Samsung Galaxy A21s కొత్త వేరియంట్ అమ్మకాలు రేపటి నుంచే మొదలుకానున్నాయి!!!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శామ్సంగ్ ఇటీవల శామ్సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ యొక్క కొత్త కాన్ఫిగరేషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ A21s యొక్క కొత్త వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ భారతదేశంలో రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 6.5-అంగుళాల ప్యానెల్ వంటి మరిన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగిన గెలాక్సీ A21s గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ ధరల & లభ్యత వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ ధరల & లభ్యత వివరాలు

ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ను రూ.16,499 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ను రూ.18,499 ధర వద్ద లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.17,499. ఈ కొత్త వేరియంట్ యొక్క అమ్మకాలు అక్టోబర్ 10 నుండి మొదలుకానున్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు శామ్‌సంగ్.కామ్, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్, రిటైల్ దుకాణాలు మరియు శామ్‌సంగ్ ఒపెరా హౌస్ ద్వారా కూడా హ్యాండ్‌సెట్ ను బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A21s ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌

Samsung Galaxy A21s ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 720 X 1,600 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI మరియు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Samsung Galaxy A21s అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెటప్

Samsung Galaxy A21s అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెటప్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను దీర్ఘచతురస్ర కారంలో ఉంటుంది. ఇందులో ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ లోపల 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A21s 6GB RAM, 128GB Storage Model Sales Starts Tomorrow: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X