జియో ఉచితానికి ఇకపై ముగింపు ! టెల్కోలకు ఊపిరి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్‌ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే.

By Hazarath
|

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్‌ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే. ధరల యుద్ధంతో టెలికాం దిగ్గజాలను ఇది అతలాకుతలం చేసింది. ఇక ఈ వార్‌కు తెరపడబోతుందట.

గెలాక్సీ ఎస్7,ఎస్7 ఎడ్జ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్గెలాక్సీ ఎస్7,ఎస్7 ఎడ్జ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

తుది దశల్లోకి

తుది దశల్లోకి

రిలయన్స్‌ జియో తెరతీసిన ధరల యుద్ధం తుది దశల్లోకి చేరుకుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.

మార్జిన్లను ఆర్జించడంపైనే

మార్జిన్లను ఆర్జించడంపైనే

వచ్చే 12-18 నెలలో జియో పోటీ వ్యూహాన్ని మార్చి వేస్తుందని, ఇక రెవెన్యూలు, మార్జిన్లను ఆర్జించడంపైనే జియో ఫోకస్‌ చేస్తుందని, దీంతో ముఖేష్‌ అంబానీ ఉచితాలకు ఇక ముగింపుకు వస్తుందని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ అంచనావేస్తోంది.

జియో జీవితకాలం కొనసాగించలేదని

జియో జీవితకాలం కొనసాగించలేదని

భారీ డిస్కౌంట్స్‌, ఉచిత ఆఫర్లను జియో జీవితకాలం కొనసాగించలేదని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ క్రెడిట్‌ అనాలిస్ట్‌ అశుతోష్‌ శర్మ చెప్పారు.

నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని

నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని

జియో తెరతీసిన ఈ గేమ్‌లో పాల్గొన్న పోటీదారులందరూ రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.

జియో దెబ్బకు

జియో దెబ్బకు

జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలు కూడా ఉచిత వాయిస్‌ కాల్స్‌, తక్కువ డేటా ఆఫర్లను తీసుకొచ్చాయి.

వారి మార్కెట్‌ స్థానాన్ని కాపాడుకోవడానికి

వారి మార్కెట్‌ స్థానాన్ని కాపాడుకోవడానికి

రెవెన్యూలు, లాభాలు తక్కువ ఉన్నప్పటికీ, వారి మార్కెట్‌ స్థానాన్ని కాపాడుకోవడానికి అన్ని కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో కన్సాలిడేషన్‌ ఏర్పడింది.

టెలినార్‌ను ఎయిర్‌టెల్‌

టెలినార్‌ను ఎయిర్‌టెల్‌

వొడాఫోన్‌ ఇండియా, ఐడియాలు విలీనం ప్రక్రియలో ఉండగా.. టెలినార్‌ను ఎయిర్‌టెల్‌ సొంతం చేసుకుంది. ఇక ఆర్‌కామ్‌, ఎంటీఎస్‌, ఎయిర్‌సెల్‌లు కూడా ఇలానే ఉన్నాయి.

 కేవలం మూడు సంస్థలే

కేవలం మూడు సంస్థలే

ఈ కన్సాలిడేట్‌లో కేవలం మూడు సంస్థలే అంటే వొడాఫోన్‌-ఐడియా విలీన సంస్థ, ఎయిర్‌టెల్‌, జియోలే 75-85 శాతం ఇండస్ట్రీ రెవెన్యూలను సొంతం చేసుకోనున్నాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనావేస్తోంది.

Best Mobiles in India

English summary
Telecom price war started by Jio is in final stages, will end soon: S&P Read more at ggizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X