ఇండియన్ రైల్వేస్ కొత్త ఫీచర్ Zero-FIR

|

ప్రయాణికులకు మరింత స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేసే క్రమంలో ఇండియన్ రైల్వైస్ మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలులో వెళుతోన్న ప్రయాణికులకు 'జీరో-ఎఫ్ఐఆర్' (Zero-FIR) సర్వీస్ అందుబాటులో ఉంటుంది. యాప్ రూపంలో అందుబాటులో ఉండే ఈ ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా రైళ్లలో ఎదురయ్యే సమస్యలను సమస్యలను ఫిర్యాదు చేసేందుకు తరువాత స్టేషన్ వచ్చేవరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

 

యాప్ నుంచే నేరుగా ఫిర్యాదు..

యాప్ నుంచే నేరుగా ఫిర్యాదు..

జీరో-ఎఫ్ఐఆర్ అప్లికేషన్‌ను తమ‌తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నేరుగా ఆ యాప్ నుంచే ఎఫ్ఐఆర్‌ను లాడ్జ్ చేసే వీలుంటుంది. ప్రయాణికుని పేరుతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీస్ అధికారులకు కేసు ట్రాన్స్‌ఫర్ కాబుడుతుంది. దీంతో వారు నిమిషాల వ్యవధిలో రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

త్వరలో దేశవ్యాప్తంగా..

త్వరలో దేశవ్యాప్తంగా..

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతోంది. రైతులు కదులుతున్నప్పుడు మహిళల పై వేధింపులకు పాల్పడనా, దొంగతనం చేసినా లేదా ఎటెవంటి నేరానికి పాల్పడినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంటుంది.

కౌంటర్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవటం ఎలా..?
 

కౌంటర్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవటం ఎలా..?

ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కౌంటర్స్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే క్రమంలో యూజర్లు ముందుగా IRCTC వెబ్‌‌సైట్‌లోకి వెళ్లాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత ‘Trains' సబ్‌హెడ్డింగ్ క్రింద కనిపించే ‘Cancel Ticket' మెనూను సెలక్ట్ చేసుకోవాలి. ఈ మెనూలో ‘Counter Ticket' అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకున్నట్లయితే వేరొక పేజీలోకి మీరు రీడైరెక్ట్ కాబడతారు.

Cancel Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Cancel Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

ఈ పేజీలో మీ ట్రెయిన్ టికెట్‌కు సంబంధించి పీఎన్ఆర్ నెంబర్ అలానే ట్రెయిన్ నెంబర్‌లను ఎంటర్ చేయాలి. డిటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను ఓకే చేసి ‘Submit' బటన్ పై క్లిక్ చేసినట్లయితే, టికెట్ బుకింగ్ సమయంలో మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓ OTP వస్తుంది. ఈ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్‌చేసి Cancel Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

రీఫండ్ అమౌంట్ అక్కడికే వెళ్లి తీసుకోవచ్చు..

రీఫండ్ అమౌంట్ అక్కడికే వెళ్లి తీసుకోవచ్చు..

టికెట్ క్యాన్సిల్ అయిన వెంటనే అదే మొబైల్ నెంబర్‌కు సంబంధిత పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు రీఫండ్ అమౌంట్ డిటెయిల్స్ పంపబడతాయి. రీఫండ్ అమౌంట్‌ను మీరు టికెట్ బుక్ చేసుకున్న రిజర్వేషన్ కౌంటర్ నుంచి లేదా సమీపంలో శాటిలైట్ పీఆర్ఎస్ స్టేషన్ నుంచీ యూజర్లు పొందవచ్చు.

నాలుగు గంటల ముందే ప్రాసెస్‌ కంప్లీట్ చేయాలి..

నాలుగు గంటల ముందే ప్రాసెస్‌ కంప్లీట్ చేయాలి..

రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసకున్న టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవాలనుకునే యూజర్లు ప్రయాణానికి నాలుగు గంటల ముందే ఈ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. RAC/Waitlistలో ఉన్న టికెట్లను ప్రయాణానికి 30 నిమిషాల ముందే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
RPF At Your Service: Railways To Soon Launch Mobile Application For Passengers Requiring Police Assistance.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X