ఈ సిమ్ తీసుకుంటే రూ.16కే 1జీబి 4జీ డేటా, నెలంతా కాల్స్

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఆఫర్ క్రింద మూడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పై సంవత్సరం పాటు 28% డిస్కౌంట్‌లను RCom ప్రకటించింది. ఈ ప్లాన్‌లను పొందాలనుకునే యూజర్లు కంపెనీ అఫీషియల్ పోర్టల్ అయిన rcom-eshop.comలోకి లాగినై నచ్చిన ప్లాన్‌ను subscribe చేసుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లాన్‌ ఎంపిక చేసుకున్న వెంటనే

ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ యూజర్ అడ్రస్‌కు సిమ్ కార్డును డెలివరీ చేసి ఆర్‌కామ్ అందిస్తోన్న ఈ స్పెషల్ డిస్కౌంట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి క్లియర్ కట్‌గా యూజర్‌కు వివరించటం జరుగుతుంది.

సంవత్సరం పాటు 28% డిస్కౌంట్‌..

రూ.699, రూ.499, రూ.299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పై ఈ 28% డిస్కౌంట్‌ను ఆర్‌కామ్ అందిస్తోంది. డిస్కౌంట్ మినహాయించిన తరువాత రూ.699 ప్లాన్ రూ.499కు, రూ.499 ప్లాన్ రూ.399కు, రూ.299 ప్లాన్ రూ.239కు లభిస్తుంది. సంవత్సరం పాటు ఇదే డిస్కౌంట్ కొనసాగుతుంది.

 

రూ.499 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా..

రూ.499 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా నెలకు 30జీబి (4G/3G/2G) డేటా లభిస్తుంది. ఈ 30 రోజుల ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

 

రూ.399 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా...

రూ.399 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా నెలకు 15జీబి (4G/3G/2G) డేటా లభిస్తుంది. ఈ 30 రోజుల ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

రూ.239 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా..

రూ.239 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా హోమ్ సర్కిల్ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ మధ్య నిమిషానికి 50 పైసలు ఛార్జ్ చేయటం జరుగుతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

 

ఆఫర్ ఆర్‌కామ్ 4జీ సర్కిల్స్‌లో మాత్రమే..

ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఆర్‌కామ్ 4జీ సర్కిల్స్ అయిన ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇండియన్ టెలికం మార్కెట్లో ఒకప్పటి సంచలన నెట్‌వర్క్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీవ్రమైన ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RCom Offering 1GB of Data at Just Rs.16.66 With its Postpaid Plans in 4G Circles. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting