400 కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తున్న టాటా స్కై వెబ్ వెర్షన్

|

టాటా స్కై సెల్ఫ్ -కేర్ యాప్ చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి టాటా స్కై చందాదారులు ఈ యాప్ ను ఉపయోగించి ఛానెల్ ప్యాక్‌లను సర్దుబాటు చేయడానికి, ప్రొఫైల్ యొక్క సెట్టింగ్‌లను మార్చడానికి లేదా లైవ్ టీవీని చూడటానికి దీనిని ఉపయోగిస్తున్నారు. టాటా స్కై సెల్ఫ్ -కేర్ యాప్ అందించే ఉత్తమ లక్షణాలలో ఒకటి చందాదారులను యాప్ లోనే లైవ్ టీవీని చూడటానికి అనుమతించడం.

tatasky watch service details

ఒకవేళ చందాదారులు తమ ఫోన్‌ను మాత్రమే కలిగి ఉండి వారు టీవీలో షో లేదా ఏదైనా ప్రోగ్రామ్ ను యాక్సెస్ చేయలేనప్పుడు చందాదారులు తమ ఫోన్‌లోనే ప్రోగ్రామ్ చూసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ టాటా స్కై యొక్క చందాదారులు చాలా మంది ఈ షోలను మరియు టాటా స్కై యాప్ యొక్క అన్ని లక్షణాలను వారి ల్యాప్‌టాప్ లేదా pcలో కూడా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు.

tatasky watch service details

ఇందుకోసం టాటా స్కై దాని వెబ్ వెర్షన్ రూపంలో ఒక పరిష్కారం అందిస్తోంది. టాటా స్కై వెబ్ వెర్షన్ గురించి మరింత తెలుసుకోవడానికి కింద చదవండి.

టాటా స్కై వెబ్ వెర్షన్: యాక్సెస్ మరియు లాగిన్ ఎలా?

టాటా స్కై వెబ్ వెర్షన్: యాక్సెస్ మరియు లాగిన్ ఎలా?

టాటా స్కై వెబ్ వెర్షన్ అనేది టాటా స్కై చందాదారులకు తమ ల్యాప్‌టాప్ లేదా పిసిలో టాటా స్కై ద్వారా లైవ్ టివి సర్వీస్ ను యాక్సెస్ చేయాలనుకునే వారికి అనుకూలమైన మరియు గొప్ప పరిష్కారం. టాటా స్కై మొబైల్ యాప్ కారణంగా టాటా స్కై అందిస్తున్న లైవ్ టీవీ ఛానెల్‌లను స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా యాక్సెస్ చేయగలిగినప్పటికీ టీవీకి యాక్సిస్ లేకపోతే కాస్త పెద్ద స్క్రీన్ పై షోలను చూడాలనుకునే వినియోగదారులు టాటా స్కై వెబ్ వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. అలా చేయడానికి చందాదారులు మొదటగా టాటా స్కై వెబ్ వెర్షన్‌ను ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వాలి .

లాగిన్ ఎలా?

లాగిన్ ఎలా?

ఓపెన్ చేసిన తరువాత ఇక్కడ వెబ్‌సైట్ హోమ్, లైవ్ టివి, ఆన్ డిమాండ్, వాచ్‌లిస్ట్ మరియు మై బాక్స్ వంటి కొన్ని వేరు వేరు విభాగాలుగా విభజించబడిన కొన్నిటిని వినియోగదారులు చూడవచ్చు. ఇప్పుడు వెబ్‌సైట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవటానికి టాటా స్కై యొక్క చందాదారులు వెబ్ వెర్షన్‌కు లాగిన్ అవ్వాలి. లాగిన్ బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారులు OTP లేదా టాటా స్కై లాగిన్ పాస్‌వర్డ్‌తో కలిపి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.

టాటా స్కై వెబ్ వెర్షన్ యొక్క మరిన్ని ఫీచర్లు:

టాటా స్కై వెబ్ వెర్షన్ యొక్క మరిన్ని ఫీచర్లు:

టాటా స్కై హోమ్ విభాగంలో లైవ్ స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ టివి షోస్, లైవ్ టివి షోస్, పిక్ ఆఫ్ ది వీక్ మరియు వీటితో పాటు మరిన్ని షోస్ లకు సంబంధించిన సిఫార్సులు చందాదారులకు లభిస్తాయి. చందాదారులు ఈ విభాగంలో టాటా స్కై సేవలను కూడా యాక్సెస్ చేయగలరు. రెండవ విభాగంలో వినియోగదారులు తమ ఇష్టానుసారంగా కనుగొనే లైవ్ టివి విభాగం కూడా ఉంది. ఇక్కడ చందాదారులు రియల్-టైం ఛానెల్‌లను యాక్సెస్ చేసి తమ అభిమాన షోలు మరియు మూవీస్లను చూడవచ్చు . ఈ విభాగాన్ని జెనరష్ ద్వారా కూడా నావిగేట్ చేయవచ్చు కాబట్టి వినియోగదారులు వారు చూడాలనుకుంటున్నదాన్ని చూడటం సౌకర్యంగా ఉంటుంది. దీనికి తోడు ఈ సర్వీస్ వినియోగదారులకు ఆన్-డిమాండ్ కంటెంట్ మరియు వాచ్‌లిస్ట్ వంటి ఫీచర్స్ కు యాక్సిస్ ఇస్తుంది.

వెబ్ వెర్షన్ యొక్క ఉత్తమ లక్షణాలలో ఒకటి చందాదారులను మైబాక్స్ విభాగానికి యాక్సిస్ ను అనుమతించడం. ఇక్కడ చందాదారులు ఛానెల్‌ల మొత్తం షెడ్యూల్‌ను చూడగలుగుతారు. ఇది ఒక నిర్దిష్ట ఛానెల్‌లో నడుస్తున్న మరియు రాబోయే ప్రోగ్రామ్ వివరాలు చూడవచ్చు.

 

Best Mobiles in India

English summary
tatasky watch service details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X