ఫ్లిప్‌కార్ట్ ఈ రోజు స్పెషల్ డీల్స్

Written By:

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ మరో స్పెషల్‌ను అనౌన్స్ చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభంకాబోతోన్న ఈ ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 24తో ముగుస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు ఇంకా ఇతరత్రా ఉపకరణాల పై భారీ డిస్కౌంట్‌లను అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ డీల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఈ మిస్టేక్స్ మీ ఆఫీస్ కంప్యూటర్‌లో చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ గోల్డ్, జెట్ బ్లాక్, సిల్వర్, రోజ్ గోల్డ్, బ్లాక్ కలర్ వేరియంట్ రూ. 65,599 వద్దకు వచ్చింది. యూజర్లు ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. 20 శాతం ఆఫ్ ఇస్తోంది. సిల్వర్ కలర్ ఐఫోన్ 7 ప్లస్ మాత్రం రూ. 76,000గా ఉంది.

ఆపిల్ ఐఫోన్ 7

ఆపిల్ ఐఫోన్ 7 గోల్డ్, బ్లాక్, సిల్వర్, రోజ్ గోల్డ్ వేరింయట్ను రూ. 47,999కే కొనుగోలు చేయవచ్చు. 20 శాతం ఆఫ్ ఇస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. సిల్వర్ కలర్ ఐఫోన్ 7 మాత్రం రూ. 54,840గా ఉంది.

ఐఫోన్ 6ఎస్

ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధరపై కూడా రూ.7000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇదే మొత్తంలో ఉంటుందని తెలిపింది. ఐఫోన్ 6 16జీబీ వేరియంట్ ధరను రూ.10,500 తగ్గించేసింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.

గూగుల్ పిక్సెల్

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ కింద ఎక్స్చేంజ్ ఆఫర్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై రూ.20వేల వరకు, గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్ పై రూ.13,500 వరకు ధర తగ్గిపోయింది.

మోటో జెడ్, మోటో జెడ్ ప్లే లపై

మోటో జెడ్, మోటో జెడ్ ప్లే లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇలా శాంసంగ్ సీ9 ప్రొ, హానర్ 8, హ్యువాయ్ పీ9, సోని ఎక్స్?పీరియా ఎక్స్‌ఏ ఆల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ రేట్లను తగ్గించేసి, డిస్కౌంట్ ఆఫర్లను కల్పిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Flipkart Electronics Sale: Top deals on iPhone 7, 6s, Google Pixel, Moto Z and more read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot