టాటా స్కై & ఎయిర్టెల్ డిజిటల్ టీవీ: HD STB కోసం ఏది మెరుగ్గా ఉంది??

|

దేశంలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) రంగంలో అగ్రశ్రేణి ఆపరేటర్లయిన టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి రెండూ కూడా తన యొక్క వినియోగదారులకు ఖచ్చితమైన ఎంట్రీ లెవల్ HD సెట్-టాప్ బాక్స్ (STB) ను అందిస్తాయి. ఇది వారికి ఇష్టమైన ప్రోగ్రామ్‌లను అధిక నాణ్యతతో చూడటానికి అనుమతిస్తుంది. ఏదేమైనా STBని కొత్తగా కొనుగోలుచేయాలని చూసే వారు ఏ కంపెనీ నుండి హెచ్‌డి ఎస్‌టిబిని కొనుగోలు చేయాలో అని కొంచెం గందరగోళంగా ఉంటుంది. HD STB ని ఎంచుకునేటప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. వాటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై తన వెబ్‌సైట్ ద్వారా రూ.1,499 ధర వద్ద హెచ్‌డి ఎస్‌టిబిని అందిస్తుంది. కానీ STB యొక్క అసలు ధర రూ.1,599. ప్రస్తుతం కంపెనీ దీని కొనుగోలు మీద రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఇదే కాకుండా వినియోగదారులు టాటా స్కై HD STB ని కంపెనీ నుండి కొనుగోలు చేస్తే వారు కొనుగోలు చేసిన తరువాత అదనంగా రూ.150 తగ్గింపు పొందవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ లో 'TSKY150' ప్రోమో కోడ్ ను ఉపయోగించవలసి ఉంటుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ HD STB యొక్క ధరల విషయానికి వస్తే దీని ధర రూ.1,300. అంటే టాటా స్కై బాక్స్ కంటే రూ.200 తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు సంస్థ యొక్క వెబ్‌సైట్ నుండి నేరుగా కొనుగోలు చేస్తే కనుక STB పై 10% తగ్గింపు పొందడానికి ప్రోమో కోడ్ 'ADTV10' ను కూడా ఉపయోగించవచ్చు.

టాటా స్కై HD STB ఫీచర్స్
 

టాటా స్కై HD STB ఫీచర్స్

టాటా స్కై HD STB అనేక ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ STB 3D కి అనుకూలమైనదిగా, PCM సౌండ్‌ మద్దతుతో సినిమాలను ప్రదర్శిస్తుంది. అలాగే పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్ మరియు ఆటో స్టాండ్‌బై మోడ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు సంస్థ నుండి 24 * 7 కస్టమర్ మద్దతును మరియు 1 సంవత్సరపు వార్షిక సర్వీస్ నిబద్ధతను కూడా పొందుతారు. అలాగే మీరు ఏదైనా క్రొత్త ప్రదేశానికి మారుతుంటే కనుక టాటా స్కై మీ కోసం కనెక్షన్‌ను అక్కడికి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు వినియోగదారులు ఇతర టాటా స్కై సేవలకు మద్దతు పొందుతారు.

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి HD STB ఫీచర్స్

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి HD STB ఫీచర్స్

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి HD STB యూజర్లు కూడా సంస్థ నుండి గొప్ప కస్టమర్ మద్దతును పొందుతారు. HD STB అనేది వినియోగదారులను ప్రీమియం నాణ్యతతో చూడటానికి అనుమతించడమే కాకుండా STB డాల్బీ డిజిటల్ సౌండ్‌కు మద్దతుతో వస్తుంది. వినియోగదారులు తమ అభిమాన టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలను తరువాత తేదీలో చూడడానికి వీలుగా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ HD STB తో రికార్డ్ చేయవచ్చు మరియు వాటిని ప్లే చేయవచ్చు. మీరు వేరే ప్రదేశానికి / ఇంటికి మారుతున్నట్లయితే కనెక్షన్ యొక్క పునస్థాపనకు ఎయిర్టెల్ మీకు సహాయం చేస్తుంది.

టాటా స్కై మరియు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సంస్థలు అందించే HD STB లలో ఏది మెరుగ్గా ఉందొ చూడడానికి రెండు కంపెనీలు అందించే ఛానల్ ప్యాక్‌ల ధరలను చూడటం ముఖ్యం. అయినప్పటికీ ప్రతి ఒక్కరి ఛానెల్ ప్యాక్‌ల అవసరాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇది మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య ధర వ్యత్యాసం చాలా సహేతుకమైనది. రెండు కంపెనీలు అద్భుతమైన సేవలను అందిస్తాయని తెలుసుకోవడం ముఖ్యం.

Best Mobiles in India

English summary
Tata Sky vs Airtel Digital TV: Which One Offers Better HD STB?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X