శామ్సంగ్ వార్షికోత్సవ సేల్స్....... ఆఫర్స్ అదుర్స్

|

శామ్సంగ్ తన వార్షికోత్సవ (Anniversary) సేల్స్ ని ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, స్మార్ట్ వాచ్, ఆడియో డివైస్ మరియు గృహోపకరణాలు వంటి అనేక రకాల ఉత్పత్తులపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిపై అధిక మొత్తంలో తగ్గింపులను తెచ్చే శామ్‌సంగ్ వార్షికోత్సవ సేల్స్ ఇప్పుడు సంస్థ యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో మొదలైంది మరియు ఇది అక్టోబర్ 13 వరకు కొనసాగుతుంది.

శామ్సంగ్
 

శామ్సంగ్ యొక్క వార్షికోత్సవ సేల్స్ పరిమిత కాలంలో ధరల తగ్గింపుతో పాటు అదనంగా 10 శాతం బ్యాంకింగ్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అమెజాన్ పే లావాదేవీలకు క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్‌లతో పాటు శామ్‌సంగ్ ఫోన్‌లకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.

రోజుకు 170GB డేటాను బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అందించే ఏకైక టెల్కో BSNL

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 9

కొన్ని ముఖ్యమైన ఒప్పందాల విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్రస్తుతం తన అధికారిక శామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో 29,999 రూపాయలకు లభిస్తున్నది. అదనంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 యొక్క ప్రారంభ ధర రూ. 42,999లకు తగ్గించబడింది. అలాగే శామ్‌సంగ్ ఫ్రేమ్ టీవీ ధరను కూడా ఈ సేల్స్ లో రూ.84,999లకు తగ్గించబడింది. స్మార్ట్ వాచ్ విషయానికొస్తే గెలాక్సీ వాచ్ యొక్క 46mm వేరియంట్ ప్రస్తుతం రూ.23,990ల ధర వద్ద లభిస్తున్నది.

శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్..... ధరకు తగ్గ ఫీచర్స్ !!!!

గెలాక్సీ నోట్ 10

గెలాక్సీ నోట్ 10 మరియు నోట్ 10 ప్లస్ వేరియంట్లకు కూడా ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను శామ్సంగ్ అందిస్తోంది. గెలాక్సీ M-సిరీస్ మరియు గెలాక్సీ A-సిరీస్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో 10 శాతం వరకు ధర తగ్గింపుతో అందిస్తోంది. పైన పేర్కొన్న ఒప్పందాలతో పాటు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్, స్మార్ట్‌వాచ్‌లపై 20 శాతం వరకు డిస్కౌంట్, శామ్‌సంగ్ యొక్క UHD ,HD టివిలపై 49 శాతం వరకు, JBL పై 61 శాతం తగ్గింపును అందిస్తోంది.

క్యాష్‌బ్యాక్‌
 

వార్షికోత్సవ అమ్మకంలో భాగంగా శామ్‌సంగ్ స్టోర్ SBI,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు 1,500 రూపాయలు క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మేక్‌మైట్రిప్ బుకింగ్‌లలో రూ .10 వేల విలువైన ఓయో వోచర్‌లపై 25 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. చివరగా వార్షికోత్సవ అమ్మకంలో భాగంగా శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Anniversary Sale: Offers, Discounts and More Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X