Home
News

గూగుల్ గేమ్ ఆఫ్ ది ఇయర్, దుమ్మురేపుతున్న ఫన్నీ క్విజ్ గేమ్

గూగుల్ ఈ ఏడాది అనేక సంచలనాలకు వేదికగా నిలిచింది. గూగుల్ లో ఈ ఏడాది అనేక అంశాలు టాప్ ట్రెండ్ లోకి దూసుకెళ్లాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

గూగుల్ ఈ ఏడాది అనేక సంచలనాలకు వేదికగా నిలిచింది. గూగుల్ లో ఈ ఏడాది అనేక అంశాలు టాప్ ట్రెండ్ లోకి దూసుకెళ్లాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా క్విజ్, గేమ్స్ వంటి విభాగాల్లో కొన్ని దుమ్మురేపాయనే చెప్పవచ్చు.అయితే వీటన్నింటిమీద ఇప్పుడు గూగుల్ కొత్తగా గూగుల్ గేమ్ పేరుతో ఓ సరికొత్త క్విజ్ పోటీని తీసుకొచ్చింది. ఈ గేమ్ చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా సాగుతుంది. ఈ ఏడాది ట్రెండ్ అయిన అంశాల మీద ఈ గూగుల్ గేమ్ నడుస్తోంది. మరి ఆ గేమ్ ఎలా ఆడాలి. అందులోకి ఎలా ఎంటరవ్వాలి అనే విషయాలు అలాగే ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

రెండు మూడు రకాలైన ప్రశ్నలు

రెండు మూడు రకాలైన ప్రశ్నలు

గూగుల్ గేమ్ మీరు స్టార్ట్ చేసే సమయంలో మీకు రెండు మూడు రకాలైన ప్రశ్నలు వేయడంతో ఈ గేమ్ మొదలవుతుంది. ఈ ప్రశ్నలకు మీరు కేవలం 10 సెకండ్లలో మాత్రమే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పిన తరువాత మీరు మూడు లైవ్ గేముల్లోకి ఎంటరవుతారు.

మూడు రకాలైన హార్ట్ సింబల్స్

మూడు రకాలైన హార్ట్ సింబల్స్

అక్కడ మీకు మూడు రకాలైన హార్ట్ సింబల్స్ కనిపిస్తాయి. ఆ తరువాత మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్ కి మీరు కొన్ని పాయింట్లను అందుకుంటారు. మీరు జవాబు ఎంత త్వరగా ఇస్తే అంత ఎక్కువ పాయింట్లను ఈగేమ్ లో మీరు సాధించుకోవచ్చు.

 

 

ఒక్కో జవాబుకి 20 బోనస్ పాయింట్లు

ఒక్కో జవాబుకి 20 బోనస్ పాయింట్లు

మొత్తం ఈ గేమ్ ద్వారా మీరు మొత్తం ఒక్కో జవాబుకి 20 బోనస్ పాయింట్లను పొందుతారు. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో అనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఉంటుంది. అయితే ఇది కేవలం సరదాని ఇష్టపడేవారికి, నాలెడ్జ్ ని పెంచుకునేవారికి మాత్రమేనని చెప్పవచ్చు.

షేరింగ్

షేరింగ్

ఈ గేమ్ పూర్తి అయిన తరువాత మీరు సాధించిన పాయింట్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. Facebook and Twitterలో ఉన్న మీ స్నేహితులతో మీరు సాధించిన స్కోరుని పంచుకోవచ్చు.

 

 

గూగుల్ ట్రెండ్ అంశాలు

గూగుల్ ట్రెండ్ అంశాలు

కాగా గూగుల్ లో ఈ ఏడాది టాప్ లో నిలిచన అంశాలను విడుదల చేసింది. యూజర్లు ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారు అనే లిస్టును విడుదల చేసింది. news, sports, politics, media and entertainment ఇలా అన్ని రంగాల్లో టాప్ లో నిలిచిన వాటిని గూగుల్ ప్రకటించింది.

 

 

టాప్ టెన్ ఇవే

టాప్ టెన్ ఇవే

టాప్ టెన్ లో నిలిచిన అంశాలు వరుసగా ఓ సారి పరిశీలిస్తే... ఫిపా వరల్డ్ కప్ 2018, లైవ్ స్కోర్, ఐపీఎల్ 2018, కర్ణాటక ఎన్నికల ఫలితాలు, బాల్ వీర్, బిగ్ బాస్,రోబోటో 2.0, ఆసియా కప్ 2018, Motu Patlu, ఏసియన్ గేమ్స్ నిలిచాయి.

How toలో టాప్ టెన్ ఇవే

How toలో టాప్ టెన్ ఇవే

How to సెర్చ్ లో ఈ ఏడాది టాప్ టెన్ ఫలితాలను గూగుల్ విడుదల చేసింది. వీటిల్లో వాట్సప్ ఫస్ట్ ఫ్లేసులో నిలిచింది. How to send stickers on WhatsApp అనే అంశాన్ని యూజర్లు తెగ సెర్చ్ చేశారు. వీటితో పాటుగా

How to link Aadhaar with mobile number

How to make rangoli

How to port mobile number

How to invest in bitcoin

Ayushman Bharat Yojana how to apply

How to remove holi colour from face

How to check 10th result 2018

How to solve Rubik's cube

How to check name in NRC Assam లాంటి అంశాలు చాలా బాగా పాపులర్ అయ్యాయి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
This, and not PUBG or Fortnite, is Google's game of the year More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X