DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

|

టాటా స్కై చందాదారులు సంతోషంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వినియోగదారులకు అందించబడుతున్న మొత్తం HD ఛానెల్స్. దేశంలోని ఇతర డిటిహెచ్ ఆపరేటర్లతో పోలిస్తే జనవరి 26, 2020 నాటికి టాటా స్కై ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో హెచ్‌డి ఛానెల్‌లకు యాక్సిస్ ను అందిస్తున్నది.

టాటా స్కై

ఇప్పుడు దేశం అంతటా టాటా స్కై, డిష్ టివి (డి 2 హెచ్ తో సహా), ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు సన్ డైరెక్ట్ అనే నాలుగురు పే డిటిహెచ్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం డిష్ టీవీ ఇండియాలో భాగమైన డి 2 హెచ్ తక్కువ సంఖ్యలో హెచ్‌డి ఛానెల్‌లను ఆఫర్‌లలో అందిస్తున్నది. టాటా స్కై వినియోగదారులు ప్రస్తుతం మొత్తంగా 91 హెచ్‌డి ఛానెల్‌లను ఆస్వాదించగలుగుతున్నారు. ఈ జాబితాలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ రెండవ స్థానంలో ఉంది.

 

 

RS.1,188 మారుతం ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును తగ్గించిన BSNLRS.1,188 మారుతం ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును తగ్గించిన BSNL

టాటా స్కై చందాదారులకు ఎక్కువ సంఖ్యలో HD ఛానెల్‌లకు యాక్సిస్
 

టాటా స్కై చందాదారులకు ఎక్కువ సంఖ్యలో HD ఛానెల్‌లకు యాక్సిస్

భారతదేశంలో ప్రీమియం డిటిహెచ్ ఆపరేటర్లలో టాటా స్కై ఒకటి. DTH అన్ని కంపెనీలు ఎల్లప్పుడూ వినియోగదారులకు ప్రీమియం సేవలను అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఆఫర్‌లలో భాగంగా వివిధ రకాల సెట్-టాప్ బాక్స్‌లు , వారంటీ సర్వీస్ మరియు ఆఫర్‌లలో వివిధ రకాల ఛానల్ ప్యాక్‌లు వంటి అంశాలు చూడవచ్చు. హెచ్‌డి ఛానెల్‌ల విషయానికొస్తే టాటా స్కైలో ప్రస్తుతం మొత్తంగా 91 ఛానెల్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ప్రస్తుతం మొత్తం 86 హెచ్‌డి ఛానెళ్లను వినియోగదారులకు అందిస్తోంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

SD మరియు HD ఛానెళ్లు

SD మరియు HD ఛానెళ్లు

టాటా స్కై నెట్‌వర్క్‌లో మొత్తం SD మరియు HD ఛానెళ్లు అన్ని కలిపి మొత్తంగా 589 ఛానెళ్లను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన నెట్‌వర్క్‌లో మొత్తంగా 626 ఛానెళ్లను కలిగి ఉంది. మొత్తం ఎస్‌డి + హెచ్‌డి ఛానల్ లెక్కింపు విషయానికి వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి చార్టులో ముందుంది. DTH ఆపరేటర్ అందించే వివిధ ప్రత్యేకమైన ఛానెల్‌లలో టాటా స్కైకి కూడా కొన్ని ప్రత్యేకమైన ఛానెల్‌లకు యాక్సిస్ ను కలిగి ఉన్నాయి.

 

 

నోకియా 6.2 & నోకియా 7.2 ఫోన్‌ల ధర మీద రూ.3,000 వరకు భారీ తగ్గింపునోకియా 6.2 & నోకియా 7.2 ఫోన్‌ల ధర మీద రూ.3,000 వరకు భారీ తగ్గింపు

D2h HD ఛానెల్‌ల సంఖ్య 64

D2h HD ఛానెల్‌ల సంఖ్య 64

D2h నెట్‌వర్క్‌ ప్రస్తుతం అతి తక్కువగా 64 హెచ్‌డి ఛానెల్‌లను మాత్రమే కలిగి ఉంది. ప్రముఖ డిష్ టివి కూడా ప్రస్తుతం మొత్తంగా 70 హెచ్‌డి ఛానెల్‌లను వినియోగదారులకు అందిస్తోంది. ఇక సన్ డైరెక్ట్ విషయానికొస్తే హెచ్‌డి ఛానల్ సంఖ్య 75గా ఉంది. డిటిహెచ్ ఆపరేటర్లు టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, డిష్ టివి, సన్ డైరెక్ట్ మరియు డి 2 హెచ్ అందించే హెచ్‌డి ఛానెళ్ల ధర విషయానికి వస్తే ఈ జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

 

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను మళ్ళి తగ్గించిన టాటా స్కైసెట్-టాప్ బాక్స్‌ల ధరలను మళ్ళి తగ్గించిన టాటా స్కై

DTH HD సెట్-టాప్ బాక్స్‌ కనెక్షన్‌ ధర

DTH HD సెట్-టాప్ బాక్స్‌ కనెక్షన్‌ ధర

మీరు ఎక్కువ మొత్తంలో HD ఛానెల్‌లను చూస్తుంటే కనుక DTH కనెక్షన్‌గా టాటా స్కైని ఎంచుకోవడం చాలా ఉత్తమం. టాటా స్కై ప్రస్తుతం దాని HD సెట్-టాప్ బాక్స్‌లో పరిమిత కాల ఆఫర్‌ను అందిస్తున్నది. ఇందులో భాగంగా కొత్త వినియోగదారులు కొత్త HD STB ని కేవలం 1,399 రూపాయలకు పొందవచ్చు. సాధారణంగా టాటా స్కై హెచ్‌డి ఎస్‌టిబి ధర రూ.1,499 గా ఉంది. అయితే ఇప్పుడు ఆఫర్లలో భాగంగా తగ్గించబడింది. మీరు మరిన్ని ఆపరేటర్ ఎక్స్‌క్లూజివ్ ఛానెల్‌ల కోసం చూస్తున్నట్లయితే మీరు ఎయిర్‌టెల్ డిటిహెచ్ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చు. డిష్ టీవీ, డి 2 హెచ్ మరియు సన్ డైరెక్ట్ ప్రత్యేకమైన ఛానెల్‌లను అందించడం లేదు కానీ వాటికి కొంత ఆఫర్ కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Tata Sky Provides Most Number of HD Channels For DTH Subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X