జియోపై ఊక్లా దాడి , స్పీడ్‌లో ఎయిర్‌టెల్ బెస్ట్

Written By:

దేశంలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ ఏదన్న దానిపై చెలరేగిన వివాదం ఇప్పట్లో ఆగిపోయే పరిస్థితులు కనపడటం లేదు. రిలయన్స్ జియో నిన్న స్పీడ్ టెస్ట్ పై చేసిన ఆరోపణలను గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్ లీడర్ ఊక్లా కొట్టిపారేసింది. 

ఈ మిస్టేక్స్ మీ ఆఫీస్ కంప్యూటర్‌లో చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సేకరించే సమాచారం

తాము ఎంతో పారదర్శకతను, విశ్వసనీయతను పాటించి ఎయిర్‌టెల్కు ఈ ట్యాగ్ ఇచ్చామని స్పష్టంచేసింది. ఎలాంటి స్పీడ్ టెస్ట్ ఇంటర్నెట్ టెస్ట్ చేసేందుకైనా సేకరించే సమాచారం చాలా పక్కాగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ఎయిర్ టెలే

దేశంలో అత్యంత ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ఎయిర్ టెలేనంటూ ఊక్లా సర్టిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని జియో ఆరోపించింది. ఈ విషయాన్ని అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరకు తీసుకెళ్లింది.

ఊక్లా రేటింగ్స్ పై జియో విమర్శలు

ఊక్లా రేటింగ్స్ పై జియో విమర్శలు సంధించింది.అయితే ఆ విమర్శలను ఊక్లా కొట్టిపారేసింది. 2016 మూడో, నాలుగో క్వార్టర్ డేటా తీసుకొని ఈ టెస్ట్ నిర్వహించామని.. ఈ డేటా ఫలితాలతోనే ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు స్పష్టీకరించింది.

చాలా అంశాలను

ఇండియా లాంటి మార్కెట్లలో స్పీడు టెస్ట్ నిర్వహించేటప్పుడు, చాలా అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని ఊక్లా తెలిపింది.

అన్నీ అంశాలను పరిశీలిస్తామని

డ్యూయల్ సిమ్ డివైజ్‌లు, నెట్ వర్క్ టెక్నాలజీ, డివైజ్ టైప్స్ వంటి అన్నీ అంశాలను పరిశీలిస్తామని ఊక్లా సీఓఓ జామీ స్టీవెన్ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Ookla counters Reliance Jio, defends speed test result read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting