సరసమైన ఆఫర్లతో ఇండియాలో మొదలైన గెలాక్సీ A10s సేల్స్

|

శామ్‌సంగ్ గెలాక్సీ A10s ను మంగళవారం ఇండియాలో లాంచ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. 2019 Q1లో ప్రారంభించిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ శామ్‌సంగ్ గెలాక్సీ A10 యొక్క సింగిల్ కెమెరా సెటప్‌తో పోలిస్తే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తున్న గెలాక్సీ A10s అధిక రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో సహా అనేక మెరుగుదలలతో అందుబాటులోకి వస్తోంది.

Samsung Galaxy A10s with Infinity-V Display Launched in India: Specs, Features and More

ఇది 3,400 mAh తో పోలిస్తే 4,000 mAh అధిక సామర్థ్యం గల బ్యాటరీని కూడా కలిగి ఉంది. భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A10s యొక్క ధర, ఫీచర్స్ మరియు విడుదల తేదీ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A10s యొక్క ధర

శామ్‌సంగ్ గెలాక్సీ A10s యొక్క ధర

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ A10s యొక్క ధర 2 జీబీ ర్యామ్ / 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌కు 9,499 రూపాయలుగా ఉన్నది. అలాగే 3 జీబీ ర్యామ్ / 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ ధర 10,499 రూపాయలుగా నిర్ణయించారు. ఇది బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు.

లభ్యత

లభ్యత

ఆన్‌లైన్ రిటైలర్లు, రిటైల్ దుకాణాలు, శామ్‌సంగ్ ఇండియా ఇ-షాప్ మరియు శామ్‌సంగ్ ఒపెరా హౌస్ ద్వారా గెలాక్సీ A10s లు ఆగస్టు 28 బుధవారం నుంచి భారతదేశంలో విక్రయించబడతాయని శామ్‌సంగ్ తెలిపింది. ప్రస్తుతానికి లాంచ్ ఆఫర్లను కంపెనీ వివరించలేదు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A10s డ్యూయల్ సిమ్ (నానో)లను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై మరియు కంపెనీ స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది 6.2-అంగుళాల HD + (720x1,520 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-వి డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ SoC (2GHz వద్ద క్లాక్ చేయబడిన నాలుగు కోర్లు, మరియు 1.5GHz వద్ద నాలుగు కోర్లు క్లాక్ చేయబడ్డాయి) వేరియంట్‌ను బట్టి 2GB లేదా 3GB RAM తో కలిసి ఉంటుంది.

కెమెరాలు

కెమెరాలు

గెలాక్సీ A10s లు వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో మొదటిది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో f/ 1.8 ఎపర్చరు లెన్స్‌తో వస్తుంది. అలాగే ఈ సెటప్‌లో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ f/1.2 లెన్స్‌తో ఉంటుంది. అలాగే దీనికి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో f / 2.0 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడిన సెల్ఫీ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

గెలాక్సీ A10s స్మార్ట్‌ఫోన్‌లో ఒకే ఒక 32 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 512 జిబి వరకు మెమొరీని విస్తరించవచ్చు. ఇది ప్రామాణిక బంచ్ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది, 4G VoLTE ని కలిగి ఉంది మరియు వెనుక ప్యానెల్‌లో వేలిముద్ర సెన్సార్‌ను కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ A10s 156.9x75.8x7.8 మిమీ కొలతలతో 168 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A10s with Infinity-V Display Launched in India: Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X