2022 లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లు ఇవే ! టాప్ 5 లిస్ట్ చూడండి!

By Maheswara
|

గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ యొక్క నివేదిక ప్రకారం 2022 నాల్గవ త్రైమాసికపు స్మార్ట్‌ఫోన్ విక్రయాల డేటాను భారత మార్కెట్‌లో ప్రచురించింది. ఈ డేటా ప్రకారం, 2022 Q4లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ Apple iPhone 13 . ఈ నివేదిక ప్రకారం, iPhone 13 విక్రయాలలో 4% మార్కెట్ వాటాను కలిగి ఉంది, శామ్‌సంగ్ గెలాక్సీ M13 మరియు షియోమీ Redmi A1 3% అమ్మకాల తో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ రిపోర్ట్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

 

భారతీయ మార్కెట్‌లో

భారతీయ మార్కెట్‌లో

భారతీయ మార్కెట్‌లో ఐఫోన్ అమ్మకాల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఇదే మొదటిసారి. ఐఫోన్లు ఖరీదైనవి అయినా కూడా, బడ్జెట్ ఫోన్ ల సేల్ కంటే ఎక్కువ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ లో Realme C11, Oppo A54, Galaxy M12, Redmi Note 10s మరియు Redmi 9A ఫోన్లు ఉన్నాయి. అవన్నీ ₹15,000 ధర కేటగిరీ కిందకు వస్తాయి.

Apple iPhone 13

Apple iPhone 13

అయితే, 2022 చివరి త్రైమాసికంలో Apple iPhone 13పై అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి అమ్మకాలు మరియు తగ్గింపులు జరిగాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులలో ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ₹50,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులో కి రావడంతో అమ్మకాలు పుంజుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ ఆఫర్‌లు కూడా ఐఫోన్ 13 మొదటి స్థానం లో ఉండటానికి కారణం అని చెప్పవచ్చు.

 ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితా
 

ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితా

అయినప్పటికీ, Q4, 2022లో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఐఫోన్ 13 , శామ్‌సంగ్ గెలాక్సీ M13, షియోమీ Redmi A1, Samsung Galaxy A04s మరియు Realme C35 వరుసగా నాల్గవ మరియు ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 

Apple iPhone 13 స్పెసిఫికేషన్స్ వివరాలు

Apple iPhone 13 స్పెసిఫికేషన్స్ వివరాలు

Apple iPhone 13 స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. ఇది iPhone 14కి కూడా శక్తినిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌తో వస్తుంది మరియు ఎక్కువ కాలం బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఇక  సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అమర్చారు. వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది.

ధర

ధర

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందించబడుతుంది. వీటిలో 128GB, 256GB మరియు 512GB ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బాక్స్ తో పాటే iOS 15లో నడుస్తుంది. ఇది ప్రస్తుతం 128GB స్టోరేజ్ మోడల్ కోసం Flipkartలో ₹61,999 ధర వద్ద జాబితా చేయబడింది. Amazon దీన్ని ₹69,900 ధర వద్ద సేల్ చేస్తోంది.

నకిలీ ఐఫోన్లు

నకిలీ ఐఫోన్లు

ఐఫోన్ కు ఉన్న క్రేజ్ ను ఆసరాగా తీసుకుని దేశ రాజధాని ఢిల్లీ మరియు నోయిడా ప్రాంతాలలో తక్కువ ధరకు నకిలీ ఐఫోన్ 13 ఫోన్ ను సేల్ చేస్తూ ,ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నోయిడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసి 60 నకిలీ ఐఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీ లో కేవలం రూ.12,000కు చవకైన మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసిందని, అయితే చైనా షాపింగ్ పోర్టల్‌లో రూ.4,500 ఖరీదు చేసే అసలైన ఐఫోన్‌ బాక్సులతో పాటు రూ.1,000 విలువైన యాపిల్ స్టిక్కర్‌లను కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
Reports Say Apple iPhone 13 Is Best Selling Smartphone In Q4 Of 2022. Price And Specifications Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X