అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన గూగుల్ మ్యాప్స్...

|

పెరూలో ఓ విచత్ర సంఘటన చోటుచుకుంది. లైమాలోని ఓ పాపులర్ బ్రిడ్జ్‌కు సంబంధించిన డైరెక్షన్స్‌ను గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఓ వ్యక్తి తెలసుకుంటున్నాడు. స్ట్రీట్ వ్యూ ద్వారా డైరెక్షన్స్ చూస్తోన్న సమయంలో అతనికో మహిళ కనిపించింది. బెంచ్ పై వేరొక వ్యక్తి ఒడిలో తలవాల్చుకుని పడుకుని ఉన్న ఆమె మొహం పూర్తిగా బ్లర్ అయి ఉంది.

 

ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు...త్వరపడండిఫ్లిప్‌కార్ట్‌లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు...త్వరపడండి

అతనికి ఎక్కడో అనుమానం కలిగింది..

అతనికి ఎక్కడో అనుమానం కలిగింది..

ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తికి ఎక్కడో అనుమానం కలిగింది. ఆమె ధరించిన దస్తులు అచ్చం తన భార్యవి లాగే ఉండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. దీంతో ఆ ఫోటో గురించి ఆరా తీయాలన్న కుతూహలం అతనిలో మరింతగా పెరిగిపోయింది. ఆ ఫోటో గురించి ఆరా తీయటం మొదలుపెట్టిన వ్యక్తికి పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి.

వారిద్దరూ విడాకులు తీసుకున్నారు..

వారిద్దరూ విడాకులు తీసుకున్నారు..

గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాలు ఈ ఫోటోను 2013లో బ్యూరాన్ డి లాస్ సస్పిరోస్ డి బార్రాకో వద్ద క్యాప్చుర్ చేసాయి. ఆ ఫోటోలో ఉన్నది తన భార్యేనని నిర్థారణ చేసుకున్న తరువాత సదురు వ్యక్తి ఆమెను నిలదీయగా వారిద్దరి మధ్య విబేధాలు మరింత పెరిగి విడాకుల వరకు దారితీసినట్లు డైలీ మెయిల్ యూకే తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో...
 

గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో...

గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.

ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా..

ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా..

గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Best Mobiles in India

English summary
Peruvian man divorces cheating wife spotted on Google Maps.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X