రెడ్‌మి నోట్ 10, 10T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరోసారి పెరిగాయి!! కొత్త ధరలు ఇవే...

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్‌మి ఈ సంవత్సరం మార్చి నెలలో రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. 4GB RAM + 64GB స్టోరేజ్ మరియు 6GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌లను రూ.11.999 ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారతదేశంలో మూడవసారి మరొక సారి ధర పెంపును అందుకుంది. ధర మరొకసారి పెరగడంతో బేస్ వేరియంట్ 4GB ర్యామ్+ 64GB వెర్షన్ యొక్క ధర రూ.13,499 లకు పెరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. అలాగే 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క రూ.14,999 మునుపటి ధర ఇప్పుడు రూ.15,499 ధరకు పెరిగింది.

రెడ్‌మి నోట్ 10 కొత్త ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 కొత్త ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రూ.11,999 మరియు రూ.13,999 దరల వద్ద లాంచ్ అయింది. అయితే కొద్ది రోజుల ముందు వీటి మీద రూ.1000 ధరలు పెరిగడంతో వాటి ధరలు రూ.12,999 మరియు రూ.14,999 లకు పెరిగాయి. అయితే ఇప్పుడు మరొక సారి ఇది ధరల పెంపును అందుకున్నది. మొత్తంగా రెండు వేరియంట్లు రూ.1500 ధరల పెంపును అందుకున్నాయి. ఇప్పుడు వీటి ధరలు వరుసగా రూ.13,499 మరియు రూ.15,499 గా ఉన్నాయి. అప్ డేట్ చేయబడిన కొత్త ధరలు Mi.com మరియు Amazon.in లో ప్రతిబింబిస్తున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా ప్రతిబింబిచే అవకాశం ఉంది.

Amazon స్పేస్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలుAmazon స్పేస్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు

Redmi నోట్ 10T 5G కొత్త ధరల వివరాలు

Redmi నోట్ 10T 5G కొత్త ధరల వివరాలు

Redmi నోట్ 10T 5G గత నెలలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ప్రారంభ ధర రూ.13999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్‌ యొక్క ధర రూ.15999. ఈ ప్రారంభ ధర పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని కంపెనీ లాంచ్ సమయంలోనే తెలిపింది. నేడు కంపెనీ ఈ ఫోన్ యొక్క ధరను ప్రతి వేరియంట్ మీద రూ.500పెంచింది. ధరల పెంపు అందుకున్న తరువాత ఈ ఫోన్ ఇప్పుడు రూ.14,499 మరియు రూ.16,499 ధరల వద్ద లభిస్తుంది. ఇది Amazon.in, mi.com, Mi హోమ్ స్టోర్‌ల నుండి ఆగస్టు 9 నుండి కొత్త ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10T 5G స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10T 5G స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు MIUI తో రన్ అవుతుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్ తో మరియు 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల ఫుల్- HD+ డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో రన్ అవుతూ 6GB వరకు గల ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

ఆప్టిక్స్

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాటింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ 64GB మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 161.81x75.34x8.92mm కొలతల పరిమాణంలో 190 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఇది ఆండ్రాయిడ్ 11 లో MIUI 12 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌, 20: 9 కారక నిష్పత్తితో మరియు 100 శాతం డిసిఐ-పి 3 విస్తృత కలర్ స్వరసప్తకంతో కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 SoC, అడ్రినో 612 GPU ను కలిగి ఉండి 6GB వరకు LPDDR4x RAMతో జతచేయబడి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX582 సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10 and 10T 5G Smartphones Price Hike in India: New Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X