Samsung Galaxy S23 లాంచ్ తేదీ, ధర & స్పెసిఫికేషన్ల వివరాలు ! 

By Maheswara
|

Samsung 2023 కి సంబంధించిన మొదటి Galaxy Unpacked ఈవెంట్ ఫిబ్రవరి 1న జరుగుతుందని ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ అనుకోకుండా ఈ తేదీని వెల్లడించింది. శామ్సంగ్ ఫిబ్రవరి 1 న జరిగే ఈవెంట్‌లో లాంచ్ చేస్తున్న పరికరాలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ, అనేక లీక్‌లు మరియు గత లాంచ్‌లు ఆధారం గా కొత్త శాంసంగ్ గెలాక్సీ S-సిరీస్ ఫోన్‌ల రాకను సూచిస్తున్నాయి. గెలాక్సీ S23 లైనప్‌ గా పిలువబడే కొత్త సిరీస్‌లో Galaxy S23, Galaxy S23 Plus మరియు Galaxy S23 అల్ట్రా అనే మూడు మోడల్‌లు ఈ ఈవెంట్ లో లాంచ్ కాబోతున్నట్లు అంచనాలున్నాయి.

 
Samsung Galaxy S23 లాంచ్ తేదీ, ధర & స్పెసిఫికేషన్ల వివరాలు ! 

ఫిబ్రవరి 01 న ప్రత్యక్ష ప్రసారం

COVID-19 మహమ్మారి కారణంగా మూడు సంవత్సరాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో తన మొదటి లైవ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు కంపెనీ తన అధికారిక న్యూస్‌రూమ్‌లో ప్రకటించింది. ఈ ఈవెంట్ Samsung.com, Samsung న్యూస్‌రూమ్ మరియు Samsung యొక్క YouTube ఛానెల్‌లో ఫిబ్రవరి 01, 10 AM PST (11:30-PM IST)కి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

లీకైన వివరాలు

గెలాక్సీ S23 సిరీస్ చాలా కాలంగా లీక్‌ల కారణంగా వార్తలలో ఉంది, అందువల్ల ఈ ఫోన్ నుంచి ఎటువంటి ఫీచర్లు ఆశించాలో మాకు కొంత అవగాహన ఉంది. ఈ మూడు మోడల్‌లు కూడా భారతీయ మార్కెట్‌ లో Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్ ని తీసుకువస్తాయి. ఇంతకుముందు, శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్‌ను క్వాల్‌కామ్ లేదా ఇన్-హౌస్ ఎక్సినోస్ చిప్‌సెట్‌తో మార్కెట్ ఆధారంగా ప్రారంభించింది. అయినప్పటికీ, ఎంపిక చేసిన ప్రాంతాలలో Galaxy S23కి శక్తినిచ్చే కొత్త చిప్‌పై కూడా కంపెనీ పనిచేస్తోందని ఈ కొత్త లీక్ లు సూచిస్తున్నాయి.

Samsung Galaxy S23 లాంచ్ తేదీ, ధర & స్పెసిఫికేషన్ల వివరాలు ! 

ఇటీవల, లీకైన సమాచారం ప్రకారం Galaxy S23, Galaxy S23 ప్లస్ మరియు Galaxy S23 అల్ట్రా యొక్క రెండర్‌లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి మరియు మూడు ఫోన్‌లు యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో వెనుక కెమెరాలను శామ్‌సంగ్ ఉంచబోదని దీని అర్థం.

అంచనా స్పెసిఫికేషన్లు

ఈ కొత్త Galaxy S23 స్మార్ట్‌ఫోన్‌లు స్క్రీన్ మరియు బ్యాటరీ పరిమాణాల పరంగా విభిన్నంగా ఉంటాయి. Galaxy S23 అల్ట్రా కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడతాయి. Samsung తన AMOLED E6 డిస్‌ప్లేను రాబోయే ఫోన్‌లలో ఉపయోగించవచ్చు, ఇది ఇటీవల iQOO 11లో కూడా లాంచ్ చేసారు. Galaxy S23 అల్ట్రా మోడల్‌లో 200-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుందని చెప్పబడింది. అన్ని Galaxy S23 ఫోన్‌లు 25W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయని పుకార్లు సూచిస్తున్నాయి. Samsung గతంలో 45W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతును అందిస్తున్నందున ఇది అసంభవంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ Android 13 ఆధారంగా OneUI 5 తో వస్తుందని తెలుస్తోంది.

Samsung Galaxy S23 లాంచ్ తేదీ, ధర & స్పెసిఫికేషన్ల వివరాలు ! 

ధరల వివరాలు

ధరల వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి ఖచ్చితంగా తెలియదు, అయితే కొత్త Samsung Galaxy S23 చౌకగా ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. దీని ధర రూ. 70,000 పైన మొదలవుతుంది మరియు అల్ట్రా మోడల్ ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉండవచ్చు. గత సంవత్సరం, భారతదేశంలో Samsung Galaxy S22 ధర బేస్ మోడల్ కోసం రూ. 72,999గా నిర్ణయించబడింది మరియు Galaxy S22 Plus ప్రారంభ ధర రూ. 84,999తో ప్రారంభించబడింది. అల్ట్రా మోడల్ ధర 12GB + 256GB ఎంపిక కోసం రూ. 1,09,999 గా లాంచ్ చేశారు.

 

ఈ కొత్త Samsung Galaxy S23 సిరీస్ ఫిబ్రవరి మధ్యలో లేదా మార్చి ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ కావొచ్చని అంచనాలున్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy S23 Expected To Launch On February 1 In Galaxy Unpacked 2023 Event. Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X