అనే ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.. ఏ కూరగాయ ఎంత ధర పలుకుతోందో తెలుసుకోవచ్చు. సాధారణంగా కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే... ఈ యాప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ముఖ్య నగరాల రైతుబజార్లలోని ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.

మందులు వేసుకునేందుకు..

వృద్ధాప్య జీవనశైలిలో మందులు మింగడం ఒక భాగమైపోయింది. మెడిసిన్‌ వాడటానికి సంబంధించి అలర్ట్‌ చేస్తుంది ఓ యాప్‌. 'పిల్‌బాక్సీ' అనే పేరుతో రూపొందించిన ఈ అప్లికేషన్‌లో మెడిసిన్స్‌కు సంబంధించిన సమాచారం ఎంటర్‌ చేస్తే మందులు వేసుకునే సమయాన్ని అది గుర్తు చేస్తుంది.

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు చెక్‌

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని టీన్‌ డ్రైవర్‌ సపోర్ట్‌ సిస్టం(టీడీఎస్‌ఎస్‌) పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను రూపొందించారు. తమ పిల్లలు ఏ విధంగా డ్రైవింగ్‌ చేస్తున్నారో తల్లిదండ్రులకు ఈ యాప్‌ ద్వారా తెలిసిపోతుంది. అంతేకాదు.. పిల్లల ప్రవర్తన గురించి కూడా సమాచారం అందుతుంది. కుర్రకారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తుంటే తల్లిదండ్రులకు మేసేజ్‌ వెళ్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write know your daily using apps.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot