మొబైల్ యూజర్ల కోసం బెస్ట్ టెలికం స్మార్ట్‌ఫోన్ యాప్ ఇదే !

|

దైనందిన జీవితంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి ఓ భాగమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఓ సంధర్బంలో కొనుగోళ్లు జరుపుతుంటారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో అందరూ ఎక్కువగా ఆన్ లైన్ లావాదేవీలనే నడుపుతుంటారు. షాపింగ్, మూవీ టికెట్స్, కరెంట్ బిల్ ఇలా ప్రతీది డిజిటల్ ద్వారానే జరుపుతుంటారు. మీరు ఎక్కడో వేరే పనిలో ఉన్నా కాని వాటి కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ మొబలై నుంచి వెంటనే ఈ లావాదేవీలను జరుపుకోవచ్చు. రోజుక రోజుకు స్మార్ట్ ఫోన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ లావాదేవీలు కూడా అంతే వేగంతో ముందుకు వెళుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ నుంచి దూసుకొచ్చిన My Airtel App మీకు మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు అన్ని రకాల పేమెంట్లను ఏకకాలంలో చేయవచ్చు. ఈ యాప్ నుంచి మీరు ఏమేమి పనులు చేయవచ్చనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

టెక్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదగాలనుకునేవారికి 6 విజయ రహస్యాలుటెక్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదగాలనుకునేవారికి 6 విజయ రహస్యాలు

  Hub for your Prepaid and Postpaid services

Hub for your Prepaid and Postpaid services

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా మీరు పోస్ట్ పెయిడ్ ప్రీ పెయిడ్ లాంటి లావాదేవీలను జరుపుకోవచ్చు.ఈ యాప్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఈ సౌకర్యాన్ని పొందుతారు. మీరు మీ సమయాన్ని వృధాచేసుకోకుండా ఈ యాప్ ద్వారా మీరు ఏం పేమెంట్లు చేయాలనుకుంటున్నారో అవి ఈజీగా చేసేయవచ్చు. అంతే కాకుండా మీరు ఎయిర్ టెల్ లో ఇప్పుడు ఏం ప్లాన్లు ఉన్నాయి. వాటి టారిఫ్ వివరాలు, బెప్ట్ డేటా ప్లాన్లు, టాప్ అప్స్, ఇంటర్నెట్ ప్యాక్స్ లాంటివన్నీ మీకు ఈ యాప్ ద్వారా లభిస్తాయి.

 DTH and Data Card services

DTH and Data Card services

ఈ యాప్ ద్వారా డీటీహెచ్ కు సంబంధించిన డేటా కార్డు సర్వీసులను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ డీటీహెచ్ ప్లాన్లను చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారానే దానికి సంబంధించిన పేమెంట్లు జరుపుకోవచ్చు. అంతే కాకుండా ఏమైనా ఎక్స్క్లూజివ్ వివరాలు ఉంటే అవి మీకు ఈ యాప్ లో కనిపిస్తాయి. ఆఫర్లతో కూడిన వివరాలు లభిస్తాయి. అంతేకాదు, ‘ఎయిర్‌టెల్ సర్‌ప్రైజెస్' వివిధ క్యాటగిరీలకు సంబంధించి ధర డిస్కౌంట్‌లతో కూడిన కూపన్లతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్‌ను ఎయిర్‌టెల్ ఈ యాప్ ద్వారా తమ వినియోగదారులకు అందిస్తుంది.

Entertainment on-the-go
 

Entertainment on-the-go

ఈ యాప్ మీకు కావాల్సిన వినోదాన్ని కూడా అందిస్తోంది. కాగా ఇది Airtel టీవీ సపోర్ట్ తో రావడం వల్ల మీరు అన్ని రకాల కార్యక్రమాలను దీని ద్వారా వీక్షించే అవకాశం ఉంది. సినిమాలు, టీవీషోలు, అలాగే లైవ్ టీవీ నేరుగా మీ మొబైల్ నుంచే వీక్షించవచ్చు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ యాప్ ద్వారా మీకు ఎటువంటి అదనపు కాస్ట్ లేకుండా అమెజాన్ ప్రైమమ మెంబర్ షిప్ ఏడాది పాటు లభిస్తుంది.

 DSL and Broadband services

DSL and Broadband services

ఈ యాప్ ద్వారా మీరు మీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను పొందవచ్చు. మీ బ్రాడ్ బాండ్ సేవలను ఈ యాప్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు. పేమెంట్స్ అలాగే టారిప్ ప్లాన్లు హిస్టరీ స్టేటస్, లాంటి ప్రయోజనాలన్నీ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్ ద్వారా మీరు డేటాకి ఎంత ఖర్చు అయిందనే వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మైఎయిర్‌టెల్ యాప్‌లోని, ‘ఐ వాంట్ టు' (I Want To) ఫీచర్ ద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు తమ అప్లికేషన్ హోమ్ స్ర్కీన్ పై తరచూ తాము చేసే పనులను సెట్ చేసుకోవచ్చు. తమ బిల్ పేమెంట్లకు సంబంధించి షార్ట్‌కట్‌లను సృష్టించుకోవచ్చు. రీచార్జ్, బుయ్ ప్యాక్స్, రికార్డ్ ఏ ప్రోగ్రామ్, ఆర్డర్ గేమ్స్, వ్యూ బ్యాలన్స్, డేటా వినియోగం, చెక్ రిచార్జ్ హిస్టరీ వంటి కార్యకలాపాలను ఈ ట్యాబ్ ద్వారా నిర్వహించుకోవచ్చు. .

Track your Transactions

Track your Transactions

దీని ద్వారా మీ డిజిటల్ ట్రాన్సిక్షన్స్ వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో Transaction History ఆప్సన్ ఉంటుంది. దీని ద్వారా మీరు డేటా టైం పిరియడ్ వివరాలను తెలుసుకోవచ్చు. అన్ని Transaction వివరాలుమీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు కూడా..

 Turn your phone into a bank

Turn your phone into a bank

ఈ యాప్ మీ దగ్గర ఉంటే బ్యాంక్ మీ దగ్గర ఉన్నట్లే. మైఎయిర్‌టెల్ యాప్ 100 % సురక్షితం. మీ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలను ఈ యాప్ భద్రంగా ఉంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా సురక్షితమైన ఇంకా వేగవంతమైన పనితీరును ఆస్వాదించవచ్చు.తమ ఫోన్‌లలోని మైఎయిర్‌టెల్ అప్లికేషన్ విండోను షేక్ చేయటం ద్వారా యూజర్లు తన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌కు సంబంధించి బెస్ట్ రీచార్జ్ డీల్స్‌ను తెలుసుకోగలుగుతారు.

Best Mobiles in India

English summary
The best telecom mobile app: Right here, right now More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X