మళ్లీ తగ్గిన టాటా స్కై ఎస్‌టిబి ధరలు

|

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త టారిఫ్ పాలనను ప్రవేశపెట్టిన తరువాత డిటిహెచ్ మరియు ప్రసార పరిశ్రమ చాలా మార్పులకు గురైంది. ఏదేమైనప్పటికీ ఇది DTH సర్వీసు ప్రొవైడర్ల మధ్య అపూర్వమైన గట్టి పోటీకి దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ వారు ఎక్కువ మంది చందాదారుల కోసం పోరాడుతున్నారు.

 
tata sky stb price again

మరియు ఇప్పటికే ఉన్న చందాదారులను కోల్పోకుండా ఉండడానికి చాలా ప్రయత్యానాలు చేస్తున్నారు.దీని కోసం డిటిహెచ్ కంపెనీలు ఉచిత చందా కాలాలు, వివిధ ఆఫర్లు మరియు ఫ్రీబీలను అందించే దీర్ఘకాలిక ఆఫర్లను ప్రవేశపెట్టాయి.అంతే కాకుండా కొంత మంది వారి సెట్-టాప్ బాక్సుల ధరలను కూడా తగ్గించాయి.

tata sky stb price again

ఈ లీగ్‌లో టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ రెండు డిటిహెచ్ ప్రొవైడర్లు నువ్వా నేనా అని ఉన్నారు.ఇందులో మరింత పోటీతత్వాన్ని పొందడానికి టాటా స్కై తన సెట్-టాప్ బాక్సుల ధరలను మళ్లీ తగ్గించింది. కాబట్టి ఇప్పుడు టాటా స్కై కనెక్షన్ కోసం వినియోగదారులు మరింత ప్రోత్సాహం చూపవచ్చు. ఈ కొత్త ధరల తగ్గింపు గురించి మరిన్ని వివరాలను క్రింద తెలుసుకోండి.

 టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లపై  రెండవ ధర తగ్గింపు :

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లపై రెండవ ధర తగ్గింపు :

గతంలో టాటా స్కై DTH సర్వీస్ ప్రొవైడర్ అందిస్తున్న రెండు HD మరియు SD వేరియంట్ల సెట్-టాప్ బాక్సులపై ధరల తగ్గింపును ప్రవేశపెట్టారు. ఈ ధరల తగ్గింపు టాటా స్కై ఎస్‌టిబిల రెండు మోడళ్ల మీద రూ.400లు తగ్గించింది. దీని అర్థం టాటా స్కై ఎస్‌టిబి యొక్క SD వేరియంట్ 1,600 రూపాయలు మరియు టాటా స్కై ఎస్‌టిబి HD వేరియంట్ 1,800 రూపాయలకు లభిస్తుంది. అయితే దాని సెట్-టాప్ బాక్స్ ధరపై రెండవ సారి ధర తగ్గింపు పొందడంతో టాటా స్కై కనెక్షన్ చందాదారులకు సెట్-టాప్ బాక్స్‌లు మరింత ఆకర్షణీయంగా మారింది.

కొత్త ధరలు:

కొత్త ధరలు:

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లపై రెండవ సారి ధర తగ్గింపు పొందడంతో SD సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,399 కు తగ్గించగా HD సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,499 కు పడిపోయింది. అంటే టాటా స్కై తన SD STB ధరలను మరో రూ .200 తగ్గించింది మరియు టాటా స్కై యొక్క HD సెట్-టాప్ బాక్స్ ధరను సుమారు 300రూపాయలకు తగ్గించింది.

టాటా స్కై ఇతర డిటిహెచ్ ఆపరేటర్లపై పోటీ:
 

టాటా స్కై ఇతర డిటిహెచ్ ఆపరేటర్లపై పోటీ:

గత కొన్ని రోజులుగా టాటా స్కై కనెక్షన్ కొత్త చందాదారులకు కొంచెం తక్కువ ఆకర్షణీయంగా మారింది. ఎందుకంటే డిటిహెచ్ ప్రొవైడర్ తన వినియోగదారుల కోసం మల్టీ-టివి పాలసీని తొలగించింది. అందువల్ల రెండవ కనెక్షన్ కోసం పూర్తిగా ధర మొత్తం చెల్లించమని కంపెనీ వారు బలవంతం చేశారు. అలాగే టాటా స్కై యొక్క సెట్-టాప్ బాక్స్ ధరలు డిష్ టివి వంటి ఇతర ప్రొవైడర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల టాటా స్కై పోటీలో వెనుకనే మిగిలిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టాటా స్కై తన ఎస్‌టిబిల ధరలను మళ్లీ తగ్గించి కొత్త వినియోగదారుల కోసం దాని సభ్యత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

డిష్ టివి ధరలు:

డిష్ టివి ధరలు:

డిష్ టివి తన DishNXT HD సెట్-టాప్ బాక్స్ వేరియంట్ 1,590 రూపాయల ధరతో మరియు దాని SD వేరియంట్ DishNXT SD సెట్-టాప్ బాక్స్ 1,490 రూపాయలకు అందిస్తుండటం కూడా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఈ కొత్త ధరల తగ్గింపుతో టాటా స్కై ఎస్‌టిబిలు అధికారికంగా డిష్ టివి ఎస్‌టిబిల కంటే చౌకగా మారాయి. ఇది నిన్నటి వరకు లేదు. టాటా స్కై ద్వారా చందాదారులకు డిష్ టివి మరింత ఆకర్షణీయమైన ఎంపికగా భావించడానికి ఈ ధర వ్యత్యాసం ఒకటి. అయితే కొత్త ధరల తగ్గింపు టాటా స్కైకి అనుకూలంగా ఎంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
tata sky stb price again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X