మంచి ఫీచర్లతో ఇండియాలో రిలీజ్ అయిన ఒప్పో K3

|

ఒప్పో K3 భారతదేశంలో లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు జూలై 23 నుండి మొదలు కానుంది. గేమ్‌బూస్ట్ 2.0 మరియు డిసి డిమ్మింగ్‌తో ప్రీలోడ్ చేయబడిన ఒప్పోK3 మెరుగైన గేమింగ్ అనుభవంతో యువతను ఆకర్షించేలా రూపొందించబడింది ఈ స్మార్ట్‌ఫోన్ . ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం VOOC 3.0 మద్దతును కలిగి ఉంది.

oppo k3 price in india rs 16990 launch specifications

అంతేకాకుండా కంటి రక్షణ కోసం జర్మనీకి చెందిన TUV రీన్లాండ్ ప్రొటెక్షన్ కూడా ధృవీకరించింది. ఒప్పోK3 మొదటగా చైనాలో కంపెనీ యొక్క తాజా K-సిరీస్ మోడల్‌గా మే నెలలో ప్రారంభించబడింది. కొత్త ఒప్పో ఫోన్ వివోV15, రియల్‌మిX, రెడ్‌మిK20 వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.

ధర వివరాలు:

ధర వివరాలు:

ఇండియాలో ఒప్పోK3 యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 16,990రూపాయలు ఉండగా, దాని యొక్క 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర 19,990రూపాయలు. ఈ కొత్త ఒప్పో మొబైల్ ఇండియాలో జూలై 23 నుంచి అమెజాన్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నది. ఈ ఫోన్ అరోరా బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆఫర్లు:

ఆఫర్లు:

ఒప్పోK3 యొక్క లాంచ్ ఆఫర్లలో భాగంగా అమెజాన్ పే బ్యాలెన్స్‌ మీద కొనుగోలు చేసిన వారందరికీ 1,000రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించే వినియోగదారులకు కూడా 1,000రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా ఒప్పోK3 కొనుగోలుదారులకు జియో నుంచి 7,050 రూపాయల విలువైన వోచర్‌లను, లెన్స్‌కార్ట్ గిఫ్ట్ వోచర్‌లు, ఓయో వోచర్‌లను పొందవచ్చు. ముఖ్యవిషయం ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి నో-కాస్ట్ EMI ఎంపికలు లేవు.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

డ్యూయల్ సిమ్ (నానో) ఆప్షన్ గల ఒప్పోK3 ఆండ్రాయిడ్ 9 పై కలర్OS 6.0 తో రన్ అవుతుంది. ఇది 19.5: 9 కారక నిష్పత్తితో మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే కూడా ఉంది.ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 710 SoC, 6GB మరియు 8GB LPDDR4x RAM ఎంపికలతో వస్తుంది.

కెమెరా:

కెమెరా:

ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పోK3 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX519 సెన్సార్ తో మరియు డెప్త్ సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉన్న పాప్-అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. ఇంకా కెమెరా మాడ్యూల్ ఐదు సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉందని మరియు 0.74 సెకన్ల వేగంతో స్లైడ్ అవుతుందని పేర్కొన్నారు.

కనెక్టివిటీ:

కనెక్టివిటీ:

ఒప్పో K3 లో AI పోర్ట్రెయిట్ మోడ్ మరియు AI సీన్ గుర్తింపును అందించింది. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ అల్గోరిథం ఉపయోగించి డార్క్ షాట్‌లను బ్రైట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా క్లియర్ నైట్ వ్యూ 2.0 ఫీచర్ ఉంది.ఒప్పోK3 లో 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి ఉన్నాయి.అంతేకాకుండా ఒప్పో K3 స్మార్ట్‌ఫోన్‌ 3,765mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒప్పో యొక్క VOOC 3.0 ద్వారా వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
oppo k3 price in india rs 16990 launch specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X