Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!

By Maheswara
|

Oppo సంస్థ ఎప్పటికప్పుడు నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ముఖ్యంగా వివో, మోటో కంపెనీలకు పోటీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. అలాగే, Oppo ఇప్పుడు కొత్త టాబ్లెట్ మోడల్‌లను పరిచయం చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది.

 
Oppo Pad 2 Specifications Leaked Online, Expected To Launch Soon With Mediatek Dimensity 9000 Chipset.

Oppo Pad 2 టాబ్లెట్ గురించి లీక్ అయిన సమాచారం ప్రకారం, Oppo కంపెనీ Oppo Pad 2 అనే టాబ్లెట్ మోడల్‌ను త్వరలో పరిచయం చేయబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే విడుదల చేసిన మొదటి Oppo టాబ్లెట్ మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. కాబట్టి ఇప్పుడు Oppo సంస్థ Oppo Pad 2 మోడల్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

 

Oppo Pad 2 స్పెసిఫికేషన్ల వివరాలు

Oppo Pad 2 మోడల్ యొక్క ఫీచర్లు ను గమనిస్తే పెద్ద డిస్‌ప్లేతో వస్తుందని ఆన్‌లైన్‌లో లీక్ అయిన వివరాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఈ వివరాలు వివరంగా పరిశీలిద్దాం. ఒప్పో ప్యాడ్ 2 మోడల్ 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ Oppo Pad 2 మోడల్‌లో 2800 x 2000 పిక్సెల్‌లు, 144 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10 ప్లస్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. Oppo Pad 2 మోడల్‌లో MediaTek Dimensity 9000 చిప్‌సెట్ ఉన్నట్లు రిపోర్ట్ లు తెలియచేస్తున్నాయి. అలాగే, ఈ టాబ్లెట్ యొక్క గేమింగ్ ప్రయోజనాల ను ఒక్కసారి గమనిస్తే, ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కావడం ప్రధాన విషయంగా చెప్పుకోవచ్చు.

Oppo Pad 2 Specifications Leaked Online, Expected To Launch Soon With Mediatek Dimensity 9000 Chipset.

ఇంకా RAM మరియు స్టోరేజీ వివరాలు గమనిస్తే, Oppo Pad 2 మోడల్‌లో 12GB RAM ఉంది. తరువాత, కొత్త టాబ్లెట్ 128GB లేదా 256GB నిల్వ మద్దతుతో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. Oppo కంపెనీ ఈ టాబ్లెట్ మోడల్ లో బ్యాటరీ సామర్థ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు లీక్ అయిన వివరాలు తెలియచేస్తున్నాయి. అంటే Oppo Pad 2 మోడల్ 9500 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి ఈ oppo టాబ్లెట్ గొప్ప బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. ఇంకా, ఈ Oppo Pad 2 మోడల్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుందని రిపోర్టులు తెలియచేస్తున్నాయి. మరి ఇప్పటికే లాంచ్ అయిన మొదటి తరం Oppo Pad Air మోడల్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

Oppo Pad 2 Specifications Leaked Online, Expected To Launch Soon With Mediatek Dimensity 9000 Chipset.

Oppo Pad Air వివరాలు

Oppo Pad Air టాబ్లెట్ 2000 x 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 10.36-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో ఆధారితమైనది మరియు గరిష్టంగా 6GB RAMతో వస్తుంది. Oppo Pad Air టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా ఒప్పో కంపెనీ యొక్క స్వంత లేయర్ ColorOS 12 పై నడుస్తుంది. ఇక ఈ టాబ్లెట్ యొక్క కెమెరా ల విషయానికొస్తే, Oppo Pad Air ఒకే ఒక 8MP వెనుక కెమెరాను f/2.0 లెన్స్‌తో కలిగి ఉంటుంది. ఇక ముందు వైపు విషయానికి వస్తే, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ యొక్క ఇతర ఫీచర్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్‌లతో కూడా వస్తోంది, ఒప్పో ప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Oppo Pad Air టాబ్లెట్ స్టైలస్ పెన్ సపోర్ట్‌తో పాటు మాగ్నెట్ కీబోర్డ్‌కు కూడా మద్దతును ఇస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo Pad 2 Specifications Leaked Online, Expected To Launch Soon With Mediatek Dimensity 9000 Chipset.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X