Flipkartలో రియల్‌మి ఫోన్‌ల మీద గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి...

|

ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో రియల్‌మి యొక్క మిడ్-రేంజ్ విభాగంలోని కొత్త స్మార్ట్‌ఫోన్లు రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రోలతో పాటుగా బడ్జెట్ ధరలో లభించే రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ అమ్మకం సమయంలో లాంచ్ అయిన ధర కంటే తక్కువ ధరతో ఇవి ప్రస్తుతం లభిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అతి పెద్ద డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ల ధరల వివరాలు

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ల ధరల వివరాలు

ఇండియాలో గత నెలలో రియల్‌మి 7 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.19,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.21,999. అలాగే రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ యొక్క రెండు వేరు వేరియంట్‌లలో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.14,999 కాగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.16,999. వీటిని మిస్ట్ బ్లూ మరియు మిస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ప్రస్తుతం కొనుగోలు చెయవచ్చు. అలాగే రియల్‌మి C11 యొక్క ఏకైక 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్‌ను రూ.6,499 ధర వద్ద రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే కలర్ ఎంపికలలో లభిస్తుంది.

 

Also Read: స్మార్ట్ ఫోన్ లపై Flipkart లో భారీ ఆఫర్లు ! ఫోన్ల లిస్ట్ మరియు ధరల వివరాలు చూడండి.Also Read: స్మార్ట్ ఫోన్ లపై Flipkart లో భారీ ఆఫర్లు ! ఫోన్ల లిస్ట్ మరియు ధరల వివరాలు చూడండి.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ల మీద ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ల మీద ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా రియల్‌మి యొక్క అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు సంస్థ అందిస్తున్న తగ్గింపు ఆఫర్స్ కాకుండా అదనంగా SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల కొనుగోలు మీద 10% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుల మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటుగా అన్ని రకాల బ్యాంకుల కార్డుల మీద నో-కాస్ట్ EMI ఆఫర్ లభిస్తుంది.

రియల్‌మి 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్

రియల్‌మి 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్

రియల్‌మి 7 ప్రో ఫోన్ యొక్క 6.4-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో, 480 నిట్స్ ప్రకాశం మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. అలాగే ఇది అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ కోసం సరికొత్త స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్ ను కలిగి ఉంది.

రియల్‌మి 7 ప్రో సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్

రియల్‌మి 7 ప్రో సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్

రియల్‌మి 7 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.3 అల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో B/W సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో F/ 2.0 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కుడి వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

రియల్‌మి 7 మీడియాటెక్ G95 SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి 7 మీడియాటెక్ G95 SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి 7 ఫోన్ అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ ను అనుమతించే మీడియాటెక్ G95 SoC ని కలిగి ఉంది. అలాగే ఇది 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. వీటితో పాటు ఇది ARM మాలి-G76 MC4 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 26 నిమిషాలలో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ 3-కార్డ్ లాట్‌కు మద్దతును ఇస్తూ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతాయి. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది.

రియల్‌మి C11 పోర్ట్రెయిట్ ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 పోర్ట్రెయిట్ ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme 7 Pro, Realme 7, Realme C11 Now Available With Discount Offers on Flipkart Sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X