టెక్నో ఫాంటమ్ 9 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ & ధర చూస్తే ఆశ్చర్యపోతారు

|

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌లలో మిడ్-రేంజ్ విభాగంలో తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ మిడ్-రేంజ్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చూసి చాలా రోజులు అవుతోంది. తక్కువ-శ్రేణి స్మార్ట్‌ఫోన్ విభాగంలో చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పటికే పోటీ పడుతున్నాయి. అయితే చివరకు చాలా కాలం తరువాత కొంతకాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఫోన్‌ను ప్రారంభిస్తున్నారు.ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో ఫాంటమ్ 9.

tecno phantom 9 india

ఇప్పటికే టెక్నో తన కామన్ సిరీస్‌తో కొన్ని తక్కువ-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ టెక్నో ఫాంటమ్ 9 ను ఇండియాలో ప్రారంభించడంతో టెక్నో కంపెనీ కూడా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరింది. ఇండియాలో జరిగిన దాని గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ కార్యక్రమంలో టెక్నో ఈ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని గురించి మీరు తెలుసుకోవలసిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చదవండి.

డిజైన్ మరియు డిస్ప్లే:

డిజైన్ మరియు డిస్ప్లే:

డిజైన్ విషయానికి వస్తే టెక్నో ఫాంటమ్ 9 ఖచ్చితంగా అధునాతనమైన టెక్నాలిజీని ఉపయోగించి తయారుచేసారు.ఈ ఫోన్ లాప్లాండ్ అరోరా కలర్లో వెనుక భాగంలో వక్ర ప్రవణత ప్యానెల్ను కలిగి ఉంది. వెనుక వైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను AI చేర్పులతో చూడవచ్చు . డిస్ప్లే విషయానికొస్తే టెక్నో ఫాంటమ్ 9 స్మార్ట్‌ఫోన్‌ 6.4-అంగుళాల ఫుల్ HD + రిజల్యూషన్ AMOLED స్క్రీన్‌ను టియర్‌డ్రాప్ ను కలిగి ఉంది. డిస్ప్లే 2340 x 1080 యొక్క రిజల్యూషన్‌తో వస్తుంది మరియు టెక్నో ఫాంటమ్ 9 డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్ మరియు బ్యాటరీ పనితీరు:

సాఫ్ట్‌వేర్ మరియు బ్యాటరీ పనితీరు:

పనితీరు విషయానికి వస్తే టెక్నో ఫాంటమ్ 9 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoC ను 2.35 GHz వద్ద క్లాక్ చేయబడి ఉంది. ఈ ప్రాసెసర్‌ను 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్‌తో కలపబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. సెన్సార్ల విషయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ జి-సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్లు కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ కోసం జిపిఎస్, వై-ఫై, బ్లూటూత్ మరియు OTG ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయంలో ఈ డివైస్ Hi OS 5 ను బూట్ చేస్తుంది. ఇది వాట్సాప్ వీడియో కాల్స్ కోసం AI బ్యూటీ ఫీచర్ మరియు 4G వీడియో కాల్, స్మార్ట్ ప్యానెల్, AI రీడ్ మోడ్ వంటి లక్షణాలతో వస్తుంది.

కెమెరా:

కెమెరా:

కెమెరా విభాగంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ AI- సహాయంతో 16MP f / 1.85 ప్రాధమిక సెన్సార్‌, 120-డిగ్రీల వైడ్ యాంగిల్ షాట్‌ల కోసం 8MP f / 2.4 సెకండరీ సెన్సార్‌తో జత చేయబడి ఉంటుంది దీనితో పాటు మరొక 2MP డీప్ సెన్సార్‌ గల కెమెరాను కలిగి ఉంటుంది. టెక్నో ఫాంటమ్ 9 లోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో క్వాడ్-ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఫోన్ 32MP సెల్ఫీ స్నాపర్‌ను కలిగి ఉంది. దీనితో పాటు డ్యూయల్ ఫ్లాష్ కూడా వస్తుంది. కెమెరా AI సీన్ రికగ్నిషన్ 2.0, AI బ్యూటీ, AI HDR మోడ్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.

ధర మరియు లభ్యత:

ధర మరియు లభ్యత:

టెక్నో ఫాంటమ్ 9 భారతదేశంలో ట్రిపుల్ కెమెరాతో వస్తున్నది.దీని యొక్క ధర 14,999రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుదారులు 100 రోజుల ఉచిత రీప్లేసెమెంట్ , ఒక సారి స్క్రీన్ రీప్లేసెమెంట్, 12 నెలల స్టాండర్డ్ వారంటీపై ఒక నెల పొడిగించిన వారంటీ వంటి లక్షణాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ జూలై 17 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
tecno phantom 9 india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X