ఒక్కటవుతున్న స్నాప్‌డీల్, పేటీఎమ్ !
దాదాపు నెల రోజుల క్రితమే ఈ దిగ్గజాల మధ్య విలీన అంశంపై చర్చలు

మార్చి 31లోగా..
ఈ మధ్యనే చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్‌ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది.

ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం
ఈ నేపథ్యంలోనే స్నాప్‌డీల్‌తో ఈ-కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు
ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది.

కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారు
ఒకవేళ స్నాప్‌డీల్, పేటీఎం ఈ-కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది.

భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్
స్నాప్‌డీల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ-కామర్స్‌లో రూ. 1,350-1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications








