Just In
- 9 hrs ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 9 hrs ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 10 hrs ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
- 12 hrs ago
BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో ఈ ప్లాన్లపై అదనపు వాలిడిటీ!! త్వరపడండి
Don't Miss
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...
రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈ రోజు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలయినాయి. గత వారం రియల్‌మి 6 ప్రోతో పాటు లాంచ్ అయిన రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యొక్క వెబ్ సైట్ లో గొప్ప ఆఫర్లతో మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలను మొదలుపెట్టింది.

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz డిస్ప్లేను కలిగి ఉండి 30W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 6 గత సంవత్సరం ప్రారంభమైన రియల్‌మి 5కి అప్ గ్రేడ్ గా రూపొందించబడింది. ఇది షియోమి యొక్క రెడ్‌మి నోట్ 8 ప్రోకు గట్టి పోటీదారుగా వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 6 యొక్క అమ్మకపు ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
BSNL STV 247 Plan:30రోజులలో 3GB రోజువారీ డేటాతో టెల్కోలకు సవాల్!!!

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి 6 ను మూడు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో బేస్ మోడల్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999 కాగా, 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 కాగా టాప్-మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వేరియంట్ యొక్క ధర రూ.15,999 గా ఉంది. ఈ ఫోన్ కామెట్ బ్లూ మరియు కామెట్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్ ఉచితం

రియల్‌మి 6 సేల్స్ ఆఫర్స్
రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ యొక్క వెబ్ సైట్ లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయినాయి. ఈ అమ్మకపు ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క EMI లావాదేవీలను ఉపయోగించే వినియోగదారులకు రూ.750ల తగ్గింపును అందిస్తుంది. నెలకు రూ.1,084 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను కూడా వినియోగదారులు పొందవచ్చు. రియల్‌మి.కామ్ సైట్ రియల్‌మి 6 కొనుగోలు మీద తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను మార్పిడి చేసుకోవటానికి క్యాషిఫై ద్వారా ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్

రియల్‌మి6 స్పెసిఫికేషన్స్
రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ ముందు ఫోన్ల మాదిరిగానే 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ ఫుల్ HD + రిజల్యూషన్‌కు మద్దతును ఇవ్వడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 90Hz డిస్ప్లే మద్దతుతో పాటుగా 30W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.అంటే ఈ ఫోన్ల యొక్క బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 60 నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ పేర్కొంది.
Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

రియల్‌మి6 కెమెరా సెటప్
రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G90T SoC ప్రాసెసర్ చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో మరియు డీప్ సెన్సార్ల లెన్స్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి 6 కనెక్టివిటీ
రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ 4,300mah పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. భద్రత కోసం రియల్‌మి 6 ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి యుఐతో రన్ చేయబడుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, బ్లూటూత్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, సామీప్య సెన్సార్ మరియు దిక్సూచి / మాగ్నెటోమీటర్ వంటి సెన్సార్లను కలిగి ఉన్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190